BigTV English
Advertisement

Jubilee by-election: చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఏ పార్టీపై ఎఫెక్ట్ పడనుంది..?

Jubilee by-election: చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఏ పార్టీపై ఎఫెక్ట్ పడనుంది..?

Jubilee by-election: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో 19 మంది అమాయక ప్రజలు మృతి చెందగా.. మరో 19 మంది వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. కంకర లోడుతో వస్తున్న టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే.. ఈ విషాద ఘటన ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోలింగ్‌కు ముందు.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ పార్టీలపై ఈ ఘటన ప్రభావం కొంత మేర పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన నిర్లక్ష్యమే ఈ ఘోరానికి కారణమని ప్రమాదానికి గురైన మృతుల కుటుంబ సభ్యులు, అక్కడి స్థానిక ప్రజలను  తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో రోడ్డు పనుల అభివృద్ధిని పట్టించుకోకపోవడం వల్లే ఈ రోజు 19 మంది అమాయక ప్రాణాలు పోయాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారి (NH-163)ని డబుల్ లైన్ రోడ్డుగా మార్చడంలో జాప్యం చేయడమే ఈ ప్రాణ నష్టానికి ప్రధాన కారణమని అంటున్నారు.

‘పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లాలో రోడ్డు అభివృద్ధి పనులను పట్టించుకోలేదు. బీఆర్‌ఎస్ వల్లే ఈ ప్రమాదం జరిగింది. మృతుల ఉసురు బీఆర్‌ఎస్ వాళ్లకి తగులుతుంది’ అని బాధిత కుటుంబ సభ్యుల్లో ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి పైన మండిపడుతున్నారు. ‘బీఆర్ఎస్ హయాంలో ఈ ఇద్దరు నేతలు మా జిల్లాకి చేసింది ఏం లేదు. రాత్రి పూట మా ఊర్లకి వెళ్ళాలి అంటే భయం. బీఆర్‌ఎస్ నేతలు మెదక్, కరీంనగర్ జిల్లాలను పట్టించుకునంతా మా జిల్లాను 50% పట్టించుకోలేదు’ అని బాధిత కుటుంబ సభ్యుడు ఫైరయ్యాడు.


‘పదేండ్లలో తెలంగాణను ఎక్కడికో తీసుకెళ్లామని డబ్బా కొట్టుకునే బీఆర్‌ఎస్ పార్టీ… కనీసం చేవెళ్లకు డబుల్ లైన్ రోడ్డు వేయించలేకపోయింది. ఈ చావులకు కారణం బీఆర్ఎస్ కాదా?” అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు అభివృద్ధి కోసమే బీఆర్‌ఎస్‌లో చేరానని చెప్పిన సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి ఫైరవుతున్నారు. ‘ఆనాడు అభివృద్ధి కోసమే పార్టీ మారనన్నావు కదా సబితమ్మా.. అప్పుడు మీ బీఆర్‌ఎస్ ప్రభుత్వమే గనక అభివృద్ది చేసి ఉంటే ఈనాడు 19 మంది అమాయకులు బలయ్యేవారా?” అని నిలదీస్తున్నారు.

జూబ్లీలో బీఆర్ఎస్‌పై ఎఫెక్ట్..?

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్‌జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్)తో పోరాడి, ఎట్టకేలకు పర్యావరణ అనుమతుల విషయంలో క్లియరెన్స్ తీసుకొచ్చారని.. పనులు వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పదేళ్ల పాలనలో రోడ్ల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారన్న ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదం జూబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. రంగారెడ్డి జిల్లా సమస్యలను పట్టించుకోలేదనే విమర్శలు జూబ్లీహిల్స్ ఓటర్లపైనా ప్రభావం చూపొచ్చు.

ALSO READ: Kodangal: కొడంగల్ విద్యార్థులకు “అక్షయ పాత్ర” అభయం.. ఇకపై నాణ్యమైన మధ్యాహ్న భోజనం!

కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి తక్షణ సహాయం ప్రకటించడం.. రోడ్డు అభివృద్ధి పనుల క్లియరెన్స్‌ను వేగవంతం చేయడాన్ని హైలైట్ చేయడం ద్వారా సానుభూతి పొందే అవకాశం ఉంది.  ఉపఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో ఈ ఘటన బీఆర్‌ఎస్‌కు కొంచెం నెగిటివ్ గా మారే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

Related News

Adilabad Airport: దశాబ్దాల కల నెరవేరే ఛాన్స్.. ఆదిలాబాద్ విమానాశ్రయం అభివృద్ధి దిశగా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

Sanga Reddy: భార్య చెప్పిన పాస్ట్ లవ్ స్టోరీ మనస్తాపంతో.. పెళ్లయిన నెలలకే నవవరుడి ఆత్మహత్య.. !

Jubilee Hills Byelection: సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే ఉన్నాయి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

DCC Presidentship: మేడిపల్లికి.. డీసీసీ పగ్గాలు

Jagityala News: రూ.50 లేక తల్లిని భుజాన మోసిన కుమారుడు.. కన్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనం

TGSRTC: చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు డ్రైవర్ తప్పులేదని ప్రాథమిక నిర్ధారణ

Jubilee Hills Bypoll:జూబ్లీహిల్స్ బైపోల్.. ప్రచారాల్లో కనిపించని ఆ ఇద్దరు కీలక నేతలు..?

Big Stories

×