E-Paper
Advertisement

ఛార్జింగ్ తిప్పలు లేని స్మార్ట్‌వాచ్‌లు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. వారాల పాటు తిరుగుండదు!

ఛార్జింగ్ తిప్పలు లేని స్మార్ట్‌వాచ్‌లు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. వారాల పాటు తిరుగుండదు!
Advertisement

Smartwatch Battery: స్మార్ట్‌వాచ్ వాడుతున్నంతసేపు బాగానే ఉన్నప్పటికీ.. దానికి నిత్యం ఛార్జింగ్ పెట్టాల్సి రావడమే చాలా మందికి చికాకు తెప్పిస్తూ ఉంటుంది. అందుకే అధునాతన స్మార్ట్ ఫీచర్లతో పాటు బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉంటే స్మార్ట్ వాచ్ లను టెక్ ప్రియులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 2026 జూలై నాటికి మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యధిక బ్యాటరీ లైఫ్ ఇచ్చే టాప్-5 స్మార్ట్‌వాచ్‌ల లిస్ట్ ను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి.

వన్‌ప్లస్ వాచ్ 4

వన్‌ప్లస్ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌వాచ్.. ‘వన్‌ప్లస్ వాచ్ 4’ తో బ్యాటరీ విభాగంలో సరికొత్త రికార్డు సృష్టించింది. టైటానియం బాడీ, స్నాప్‌డ్రాగన్ W5 చిప్‌సెట్‌తో వచ్చిన ఈ వాచ్.. స్మార్ట్ మోడ్‌లో ఏకంగా 5 రోజుల బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంది. పవర్ సేవర్ మోడ్ ఆన్ చేస్తే ఏకంగా 16 రోజుల వరకు దీనికి చార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. వేర్ ఓఎస్ (Wear OS) వాచ్‌లలో ఈ స్థాయి బ్యాటరీ లైఫ్ లభించడం అద్భుతమనే చెప్పాలి.

హువావే వాచ్ జీటీ రన్నర్ 2

Advertisement

రన్నర్స్, అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘హువావే వాచ్ జీటీ రన్నర్ 2’.. బ్యాటరీ లైఫ్ కు కేరాఫ్ గా నిలుస్తోంది. సాధారణ వాడకంతోనే ఇది ఏకధాటిగా 14 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. జీపీఎస్ ట్రాకింగ్‌ను ఆన్ చేసి ఉంచినా కూడా ఇది 32 గంటల పాటు నాన్ స్టాప్ గా పనిచేస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. సుదూర మారథాన్ రన్నర్లకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది.

షావోమి వాచ్ 5

షావోమి సరికొత్తగా లాంచ్ చేసిన ‘షావోమి వాచ్ 5’.. హెల్త్ ట్రాకింగ్, జెమిని ఏఐ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. అదే సమయంలో అదిరిపోయే బ్యాటరీ బ్యాకప్‌తో నూ అందరినీ ఆకర్షిస్తోంది. ఇందులో 930mAh బ్యాటరీని ఫిక్స్ చేశారు. స్మార్ట్ మోడ్‌లో 6 రోజులు, పవర్ సేవింగ్ మోడ్‌లో ఏకంగా 18 రోజుల పాటు ఇది పనిచేస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా

Advertisement

పర్వాతారోహణ, ట్రెక్కింగ్, సాహసయాత్రలు చేసేవారి ఈ శాంసంగ్ ఈ వాచ్ ను తీసుకొచ్చింది. కఠినమైన వాతావరణాన్ని తట్టుకునేలా దీనిని రూపొందించింది. ఈ వాచ్ ను పవర్ సేవింగ్ మోడ్‌లో పెడితే.. ఏకంగా 100 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. వర్కవుట్లను ట్రాక్ చేస్తూ ఎక్సర్‌సైజ్ పవర్ సేవింగ్ మోడ్‌లో ఉంచితే 48 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: ఫోన్ బ్యాటరీని 100% ఛార్జ్ చేస్తున్నారా? చాలా పెద్ద తప్పు చేస్తున్నట్లే!

యాపిల్ వాచ్ అల్ట్రా 3

బ్యాటరీ సమస్యకు చెక్ పెడుతూ యాపిల్.. సరికొత్త వాచ్ ను తీసుకొచ్చింది. ఇది సాధారణ వాడకంలో 42 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఒకవేళ లో-పవర్ మోడ్ యాక్టివేట్ చేసుకుంటే ఈజీగా 72 గంటల (3 రోజులు) పాటు రన్ అవుతుంది. మరోవైపు వేగంగా ఛార్జ్ చేసేందుకు దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను సైతం అందించారు.

Also Read: రూ. 5,000 లోపు బెస్ట్ బడ్జెట్ ఫోన్లు.. కాల్స్ కోసమే కాదు.. అంతకుమించి!

Related News

రూ.1037కే మిక్సీ గ్రైండరా? ఫ్లిప్‌కార్ట్ ఇస్తున్న ఈ క్రేజీ ఆఫర్ అసలు మిస్ కావద్దు!

క్షణాల్లోనే ఈజీగా కేకులు,పిజ్జాలు రెడీ.. పిజియన్ ఓటీజీ స్పెషల్స్ ఇవే!

రూ.7890కే 7 కేజీ వాషింగ్ మెషీన్..డోంట్ మిస్

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్..ఫాస్ట్‌ట్రాక్ ఆప్టిమస్ ప్రో స్పెషల్స్ ఇవే!

స్టైలిష్ లుక్,బిగ్ బ్యాటరీతో ఫైర్-బోల్ట్ హరికేన్ స్మార్ట్‌వాచ్ విడుదల!

ఫిలిప్స్ నుంచి అదిరిపోయే..బ్లూటూత్ స్పీకర్! ధర కూడా చాలా తక్కువ

పొరపాటున ఫోటోలు డిలీట్ అయ్యాయా? ఇలా రికవర్ చేసుకోండి!

ప్లే స్టోర్‌లో యాప్స్ డౌన్‌లోడ్ చేసే ముందు ఈ విషయాలు చెక్ చేయండి!

Big Stories

Advertisement
×