Twitter Account : X అకౌంట్ ను క్లోజ్ చేయాలనుకుంటున్నారా.. అకౌంట్ ను ఎవరికీ కనిపించకుండా డిలీట్ చేద్దాం అనుకుంటున్నారా.. ట్విట్టర్లో ఎకౌంట్ డిలీట్ చేసిన 30 రోజుల తర్వాత ఆటోమేటిగ్గా అన్ని పోస్ట్లు డిలీట్ అయిపోతాయి. అయితే మరి కొన్నాళ్ల తర్వాత అయినా ఇదే యూజర్ నేమ్ తో ఇంకెవరైనా అకౌంట్ ను క్రియేట్ చేసే అవకాశం లేకపోలేదు. మరి ఎలా.. అకౌంట్ ను డిలీట్ చేయకుండానే సేఫ్ గా దాచేసే బెస్ట్ ఆఫ్షన్ ఒకటుంది. అది ఏంటంటే..
ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేయకుండానే సేఫ్ గా దాచేేసే అవకాశం ఉంది. తలుపులు మూసి తాళం విసిరేసే బెస్ట్ ఆఫ్షన్ చాలా మందికి తెలియదు. ట్విట్టర్లో డియాక్టివేషన్ ప్రక్రియను ప్రారంభించినప్పటి నుంచి ఖాతా శాశ్వతంగా తొలగించటానికి 30 రోజులు పడుతుంది. ట్వీట్లు, పోస్టులు అన్నీ డిలీట్ అయిపోతాయి. ఇక ఆ 30 రోజుల తర్వాత మీ పేరుపై అన్ని హక్కులు మీరు వదులుకున్నట్టే. ఇక వేరొకరు అదే పేరుతో అకౌంట్ క్రియేట్ చేయాలంటే ట్విట్టర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి తనకు నచ్చినంత కాలం ఆ అకౌంట్ ను వాడుకునే అవకాశం ఉంటుంది.
ఇక ఇలా మీ పాత అకౌంట్ తో వేరొకరు కొత్త అకౌంట్ ను మొదలుపెట్టి వాడుకోవడం అనే విషయాన్ని ఎంత మాత్రం తేలికగా తీసుకునే విషయం కాదు. కొత్త వ్యక్తి ఆ ఖాతాను ఉపయోగిస్తూ బ్లూటిక్స్ తో దృవీకరించుకునే అవకాశం సైతం ఉంటుంది. దీనివల్ల కొత్త వ్యక్తి ఏం పోస్ట్ చేసినా ఆ ఖాతా మీ అకౌంట్ నుంచి పోస్ట్ చేసినట్టే కనిపించే అవకాశం సైతం ఉంటుంది. మంచి, చెడు రెండూ వేగంగా విస్తరిస్తున్న ఈ సోషల్ మీడియా కాలంలో మీ పేరుతో వేరేవారికి అకౌంట్ ఉండటం అనేది సరైన విషయం కాదు. ఇందుకు ప్రత్యమ్నాయంగా ఏం చేయాలంటే..
X ఖాతాను సేఫ్ లో పెట్టేయండి –
⦿ X ఖాతాను డిలీటే చేయకుండా సేఫ్ లో పెట్టేయండి.
⦿ అన్ని పోస్ట్‌లను తొలగించేయండి
⦿ ఒక్కోక్కటిగా చూస్తూ ప్రతీ పోస్ట్ ను ట్వీట్ డిలీటర్ సాయంతో తొలగించాలి
⦿ ట్వీట్ డిలీటర్ కు ప్రత్యేకంగా కొంత మనీ చెల్లించాల్సి ఉంటుంది.
⦿ 30 రోజుల తర్వాత మెుత్తం పోస్టులన్నీ డిలీట్ అయిపోతాయి
ట్వీట్స్ అన్నీ డిలీట్ అయిపోయాక Settings and privacy బటన్ పై క్లిక్ చేసి Privacy and safetyలోకి వెళ్లాలి. Audience and taggingలోకి వెళ్లి “Protect your posts.” పైన క్లిక్ చేయాలి. పబ్లిక్ కు సంబంధించిన పోస్టులు, లైక్స్ వంటివి ఉంటే వాటిని అన్ ఫాలో చేసేయాలి. ప్రొఫైల్లోకి వెళ్లి పర్సనల్ సమాచారాన్ని డిలీట్ చేసి ప్రొఫైల్ ఫోటోను మార్చేయాలి. ఆ తర్వాత ఎవరూ ఊహించనట్లు పాస్ వర్డ్ పెట్టి అకౌంట్ ను వదిలేయాలి. దీంతో ఆ అకౌంట్ డిజిటల్ లాక్ అయిపోతుంది. తలుపులు మూసేసి తాళం పారేసినట్లు అవుతుంది. ఇక ఆ అకౌంట్ ను ఎవరూ ఓపెన్ చెయ్యలేరు. ఆ పేరుతో మరొకరు అకౌంట్ ఓపెన్ చేయలేరు.
ALSO READ : డిలీట్ చేయకుండానే అకౌంట్‌ని క్లోజ్ చేయొచ్చు… ఎవ్వరికీ తెలియని ఈ ట్రిక్‌పై ఓ లుక్ వేయండి