BigTV English

Air Forces: వైమానిక దళాల్లో టాప్-10 ర్యాంకులు కల్గిన దేశాలివే.. మన భారత్ ర్యాంక్ ఎంతంటే..?

Air Forces: వైమానిక దళాల్లో టాప్-10 ర్యాంకులు కల్గిన దేశాలివే..  మన భారత్ ర్యాంక్ ఎంతంటే..?
Advertisement

Air Forces: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తి వంతమైన వైమానిక దళాలకు గ్లోబల్ ఫైర్ పవర్.కామ్ అనే సంస్థ ర్యాంకులను ప్రకటించింది. ఫైటర్ జెట్‌లు, హెలికాప్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లతో సహా వారి విమానాల జాబితా ఆధారంగా ర్యాంకులను ఇచ్చింది.


ఈ జాబితాలో ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైన వైమానిక దళం ఉన్న దేశంగా అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో రష్యా, చైనా దేశాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఐదో స్థానంలో సౌత్ కోరియా, ఆరో స్థానంలో జపాన్, ఏడో స్థానంలో పాకిస్థాన్‌కు గ్లోబల్ పవర్. కామ్ ర్యాంకులను ఇచ్చింది.

టాప్-10 ర్యాంకులివే..


1. అమెరికా

2. రష్యా

3. చైనా

4. భారత్

5. సౌత్ కొరియా

6. జపాన్

7. పాకిస్థాన్

8. ఈజిఫ్ట్

9. టర్కీ

10. ఫ్రాన్స్

ప్రపంచంలోనే అమెరికా వైమానిక దళంలో ఎదురు లేని శక్తిగా నిలిచిందని పేర్కొంది. వైమానిక దళానికి సంబంధించి రష్యా, చైనా, ఇండియా, సౌత్ కొరియా, జపాన్ దేశాలకంటే అమెరికా అత్యంత శక్తి వంతమైనదిగా ఉందని చెప్పింది. యూఎస్ వైమానిక దళం 5,737 హెలికాప్టర్లు, 1854 ఫైటర్ జెట్‌లు, 3722 సహాయక విమానాలతో పటిష్టంగా ఉందని వివరించింది. అమెరికా వైమానిక దళ వార్షిక బడ్జెట్ 800 బిలియన్ డాలర్లతో.. ప్రపంచంలోని సైనిక వ్యయంలో 40 శాతం వాటాను కలిగి ఉంది.

యూఎస్ వైమానిక శక్తిలో మూడింట ఒక వంత భాగం రష్యా వైమానక దళం ఉంటుందని తెలిపింది. రష్యా 1,554 హెలికాప్టర్లు, 809 ఫైటర్ జెట్‌లు, 610 సహాయక విమానాలను నడుపుతోంది. అయితే.. 2022లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 220 విమానాలు ధ్వంసం కావడంతో అది నష్టాలను చవిచూసింది. వైమానిక దళంలో చైనా మూడో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. చైనా వైమానిక దళాన్ని విస్తరించడంలో భారీ ఇన్వెస్ట్ మెట్ చేస్తోంది. ఇటీవల చైనా ఆరో తరం ఫైటర్ జెట్‌ను కూడా తన ఫ్లీట్‌లో చేర్చుకుంది. సూపర్ సోనిక్ ఎయిర్‌క్టాప్ట్‌ ఏర్పాటుపై కూడా కసరత్తులు చేస్తోంది.

ఇండియా, సౌత్ కొరయా, జపాన్ దేశాలు వరుసగా నాలుగు, ఐదు, ఆరో స్థానాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ దేశాలు 2,296, 1,576 మరియు 1,459 విమానాలను కలిగి ఉన్నాయి. ఏడో స్థానం కలిగి ఉన్న పాకిస్థాన్ 1434 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, సహాయక విమానాలను నడుపుతోంది. ఈజిఫ్ట్, టర్కీ, ఫ్రాన్స్ దేశాలు 1080, 1069, 972 విమానాలతో తర్వాత స్థానాలను కలిగి ఉన్నాయి.

Also Read: Sathya Kumar Yadav on Peddireddy: సాయిరెడ్డి వ్యవసాయం చేసుకుంటే నాకేంటి? పెద్దిరెడ్డి సంగతి తేలుస్తాం.. మంత్రి సత్యకుమార్

చైనా దేశం సైన్స్ అండ్ టెక్నాలజీ తన సాంకేతిక సామర్థ్యాలను అభివృద్ధి చేస్తున్నప్పుడు రష్యా, ఉక్రెయిన్ లాంటి దేశాలకు కొనసాగుతున్న సంఘర్షణల కారణంగా తమ నౌకదళాలను నిర్వహించడంతో సవాళ్లను ఎదుర్కొంటుంది. మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా వైమానిక దళ శక్తిలో అమెరికా అత్యంత శక్తివంతమైనదిగా నిలిచింది. రష్యా, చైనా, భారత్, సౌత్ కొరియా, జపాన్, పాకిస్థాన్, ఈజిప్ట్, టర్కీ, ఫ్రాన్స్ దేశాలు వరుస ర్యాంకులను కలిగి ఉన్నాయి.

Related News

Flipkart Big Sale: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేల్‌ మళ్లీ షురూ.. రూ.8,999 నుంచే స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సగం ధరకు

Realme GT 8: రియల్‌ మి GT 8 vs GT 8 ప్రో.. రెండు పవర్‌ఫుల్ గేమింగ్ ఫోన్లు.. ఏది కొనాలి?

India Cheap Smartphone market: ఇండియాలో స్మార్ట్ ఫోన్స్ చాలా తక్కువ ధరకే లభించే మార్కెట్లు.. ఆన్ లైన్ కంటే చీప్

Toyota GR86 Car: డ్రైవింగ్ ప్రియుల కలల రైడ్.. టర్బో ఇంజిన్ అప్‌డేట్‌తో మార్కెట్‌లోకి 2025 టయోటా GR86

Whatsapp secret Trick: వాట్సాప్‌లో సీక్రెట్‌ ట్రిక్.. సెండర్‌కు తెలియకుండా ఫోటోలు చూడాలంటే ఇలా చేయండి

Nokia Luxury 5G: రూ.26,999కే 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజ్.. నోకియా లగ్జరీ 5జి తో ప్రీమియం డిజైన్

Smartphone Comparison: మోటోరోలా G45 vs గెలాక్సీ M17 5G vs రెడ్‌మి 15 5G.. రూ.15000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Vivo X90 Pro 5G: పాత ఫోన్లు మర్చిపోండి.. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వివో ఎక్స్90 ప్రో 5జి డే మొత్తం పవర్

Big Stories

×