E-Paper
Advertisement

చనిపోయిన వ్యక్తి మళ్లీ పుట్టాడా? ఈ బాలుడి కథ వింటే షాకవుతారు!

చనిపోయిన వ్యక్తి మళ్లీ పుట్టాడా? ఈ బాలుడి కథ వింటే షాకవుతారు!
Advertisement

Titu Singh: పునర్జన్మ ఉంటుందంటే మీరు నమ్ముతారా? కానీ ఈ బాబు చెప్పిన విషయాలు వింటే మాత్రం నమ్మాల్సిందే అనిపిస్తుంది. ఎందుకంటే తన గత జన్మలో ఏం జరిగింది? ఎలా చనిపోయాడు? తన కుటుంబం ఎవరు? ఎక్కడ ఉండేవాడు? ఇలా ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పేశాడు. ఈ కేసును పరిషోధన చేసిన పరిఫోదకులు కూడా ఈ కథేంటో అంతుచిక్కటం లేదు.

మీరు నా తల్లిదండ్రులు కారు!

Advertisement

ఈ ఘటన 1980లలో ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో జరిగింది. అక్కడ ఓ గ్రామంలో టోరన్ సింగ్ అనే బాలుడు జన్మించాడు. ఇంట్లో అందరూ టిటూ అని పిలిచేవారు. అయితే ఈ బాబు ఏడాదిన్నర వయసు నుంచే కొన్ని వింత విషయాలు మాట్లాడటం మొదలుపెట్టాడు. తన తల్లిదండ్రులతో.. ‘మీరు నా అసలు అమ్మానాన్నలు కాదు.. నా పేరు టిటూ కాదు.. నా పేరు సురేశ్. నాకు ఆగ్రాలో సొంతంగా రేడియో షాప్ ఉంది. నా భార్య పేరు ఉమా. నాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు’ అని చెప్పేవాడు…

చనిపోయింది ఎలాగో..

Advertisement

మొదట్లో తల్లిదండ్రులు చిన్నపిల్లాడి మాటలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అతను చెప్పే విషయాలు మరింత ఆశ్చర్యపరిచేవి. తాను గత జన్మలో ఎలా చనిపోయాడో కూడా వివరించాడు.

హత్య జరిగిన తీరును చెప్పిన చిన్నారి!

ఒకరోజు రాత్రి పని ముగించుకుని కారులో ఇంటికి వెళ్తుండగా.. ఇంటి గేట్ తీయమని భార్యకు హారన్ కొట్టాడట. ఇంతలో కొందరు వ్యక్తులు తుపాకులతో వచ్చి తనపై కాల్పులు జరిపారని, తలలో బుల్లెట్ తగలడంతో చనిపోయానని చెప్పేవాడు. అంతేకాదు.. తన అసలు కుటుంబాన్ని చూడాలని, తన ఇంటికి తీసుకెళ్లాలని తరచూ ఏడ్చేవాడు.

నా భార్య, పిల్లలు ఆగ్రాలో ఉన్నారు!

1987 ఏప్రిల్‌లో టిటూ తండ్రి ఆగ్రాకు వెళ్లినప్పుడు తనను తీసుకెళ్లలేదని బాబు చాలా ఏడ్చాడు. అప్పుడు తనకు ఆగ్రాలోని సదర్ బజార్‌లో ‘సురేశ్ రేడియో’ అనే షాప్ ఉందని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన టిటూ అన్నయ్య, అతని స్నేహితుడు ఆగ్రాకు వెళ్లి వెతికారు. ఆశ్చర్యంగా అక్కడ నిజంగానే సురేశ్ రేడియో అనే షాప్ కనిపించింది. ఆ షాప్ యజమాని సురేశ్ వర్మ అనే వ్యక్తి. ఆయన భార్య ఉమా వర్మను కలవగా.. తన భర్త 1983 ఆగస్టు 28న కారులో వెళ్తుండగా కాల్పుల్లో చనిపోయారని చెప్పారు. అంటే టిటూ చెప్తున్న కథకు, అక్కడ జరిగిన ఘటనకు చాలా పోలికలు కనిపించాయి. ఇక్కడితో ఆగలేదు.. అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది! సురేశ్ కుటుంబ సభ్యులు టిటూను కలవడానికి అతని గ్రామానికి వచ్చారు. వాళ్లను చూడగానే టిటూ తన గత జన్మ కుటుంబ సభ్యులుగా గుర్తుపట్టాడని పరిశోధనలో నమోదైంది. తన భార్య ఉమాను, తల్లిదండ్రులను, సోదరులను గుర్తించాడు. అంతేకాదు తన ఇద్దరు పిల్లల పేర్లను కూడా చెప్పాడు.. ఆ తర్వాత టిటూను ఆగ్రాలోని సురేశ్ రేడియో షాప్‌కు తీసుకెళ్లారు.

