E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

మ్యూజిక్ లవర్స్‌కు పండగే..మోడ్రన్ సౌండ్‌ను రీడిఫైన్ చేసే బ్రాండెడ్ హెడ్‌ఫోన్స్!

మ్యూజిక్ లవర్స్‌కు పండగే..మోడ్రన్ సౌండ్‌ను రీడిఫైన్ చేసే బ్రాండెడ్ హెడ్‌ఫోన్స్!
Advertisement

Best Premium Headphones 2026: మ్యూజిక్ అనేది కేవలం వినడానికి మాత్రమే కాదు.. అదొక అద్భుతమైన ఫీలింగ్. అందుకే నిజమైన ఆడియో లవర్స్ ఎప్పుడూ సౌండ్ క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో తక్కువ ధరకు దొరికే ఇయర్‌ఫోన్స్ ఉన్నప్పటికీ, లగ్జరీ ఆడియో బ్రాండ్స్ ఇచ్చే ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ రేంజే వేరు. సోనీ, బోస్, మార్షల్ వంటి గ్లోబల్ జైంట్స్ లేటెస్ట్ సౌండ్ టెక్నాలజీని సరికొత్తగా రీడిఫైన్ చేస్తూ బెస్ట్ గ్యాడ్జెట్స్‌ను మార్కెట్లోకి తెచ్చాయి.ప్రస్తుతం మార్కెట్‌ను రూల్ చేస్తున్న టాప్ 5 బ్రాండెడ్ ప్రీమియం హెడ్‌ఫోన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మోడ్రన్ ఆడియో ట్రెండ్స్:

Advertisement

ప్రీమియం హెడ్‌ఫోన్స్ కేటగిరీలో యూజర్లు కేవలం వైర్‌లెస్ కనెక్టివిటీ మాత్రమే కాకుండా.. ‘లాస్‌లెస్ ఆడియో’,’స్పేషియల్ సౌండ్’, ఇంటెలిజెంట్ ఏఎన్‌సీ’ ఫీచర్స్ కోసం ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ఆఫీస్ వర్క్, ట్రావెలింగ్ లేదా గేమింగ్.. ఇలా దేనికైనా సరే, చుట్టుపక్కల శబ్దాలు అస్సలు వినబడకుండా పిన్-డ్రాప్ సైలెన్స్ క్రియేట్ చేసే స్మార్ట్ హెడ్‌ఫోన్స్‌కే ఇప్పుడు క్రేజ్ ఎక్కువ.

సోనీ WH-1000XM5 (Sony WH-1000XM5):
ప్రీమియం హెడ్‌ఫోన్స్ అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు సోనీ. ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్ మార్కెట్లో బెస్ట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కింగ్ అని చెప్పవచ్చు. ఇందులో అమర్చిన మల్టిపుల్ మైక్రోఫోన్స్ , స్మార్ట్ ప్రాసెసర్ బయటి శబ్దాలను 100 శాతం ఫిల్టర్ చేస్తాయి. ఇందులో ‘స్పేక్-టు-చాట్’ అనే క్రేజీ ఫీచర్ ఉంది.. మీరు ఎవరితోనైనా మాట్లాడటం స్టార్ట్ చేయగానే సాంగ్ ఆటోమేటిక్‌గా పాజ్ అయిపోతుంది. బ్యాటరీ విషయానికి వస్తే ఇది ఏకంగా 30 గంటల నాన్‌స్టాప్ ప్లేబ్యాక్ టైమ్‌ను ఇస్తుంది.

Advertisement

బోస్ క్వైట్‌కంఫర్ట్ ఆల్ట్రా (Bose QuietComfort Ultra):
కంఫర్ట్ , లగ్జరీ సౌండ్ కలయికే ఈ బోస్ హెడ్‌ఫోన్. చెవులపై చాలా సాఫ్ట్‌గా ఫిట్ అయ్యే కుషన్స్ ఉండడం వల్ల గంటల తరబడి వాడుకున్నా అస్సలు పెయిన్ రాదు. ఇందులో ఉన్న సరికొత్త ఇమ్మర్సివ్ ఆడియో టెక్నాలజీ..మీరు థియేటర్ లోపల కూర్చుని లైవ్ మ్యూజిక్ వింటున్న ఫీలింగ్‌ను ఇస్తుంది. దీని కస్టమ్ ట్యూన్ ఆడియో ఫీచర్ మీ చెవి ఆకృతికి తగ్గట్టుగా సౌండ్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. సినిమా లవర్స్‌కు, హై-ఎండ్ ఆడియో స్ట్రీమింగ్ చేసే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

మార్షల్ మానిటర్ II ఏఎన్‌సీ (Marshall Monitor II ANC):
ఒక క్లాసిక్ రాక్ స్టార్ లుక్ , పవర్‌ఫుల్ బేస్ కావాలనుకునే వారి కోసం మార్షల్ బ్రాండ్ బెస్ట్ ఆప్షన్. దీని వింటేజ్ లెదర్ డిజైన్, ఐకానిక్ గోల్డెన్ బటన్ లుక్ ఎంతో ప్రీమియంగా ఉంటాయి. హెవీ బేస్, ట్రెబుల్ ఇష్టపడే వారికి దీని కస్టమ్-ట్యూన్డ్ డ్రైవర్లు పిచ్చెక్కించే సౌండ్ క్వాలిటీని ఇస్తాయి. ఇది ఏకంగా 45 గంటల భారీ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. దీనిని ఈజీగా ఫోల్డ్ చేసి చిన్న బ్యాగ్‌లో క్యారీ చేయవచ్చు. ట్రావెల్స్ చేసే వారికి ఇది సూపర్ పార్ట్నర్.

