BigTV English

Bigg Boss 8 Telugu Promo : పృథ్వీ vs నబీల్… కొట్టుకు చచ్చేలా ఉన్నారే..

Bigg Boss 8 Telugu Promo : పృథ్వీ vs నబీల్… కొట్టుకు చచ్చేలా ఉన్నారే..

Bigg Boss 8 Telugu Promo : బిగ్ బాస్ సీజన్ 8 అప్పుడే 68వ రోజుకు వచ్చింది. రోజులు పెరుగుతున్నాయంటే… కంటెస్టేంట్స్‌లో గెలవాలనే కసి కూడా పెరుగుతుంది. అలాగే, ఒకరిపై ఒకరికి కోపాలు కూడా పెరగుతున్నాయి. తాజాగా ఈ రోజు రిలీజ్ అయిన ఫస్ట్ ప్రోమోను చూస్తే… వీళ్లేంటి కొట్టుకు చచ్చేలా ఉన్నారు అని అనిపిస్తుంది. పృథ్వీ, నబీల్ మధ్య టాస్క్ లో జరిగిన ఓ గొడవ తీవ్ర స్థాయికి వెళ్లినట్టు కనిపిస్తుంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం…


బిగ్ బాస్ హౌస్ అంటే సీజన్ సీజన్ కు ఆడియన్స్‌కు ఓపీనియన్ మారుతూ వస్తుంది. ఫస్ట్ సీజన్‌ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వచ్చిన సీజన్‌కు ఇప్పుడు నాగార్జున హోస్ట్ గా వస్తున్న బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ కు చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పుడు కంటెస్టెంట్స్ తాము గెలవడానికి గేమ్ ఆడటం లేదు… పక్క కంటెస్టెంట్స్ ను ఓడించాలని గేమ్ ఆడుతున్నారు. అందుకే హౌస్ లో చాలా గొడవలు అవుతున్నాయి.

తాజాగాఈ రోజు రిలీజ్ అయిన ఫస్ట్ ప్రోమోను గమనిస్తే… పృథ్వీ, నబీల్ మధ్య చాలా పెద్ద గొడవ అయినట్టు తెలుస్తుంది. ఒకరినొకరు నెట్టుకోవడం కూడా జరిగింది ఈ గొడవలో. నిజానికి ఓ గేమ్ గా ఆడితే.. ఇలాంటి గొడవలు కనిపించవు. జరగవు. కానీ, హౌస్‌లో గెలవడం కోసం కాదు… పక్క కంటెస్టెంట్స్‌ను ఓడించడం కోసం గేమ్స్ ఆడుతున్నారు. ఈ ప్రోమోలో జరిగిన గొడవ కూడా అలా జరిగిందే.. అని తెలుస్తుంది.


ఈ టాస్క్ కి ముందు… పృథ్వీకి తాను నేను నీకు సపొర్ట్ చేయలేను. నాకు సపొర్ట్ చేసిన వాళ్లు ఇప్పుడు నా నుంచి సపొర్ట్ అడుగుతున్నారు అని నబీల్ అంటాడు. అక్కడ నబీల్ ఒకసారిగా సపొర్ట్ ఇవ్వను అని చెప్పడంతో పృథ్వీ హర్ట్ అయినట్టు తెలుస్తుంది. అదే తర్వాత వచ్చిన టాస్క్ లో చూపించారని స్పష్పంగా తెలుస్తుంది. పృథ్వి, నబీల్ నిన్నటివరకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్లు తెగ ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇక టాస్క్ విషయానికి రాగానే పెద్ద యుద్ధం చేశారు. కొట్టుకోవడం ఒక్కటే తక్కువ మాటలతో ఒకరినొకరు రెచ్చగొట్టుకున్నారు. హౌస్ లో వాళ్ళు ఎంతగా ఆపడానికి ప్రయత్నించినా ఇద్దరు వెనక్కి తగ్గలేదు.. అయితే ఇదంతా చూస్తుంటే కావాలనే చేసారా? లేక నిజంగానే టాక్ చేసారా అన్నది ఈరోజు ఎపిసోడ్ ను చూస్తే అర్థం అవుతుంది.

మొత్తానికి ప్రోమోను చూస్తుంటే ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగేలా ఉంది. చూద్దాం ఎమౌతుందో.. ఇక ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉందని తెలుస్తుంది. గంగవ్వ వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఏం జరుగుతుందో ఎవరు వెళ్తారో చూడాలి.. ఈ వారం హరితేజ ఎలిమినేట్ అవుతుందని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గత వారం నయని పావని, హరితేజ ఇద్దరికీ ఇంచుమించు ఓటింగ్ ఒకటే.. లక్కు కొద్ది హరితేజ సేవ్ అయ్యింది. నయని బయటకు వెళ్ళింది.. ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి..

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×