Airtel Family Plan: ఈ రోజుల్లో కనీసం నాలుగు స్మార్ట్ ఫోన్లు వాడుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అయితే కాల్స్, డేటా, ఓటీటీ యాప్స్ యాక్సెస్ కోసం వీటికి రీఛార్జ్ చేయించడం తప్పనిసరి. ఫలితంగా ఈ రీఛార్జ్ లకు ప్రతీ నెల పెద్ద మెుత్తంలో ఖర్చైపోతోందన్న అభిప్రాయం చాలా ఫ్యామిలీల్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో అలాంటి వారి కోసం ఎయిర్ టెల్.. రూ. 1,449 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ను అందుబాటులో ఉంచింది. ఈ ఒక్క సింగిల్ కనెక్షన్‌తో నలుగురు కుటుంబ సభ్యులు హ్యాపీగా టెలికాం సేవలు పొందొచ్చని ఎయిర్ టెల్ చెబుతోంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
ఎయిర్ టెల్ తీసుకొచ్చిన ఈ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ నెలవారీ ధరను రూ. 1,449 (జీఎస్‌టీ అదనం)గా నిర్ణయించారు. ఈ ప్లాన్ కింద నాలుగు సిమ్ కార్డులను అందిస్తారు. అంటే కుటుంబంలోని నలుగురు సభ్యులు ఈ ప్లాన్ లోని అన్ని బెనిఫిట్స్ ను పొందవచ్చు. కుటుంబంలో ఒక్కో సభ్యుడు ఒక్కో పోస్ట్ పెయిడ్ తీసుకునే బదులు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే బోలెడంత డబ్బు అదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ ప్లాన్‌లో ఎలాంటి పరిమితులు లేకుండా అన్‌లిమిటెడ్ 4G, 5G డేటాను ఎయిర్ టెల్ ఆఫర్ చేస్తోంది. దీంతోపాటు ఫ్రీ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ అందించే ‘ఫాస్ట్ లేన్ టెక్నాలజీ’తో కూడిన 5G స్లైసింగ్ ఫీచర్ కూడా ఈ ప్లాన్‌లో ఉండటం మరింత స్పెషల్ గా చెప్పవచ్చు.
ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్ కింద యూజర్లకు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా లభించనున్నాయి. అలాగే పలు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల కంటెంట్‌ను ఒకే చోట చూసేందుకు ‘ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం’ యాక్సెస్ కూడా అందుబాటులో ఉండనుంది.
Also Read: ఎంబీఏ మిత్రుల గ్రేట్ ఐడియా.. అరటి వ్యర్థాలతో రూ.కోట్ల బిజినెస్.. 60% మహిళలకే ఉపాధి!
యాపిల్ డివైజెస్‌ను వాడేవారి కోసం ఈ ప్లాన్‌లో ప్రత్యేక బెనిఫిట్స్ ను సైతం ఎయిర్ టెల్ అందిస్తోంది. యాపిల్ మ్యూజిక్, యాపిల్ టీవీ సబ్‌స్క్రిప్షన్లతో పాటు ఫోటోలు, వీడియోలు సేవ్ చేసుకోవడానికి ‘క్లౌడ్+ (iCloud+)’ సపోర్ట్ కూడా లభిస్తుంది. ఇవి కాకుండా అదనంగా 100GB గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ కూడా ఎయిర్ టెల్ ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు 12 నెలల పాటు ‘అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం’ సబ్‌స్క్రిప్షన్ సైతం సొంతం చేసుకోవచ్చు.
Also Read: అమెరికాలో తెలంగాణ విద్యార్థిని అదృశ్యం.. బాధిత కుటుంబానికి అండగా బిగ్ టీవీ చైర్మన్!