జేబీఎల్ క్లబ్ వన్ (JBL Club One):
ప్రొఫెషనల్ మ్యూజిక్ ప్రొడ్యూసర్స్, డీజేస్ వాడే లెవెల్ సౌండ్ కావాలంటే జేబీఎల్ క్లబ్ వన్ వైపు వెళ్ళవచ్చు. ఇది హై-రెజల్యూషన్ ఆడియో సర్టిఫికేషన్‌తో వస్తుంది. అంటే.. రికార్డింగ్ స్టూడియోలో సింగర్ ఎలా పాడారో, ప్రతీ చిన్న శబ్దాన్ని కూడా మిస్ అవ్వకుండా అలాగే మీ చెవులకు అందిస్తుంది. దీని గ్రాఫేన్ డ్రైవర్లు సౌండ్ అస్సలు డిస్టార్ట్ (పాడవ్వకుండా) అవ్వకుండా.. చూస్తాయి. దీని అడ్వాన్స్డ్ అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ప్రతీ సెకనుకు బయటి వాతావరణాన్ని స్కాన్ చేస్తూ కూలింగ్‌ను అడ్జస్ట్ చేస్తుంది.

Also Read: డిజిటల్ టచ్ ప్యానెల్‌తో వచ్చే.. బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!

సేన్‌హైజర్ యాక్సెంట్మ్ ప్లస్ (Sennheiser Accentum Plus):
ఆడియో ఇండస్ట్రీలో సేన్‌హైజర్ బ్రాండ్ జర్మన్ టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్.తక్కువ బడ్జెట్‌లో అల్ట్రా-ప్రీమియం ఆడియో క్వాలిటీ కోరుకునే వారి కోసం ఈ మోడల్ ఒక వరమని చెప్పవచ్చు. ఇది ఏకంగా 50 గంటల మైండ్ బ్లోయింగ్ బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంది. కేవలం 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్ పెడితే.. 5 గంటల పాటు వాడుకోవచ్చు. దీని టచ్ జెస్టర్ కంట్రోల్స్ చాలా స్మూత్‌గా పనిచేస్తాయి. కేవలం వేలితో స్వైప్ చేస్తూ వాల్యూమ్ పెంచవచ్చు లేదా ట్రాక్స్ మార్చవచ్చు.

ఏ మోడల్ లాక్ చేసుకోవాలి?
మీకు మార్కెట్లో బెస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ , స్మార్ట్ ఫీచర్స్ ముఖ్యం అనుకుంటే ‘సోనీ’ బెస్ట్. రోజంతా వాడుకోవడానికి సూపర్ కంఫర్ట్ , స్పేషియల్ ఆడియో కావాలంటే ‘బోస్’ వైపు వెళ్ళండి. అలాగే యూనిక్ రెట్రో లుక్, అల్ట్రా-లాంగ్ బ్యాటరీ ఇష్టపడే వారు ‘మార్షల్’ మోడల్‌ను లాక్ చేసుకోవచ్చు. మీ బడ్జెట్ , బ్రాండ్ ఇష్టాన్ని బట్టి పైన చెప్పిన వాటిలో ఒకదానిని సెలెక్ట్ చేసుకుని సరికొత్త ఆడియో ప్రయాణాన్ని ఎంజాయ్ చేయండి.

Related News

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్గెస్ట్ సేల్.. ఆ తేదీ నుంచే ఆఫర్ల వర్షం.. ఏ ఫోన్ ఎంత తగ్గుతుందంటే?

ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? ఈ 6 స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఉంటే.. మీ జర్నీ సూపర్‌హీట్!

ఈ ఒక్క కెమెరా ఫీచర్ కోసం వివో ఎంత పని చేసిందో.. X500 Pro లీక్స్ చూస్తే మతిపోతుంది!

డిజిటల్ టచ్ ప్యానెల్‌తో వచ్చే.. బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!

రూ.వేలలోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కెటిల్స్.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు

పాత ఏసీ రిపేరా? కొత్తది కొనాలా? ఈ ‘3’ విషయాలు మర్చిపోకండి!

ఏసీలో ‘ఆటో మోడ్’ ఉందా? వర్షాకాలంలో కెవ్వు కేక.. అదృష్టమంటే మీదే!

Big Stories

×