E-Paper
Advertisement

వాట్సప్‌లో ఏఐతో పనులు మరింత ఈజీ.. ప్రైవసీ విషయంలో మాత్రం తగ్గేదే లేదంటున్న సీఈఓ!

వాట్సప్‌లో ఏఐతో పనులు మరింత ఈజీ.. ప్రైవసీ విషయంలో మాత్రం తగ్గేదే లేదంటున్న సీఈఓ!
Advertisement

WhatsApp AI Features: వాట్సప్ వాడే విధానం త్వరలో మరింత సులభంగా మారబోతోంది. కేవలం మెసేజ్‌లు పంపుకోవడం, ఫోన్ కాల్స్ చేసుకోవడమే కాకుండా.. రోజువారీ పనులను కూడా ఇందులోనే పూర్తి చేసుకునేలా కొత్త ఫీచర్లను తీసుకురావాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో యూజర్ల సమయాన్ని ఆదా చేయడంపై దృష్టి పెట్టింది. అయితే ఈ మార్పుల వల్ల వ్యక్తిగత మెసేజ్‌లు, కాల్స్ ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని వాట్సప్ సీఈఓ కునాల్ షా స్పష్టం చేశారు.

యూజర్ల అభిప్రాయాలు..

ఈ ఏడాది జూన్‌లో వాట్సప్ గ్లోబల్ హెడ్‌గా బాధ్యతలు తీసుకున్న కునాల్ షా.. గత కొన్ని నెలలుగా యూజర్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు. వారి అవసరాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. ప్రజలు తమకు ఇష్టమైన వారితో మరింత దగ్గరగా ఉండటంతో పాటు, వాట్సప్‌లోనే ఎక్కువ పనులు పూర్తి చేయాలని కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రతిరోజూ వాట్సప్‌లో 10 బిలియన్లకు పైగా వాయిస్ మెసేజ్‌లు, 4 బిలియన్లకు పైగా స్టిక్కర్లు పంపిస్తున్నారు.

కొత్త మార్పులు..

Advertisement

ప్రజలు మాట్లాడుకునే విధానం మారుతున్నందున వాట్సప్ కూడా కొత్త అనుభూతిని అందించనుంది. వాయిస్ నోట్స్, గ్రూప్స్, స్టిక్కర్లు, వీడియో కాల్స్‌ను మరింత సులభంగా, ఆకర్షణీయంగా మార్చాలని చూస్తోంది. స్నేహితులతో మాట్లాడటం, కుటుంబ సభ్యుల యోగక్షేమాలు తెలుసుకోవడం, కలిసి ఏదైనా ప్లాన్ చేసుకోవడం వంటి పనులు మరింత ఈజీ కానున్నాయి.

Also Read: మీ ఫోన్ పోయిందా? డేటా, బ్యాంక్ ఖాతాలను కాపాడుకోవాలంటే వెంటనే ఈ 6 పనులు చేయండి!

చాట్‌లో చెల్లింపులు..

Advertisement

చాట్‌లో మొదలైన పనుల కోసం మరో యాప్‌కు వెళ్లాల్సిన అవసరం తగ్గించాలని కంపెనీ భావిస్తోంది. బిల్లులు చెల్లించడం, డబ్బులు తీసుకోవడం, ప్రయాణాల్లో కనెక్ట్ అయి ఉండటం వంటి పనులను వాట్సప్‌లోనే పూర్తి చేసేలా ఫైనాన్షియల్ సర్వీసెస్, టెలికాం సంస్థలతో కలిసి పనిచేస్తోంది. దీంతో యూజర్లకు సమయం ఆదా అవుతుంది.

ఏఐతో ప్రైవసీ..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బుకింగ్స్, అపాయింట్‌మెంట్లను గుర్తు చేయడం, అవసరమైన పనులను త్వరగా పూర్తి చేయడం వాట్సప్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతిరోజూ 100 బిలియన్లకు పైగా మెసేజ్‌లు, 2 బిలియన్ల కాల్స్‌ను నిర్వహిస్తున్న ఈ ప్లాట్‌ఫామ్‌లో వ్యక్తిగత మెసేజ్‌లు, కాల్స్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తోనే కొనసాగుతాయని షా హామీ ఇచ్చారు. కొత్త టెక్నాలజీ వచ్చినా యూజర్ల నమ్మకం, ప్రైవసీ విషయంలో రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.

Also Read: నెల రోజుల ఇంటర్నెట్ ఉచితం.. BSNL ధమాకా ఆఫర్‌లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?

Tags

Related News

నలుగురికి ఒక్కటే రీఛార్జ్.. Airtel రూ. 1,449 ఫ్యామిలీ ప్లాన్ గురించి తెలుసా?

మీ ఫోన్ పోయిందా? డేటా, బ్యాంక్ ఖాతాలను కాపాడుకోవాలంటే వెంటనే ఈ 6 పనులు చేయండి!

రూ.799కే..ట్రిగ్గర్ పంక్‌హెడ్జ్ Z5 హెడ్‌సెట్ లాంచ్! డోంట్ మిస్

చనిపోయిన వ్యక్తి మళ్లీ పుట్టాడా? ఈ బాలుడి కథ వింటే షాకవుతారు!

కెమెరా మార్కెట్‌లోకి వివో ఎంట్రీ? ట్రేడ్‌మార్క్‌తో బయటపడిన ఆసక్తికర విషయం!

నెల రోజుల ఇంటర్నెట్ ఉచితం.. BSNL ధమాకా ఆఫర్‌లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?

iPhone Air 2, iPhone 18 డిజైన్ లీక్.. కొత్త ఫోన్లలో ఎలాంటి మార్పులు ఉండనున్నాయంటే?

Big Stories

Advertisement
×