Samsung Galaxy Z Flip 7 : ఎప్పటికప్పుడు యూజర్స్ కోసం లేటెస్ట్ మొబైల్స్ అందుబాటులోకి తీసుకువస్తున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్సంగ్. ఈ సంస్థ ఇప్పటికే ఈ ఏడాది అదిరిపోయే లేటెస్ట్ మొబైల్ సిరీస్ ను లాంఛ్ చేసింది. గెలక్సీ S25 సిరీస్ ను అధునాతన ఫీచర్స్ తో తీసుకువచ్చేసింది. ఇప్పుడు తన లైనప్ లో మరో ఫోల్డబుల్ మొబైల్ ను తీసుకురాటానికి సన్నాహాలు చేస్తుంది. మరి ఆ మొబైల్ ఏంటి? ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం.
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్సంగ్ మొబైల్స్ కు ఉండే డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కీప్యాడ్ మొబైల్స్ నుంచి ఆండ్రాయిడ్ వరకు ఈ మొబైల్స్ కు ఉండే డిమాండ్ వేరు. ఈ సంస్థ ఎన్నో అధునాతన ఫీచర్స్ తో కొత్త సిరీస్ ను తీసుకొచ్చేసింది. తాజాగా గెలాక్సీ ఎస్ 25 సిరీస్ లో భాగంగా అదిరిపోయే నాలుగు మొబైల్స్ ను తీసుకువచ్చేసింది. ఈ సంస్థ త్వరలోనే గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 మొబైల్ ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. సామ్సంగ్ తీసుకురాబోయే గెలాక్సీ Z ఫ్లిప్ 7 మొబైల్ ఈ ఏడాది చివర్లో రాబోతున్నట్టు తెలుస్తోంది. సాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 లో ఉన్నట్టే అదిరే ఫీచర్స్ ఈ మొబైల్ లో ఉండనున్నట్టు తెలుస్తోంది.
Sasmsung Galaxy Z Flip 7 Features –
Samsung Galaxy Z ఫ్లిప్ 7 మొబైల్ లేటెస్ట్ ఫీచర్స్ తో అందుబాటులోకి రాబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ మొబైల్ లో కొత్త Exynos 2500 చిప్‌సెట్ ఉండనుందని సమాచారం. నెక్ట్స్ జనరేషన్ క్లామ్‌షెల్ ఫోల్డబుల్ ఫోన్.. స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ కంటే మెరుగ్గా పనిచేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో ఇంటర్నల్ Exynos 2500 ఉండబోతోందని.. Exynos చిప్‌సెట్ గెలాక్సీ ఫోల్డబుల్ మెుబైల్స్ లో తీసుకురాబోతుందని తెలుస్తుంది. అయితే కొద్ది రోజుల క్రితమే ఎంతో గ్రాండ్ గా లాంచ్ అయిన గెలాక్సీ S25 సిరీస్ ఎక్సినోస్ 2500 ప్రాసెసర్ తో పనిచేస్తుందనే టాక్ వినిపించింది. అయితే ఈ లక్ష్యాన్ని సామ్ సాంగ్ చేరుకోలేకపోయింది. ఇక స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో ఈ సిరీస్ వచ్చేసింది.
టిప్‌స్టర్ జుకాన్ తెలిపిన సమాచారం ప్రకారం.. కంపెనీ Samsung Exynos 2500 చిప్‌సెట్‌తో Galaxy Z ఫ్లిప్ 7ను ఆవిష్కరించబోతోందని తెలుస్తుంది. ఇక సాంసంగ్ ఇంతకు ముందు తీసుకొచ్చిన ఫోల్డబుల్ మొబైల్స్ తో సమానంగా ఈ మొబైల్ ఉండనుంందని సమాచారం. Galaxy Z Flip 6 భారతదేశంలో ధర రూ.1,09,999 నుండి ప్రారంభమవుతుంది. అంటే Galaxy Z Flip 7 కూడా అదే పరిధిలో ఉండే ఛాన్స్ కనిపిస్తుంది.
రాబోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్ 6.85 అంగుళాల మెయిన్ స్క్రీన్‌తో పెద్ద డిస్‌ప్లేతో రాబోతుందని తెలుస్తుంది. ఇది గెలాక్సీ Z ఫ్లిప్ 6 మెుబైల్ లో ఉన్న 6.7 అంగుళాల డిస్‌ప్లే కంటే పెద్దదిగా ఉంటుంది. అదనంగా, ఈ స్మార్ట్‌ఫోన్ 4 కవర్ స్క్రీన్స్ కూడా కలిగి ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఈ మొబైల్ ఫీచర్స్ ను సామ్ సాంగ్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు కానీ త్వరలోనే లేటెస్ట్ అప్డేట్స్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది.
ALSO READ : ఇకపై ‘ఎక్స్’లో డిజిటల్ పేమెంట్స్