CM Revanth Reddy: mరాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర ఇంటింటి సర్వే తీరు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే పకడ్బందీగా సమగ్ర ఇంటింటి సర్వే నిర్వహించిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుందని సీఎం అన్నారు. జాతీయస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేపై ప్రశంసలు అందుతున్నాయన్నారు. సర్వేకు సంబంధించిన ముసాయిదా సిద్ధమైందని, ఒకటి రెండు రోజుల్లో సమర్పిస్తామని ఈ సందర్భంగా సీఎంకు అధికారులు వివరించారు. పూర్తి నివేదికను ఫిబ్రవరి రెండవ తేదీలోగా కేబినెట్ సబ్ కమిటీకి అందజేసే వీలు ఉందని అధికారులు చెప్పారు.
Also Read: MLC Elections: తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. గెలుపు గుర్రాల కోసం వేట?
ఇక, ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని, గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రం నుంచి అవసరమైన సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
కుంభమేళా తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
ఆ కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదుకోవాలని.. గాయపడినవారికి సరైన వైద్యం అందించాలన్న రేవంత్
రాష్ట్రం నుంచి అవసరమైన సాయం అందించడానికి… https://t.co/yadKxTolxf pic.twitter.com/t5w1ThWbmO
— BIG TV Breaking News (@bigtvtelugu) January 29, 2025