Big Stories

Bikes Under Rs.2 Lakhs: అదిరిపోయే బైక్‌.. కేవలం రూ. 2 లక్షలకే.. ఇదే మంచి తరుణం.. కొనేయండి

Bikes Under Rs.2 Lakh: వాహన ప్రియులు మంచి లుక్‌తో పెద్దగా కనిపించే బైక్‌లకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. అయితే అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ వాహనాల తయారీ కంపెనీలు బడ్జెట్ ధర, అదిరిపోయే ఫీచర్స్, సూపర్ డిజైన్, లుక్‌తో మార్కెట్‌లోకి పలు మోడళ్లను పరిచయం చేస్తున్నాయి. మరి మీరు కూడా అలాంటి బైక్స్‌ను తక్కువ ధరలో కొనుక్కోవాలనుకుంటున్నారా? ప్రస్తుతం అలాంటి బైక్‌లనే వెతుకుతున్నట్లయితే.. అదిరిపోయే బైక్‌ను రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల మధ్య కొనుక్కునే అద్భుతమైన అవకాశం ఇక్కడ ఉంది. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

- Advertisement -

Royal Enfield Hunter 350:

- Advertisement -

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ మంచి లుక్‌తో వాహన ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. ఇది 3 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా 10 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ రోడ్‌స్టర్ బైక్ 349.34cc, BS6 ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 20.2bhp/27NM శక్తిని ఉత్పిత్తి చేస్తుంది. ఈ బైక్ ముందు, వెనుక వైపు డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఇందులో సింగిల్ ఛానల్ ABS కూడా అమర్చబడి ఉంది. అయితే దీని ధర రూ.1.49 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

Bajaj NS200:

బజాజ్ ఎన్ఎస్ 200 అనేది నేక్డ్ డిజైన్ బైక్. ఇందులో 199.5cc, BS6 ఇంజిన్‌తో వస్తుంది. దీని ఇంజిన్ 24.13bhp/18.74NM శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా ముందువైపు, వెనుకవైపు డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది. అలాగే యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్‌ కూడా ఉంది. అయితే దీని ధర రూ.1.42 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

TVS Ronin:

టీవీఎస్ రోనిన్ బైక్ చాలా పెద్దగా కండల తిరిగిన బాహుబలిలా స్టైలిష్‌గా ఉంటుంది. ఈ బైక్ నాలుగు వేరియంట్లతో దాదాపు 7 కలర్ ఆప్షన్లలో వస్తుంది. దీని 225.9cc,BS6 ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 20.1bhp/19.93NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది డ్యూయల్ ఛానల్ యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)తో వస్తుంది. అయితే దీని ధర రూ.1.49 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి స్టార్ట్ అవుతుంది.

TVS Apache RTR 200 4V:

టీవీఎస్ అపాచి ఆర్‌టిఆర్ 200 4వి బైక్ రెండు వేరియంట్లలో వస్తుంది. ఇది 3 కలర్ ఆప్షన్లను కలిగి ఉంది. ఇందులో 200cc, సింగిల్ సిలిండర్ BS6 ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 20.54bhp, 17.25NM అవుట్‌పుట్ ఇస్తుంది. ఇందులో కూడా ముందు, వెనుకవైపు డిస్క్‌బ్రేక్‌లతో కూడిన ఏబీఎస్ ఉంది. ఈ బైక్ ధర రూ.1.42 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Yamaha R15S:

యమహా ఆర్15ఎస్ బైక్ కేవలం ఒకే ఒక్క వేరియంట్‌లో వస్తుంది. రెండు కలర్ ఆప్షన్లను కలిగి ఉంది. దీని 155cc BS6-2.0 ఇంజిన్ 18.6PS, 14.1NM శక్తిని ఉత్పత్తి చస్తుంది. ఈ బైక్‌కి కూడా ముందు, వెనుక వైపు డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఇక ఈ బైక్ ధర రూ.1.65 లక్షలు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News