పాత షాప్‌ని గుర్తుపట్టిన 5 ఏళ్ల బాలుడు

అక్కడ గోడకు ఉన్న సురేశ్ ఫొటోను చూసి.. ‘ఇది నేనే’ అని చెప్పాడట. షాప్‌లో డబ్బులు దాచే డ్రాయర్‌ను కూడా గుర్తించాడు. సురేశ్ చనిపోయిన తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన షోకేస్‌ను చూసి.. ‘ఇది నేను ఉన్నప్పుడు ఇక్కడ లేదు’ అని చెప్పాడట. అంతేకాదు.. అతన్ని పరీక్షించడానికి సురేశ్ సోదరుడికి చెందిన మరో షాప్‌కు తీసుకెళ్లగా, అది తనది కాదని స్పష్టంగా చెప్పాడు. ఇంకో విషయం పరిశోధకులను ఆశ్చర్యపరిచింది.

పరిశోధనలో ఆశ్చర్యపరిచే విషయాలు..

సురేశ్ వర్మ పోస్టుమార్టం రిపోర్టులో బుల్లెట్ తల కుడివైపు తగిలి, చెవి వెనుక నుంచి బయటకు వెళ్లినట్లు ఉంది. టిటూ తలపై కూడా బుల్లెట్ తగిలిన ప్రాంతానికి దగ్గరగా పుట్టుమచ్చ, చెవి వెనుక భాగంలో ఎముకకు సంబంధించిన చిన్న లోపం ఉన్నట్లు పరిశోధకురాలు ఆంటోనియా మిల్స్ గుర్తించారు. ఈ ఘటనపై వర్జీనియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకురాలు ఆంటోనియా మిల్స్ 1987 నుంచి అధ్యయనం చేశారు. టిటూ చెప్పిన వివరాలను, కుటుంబ సభ్యుల గుర్తింపులను, అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించారు.. ఈ కేసును పరిశీలించిన పరిశోధకులు కూడా టిటూ చెప్పిన వివరాలు, అతని గత జన్మకు సంబంధించిన వ్యక్తుల గుర్తింపులు చూసి ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా అతను చెప్పిన విషయాలు, సురేశ్ వర్మ జీవితంలో జరిగిన ఘటనలతో సరిపోలడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ కేసు మాత్రం పరిశోధకులకు కూడా అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. ఒకవేళ పునర్జన్మ లేకపోతే.. ఈ చిన్నారికి ఇన్ని విషయాలు ఎలా తెలుసు అనిపిస్తుంది.

Also Read: పెళ్లికి వెళ్తే పదవి నుంచి దించేస్తారా?.. మమ్ముట్టి వివాదం వెనుక అసలు కథ!

Tags

Related News

వాట్సప్‌లో ఏఐతో పనులు మరింత ఈజీ.. ప్రైవసీ విషయంలో మాత్రం తగ్గేదే లేదంటున్న సీఈఓ!

నలుగురికి ఒక్కటే రీఛార్జ్.. Airtel రూ. 1,449 ఫ్యామిలీ ప్లాన్ గురించి తెలుసా?

మీ ఫోన్ పోయిందా? డేటా, బ్యాంక్ ఖాతాలను కాపాడుకోవాలంటే వెంటనే ఈ 6 పనులు చేయండి!

రూ.799కే..ట్రిగ్గర్ పంక్‌హెడ్జ్ Z5 హెడ్‌సెట్ లాంచ్! డోంట్ మిస్

కెమెరా మార్కెట్‌లోకి వివో ఎంట్రీ? ట్రేడ్‌మార్క్‌తో బయటపడిన ఆసక్తికర విషయం!

నెల రోజుల ఇంటర్నెట్ ఉచితం.. BSNL ధమాకా ఆఫర్‌లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?

iPhone Air 2, iPhone 18 డిజైన్ లీక్.. కొత్త ఫోన్లలో ఎలాంటి మార్పులు ఉండనున్నాయంటే?

Big Stories

Advertisement
×