TRIGGR Punkheadz Z5: టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఆడియో యాక్సెసరీస్.. కూడా సరి కొత్త హంగులతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. వైర్లు లేని కనెక్షన్ , ఎక్కువ సేపు పని చేసే బ్యాటరీ ఉన్న హెడ్ ఫోన్లను ప్రతి ఒక్కరూ.. కోరుకుంటున్నారు. ఈ ట్రెండ్‌కు తగ్గట్టుగా.. ట్రిగ్గర్ సంస్థ అత్యంత సరసమైన ధరలో ‘పంక్‌హెడ్జ్ Z5’ మోడల్‌ను లాంచ్ చేసింది. చూడటానికి ఎంతో స్టైలిష్‌గా, ‘నాయర్ బ్లాక్’ కలర్ ఆప్షన్‌లో.. లభించే ఈ ఆన్-ది-ఇయర్ హెడ్ సెట్ ప్రత్యేకతలు ఏంటో వివరంగా తెలుసుకుందాం.
ఈ హెడ్‌సెట్ డిజైన్ చాలా ట్రెండీగా, ప్రీమియమ్‌గా ఉంటుంది. చెవులపై.. పెట్టుకున్నప్పుడు ఎలాంటి నొప్పి కలగకుండా.. చాలా సాఫ్ట్ కుషన్లను ఇందులో అందించారు. తేలికపాటి బరువుతో.. ఉండటం వల్ల గంటల తరబడి దీన్ని ధరించినా.. చెవులకు ఎలాంటి ఇబ్బంది కలగదు. ‘నాయర్ బ్లాక్’ కలర్ వేరియంట్ చూడటానికి.. చాలా క్లాసీగా అంతే కాకుండా ఆకర్షణీయంగా ఉంటుంది.
మ్యూజిక్ లవర్స్‌కు సౌండ్ క్వాలిటీ చాలా ముఖ్యం. ఈ హెడ్‌సెట్‌లో పవర్ ఫుల్ 40mm డ్రైవర్లను వాడారు. దీని వల్ల పాటలు వింటున్నప్పుడు క్లియర్ అయిన వాయిస్ , డీప్ బేస్ ఫీల్ కలుగుతుంది. సినిమా చూసేటప్పుడు లేదా మ్యూజిక్ వినేటప్పుడు థియేటర్ లాంటి సౌండ్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది.
ఎక్కువ సేపు ప్రయాణాలు చేసే వారికి లేదా రోజూ హెడ్ ఫోన్స్ వాడే వారికి బ్యాటరీ బ్యాకప్ చాలా ముఖ్యం. ట్రిగ్గర్ పంక్‌హెడ్జ్ Z5 ఏకంగా 50 గంటల ప్లేటైమ్‌ను అందిస్తుంది. ఒక రి ఫుల్ ఛార్జ్ చేస్తే..రోజుల తరబడి ఛార్జింగ్ గురించిన టెన్షన్ ఉండదు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే..ఇందులో లేటెస్ట్ BT v6.0 టెక్నాలజీని అందించారు. దీని వల్ల ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌తో క్షణాల్లో కనెక్షన్ ఏర్పడుతుంది . అంతే కాకుండా సిగ్నల్ లాస్ సమస్య ఉండదు.
Also Read: స్టైలిష్ లుక్,సూపర్ సౌండ్..నాయిస్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్ లాంచ్!
ఈ హెడ్ సెట్‌లో గేమర్స్ కోసం ప్రత్యేకంగా ‘గేమింగ్ మోడ్’అందించారు. దీనిని ఆన్.. చేయడం ద్వారా ఆడియో లేటెన్సీ చాలా వరకు తగ్గి పోతుంది, దీని వల్ల గేమింగ్ ఆడేటప్పుడు సౌండ్ సింక్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అలాగే ఇందులో ‘డ్యూయల్ పేరింగ్’ఫీచర్ కూడా ఉంది. దీని సహాయం తో.. ఒకే సమయంలో రెండు వేర్వేరు డివైజ్‌లకు హెడ్‌సెట్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫీచర్ టెకీలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆఫీస్ మీటింగ్ లకు కూడా ఇది బెస్ట్ అని చెప్పొచ్చు.
అన్ని లేటెస్ట్ ఫీచర్లతో వస్తున్న ఈ మోడల్ బ్లూటూత్ హెడ్‌సె ట్ ధర మార్కెట్లో కేవలం రూ.799 మాత్రమే. బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు, లాంగ్ బ్యాటరీ లైఫ్ , గేమింగ్ మోడ్ కోరుకునే వారికి ఇది నిజంగా ఒక అద్భుత మైన ఛాయిస్ అవుతుది.