E-Paper
Advertisement

ప్రపంచ ప్రఖ్యాత సెలబ్రిటీలను కెమెరాలో బంధించిన ఫోటోగ్రాఫర్‌… ఫ్యాషన్ ప్రపంచాన్నే మార్చేసిన రిచర్డ్ అవెడన్ రియల్ స్టోరీ

ప్రపంచ ప్రఖ్యాత సెలబ్రిటీలను కెమెరాలో బంధించిన ఫోటోగ్రాఫర్‌… ఫ్యాషన్ ప్రపంచాన్నే మార్చేసిన రిచర్డ్ అవెడన్ రియల్ స్టోరీ
Advertisement

Richard Avedon Documentary: ఫ్యాషన్‌, ఫోటోగ్రఫీ ప్రపంచంలో కొన్ని పేర్లు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి వారిలో అమెరికన్ ఫ్యాషన్‌, పోర్ట్రెయిట్ ఫోటోగ్రాఫర్ రిచర్డ్ అవెడన్ ఒకరు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఎంతోమందిని తన కెమెరాలో బంధించిన ఆయన ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాయి. అసలు ఒక ఫోటోగ్రాఫర్ తన ప్రత్యేకమైన విజన్‌తో ఫ్యాషన్ ప్రపంచాన్ని ఎలా మార్చగలిగాడు? కెమెరా వెనుక ఆయన ప్రయాణం ఎలా సాగింది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలంటే ‘Avedon’ డాక్యుమెంటరీ చూడాల్సిందే. ప్రముఖ దర్శకుడు రాన్ హోవర్డ్ రూపొందించిన ఈ డాక్యుమెంటరీ నవంబర్ 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి దీనిని ఏ ఓటీటీలో చూడచ్చు ? ఈ స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

1923లో న్యూయార్క్‌లో జన్మించిన రిచర్డ్ అవెడన్‌కు చిన్నప్పటి నుంచే ఫోటోగ్రఫీపై ఆసక్తి ఉండేది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా మర్చంట్ మెరైన్‌లో ఫోటోగ్రాఫర్‌గా పనిచేసిన ఆయన, ఆ తర్వాత ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వైపు అడుగులు వేశారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అలెక్సీ బ్రోడోవిచ్ దగ్గర శిక్షణ పొందడం ఆయన కెరీర్‌కు కీలక మలుపుగా మారింది. కేవలం స్టూడియోలో మోడల్స్‌ను నిలబెట్టి ఫోటోలు తీయడం కాకుండా, వారి కదలికలు, భావోద్వేగాలు, చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా తన ఫ్రేమ్‌లో భాగం చేశారు.

Advertisement

Harper’s Bazaar మ్యాగజైన్‌తో మొదలైన ఆయన ప్రయాణం తర్వాత Vogue వరకు విస్తరించింది. ఫ్యాషన్ ఫోటోగ్రఫీకి కొత్త శైలిని పరిచయం చేస్తూనే, మార్లిన్ మన్రో, ఆడ్రీ హెప్బర్న్, ది బీటిల్స్ వంటి ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తుల పోర్ట్రెయిట్స్‌ను కూడా అద్భుతంగా తీశారు. 1992లో The New Yorker మ్యాగజైన్‌కు తొలి స్టాఫ్ ఫోటోగ్రాఫర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇలా ఐదు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన కెరీర్ ఫోటోగ్రఫీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

అయితే ఈ సినిమా కేవలం ఆయన తీసిన ప్రసిద్ధ ఫోటోల గురించి మాత్రమే కాదు. ఆ ఫోటోల వెనుక ఉన్న ఆలోచనలు, ఆయన వ్యక్తిత్వం, కళ పట్ల ఉన్న ఆసక్తి, ప్రపంచాన్ని చూసే ప్రత్యేకమైన దృష్టిని కూడా ఆవిష్కరిస్తుంది. రిచర్డ్ అవెడన్ వ్యక్తిగత ఆర్కైవ్ నుంచి సేకరించిన ఇంతకుముందు చూడని ఫోటోలు, కెమెరా వెనుక చిత్రీకరించిన అరుదైన దృశ్యాలు, ఆయనతో కలిసి పనిచేసిన వ్యక్తుల ఇంటర్వ్యూలు ఈ డాక్యుమెంటరీలో చూడవచ్చు. ఒక ఫోటో వెనుక ఎంత పెద్ద కథ ఉంటుందో తెలుసుకోవాలనుకునే వారికి ఇది మంచి అనుభూతిని ఇస్తుంది.

 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ 

Advertisement

ఇది సాధారణ నటీనటులతో తెరకెక్కించిన బయోపిక్ కాదు. రిచర్డ్ అవెడన్‌కు సంబంధించిన ఆర్కైవ్ ఫుటేజ్‌, ఫోటోలు, ఆయనతో పనిచేసిన వ్యక్తుల ఇంటర్వ్యూలతో రూపొందించిన డాక్యుమెంటరీ. దీనికి ఆస్కార్ విజేత రాన్ హోవర్డ్ దీనికి దర్శకత్వం వహించారు. బ్రియాన్ గ్రేజర్, రాన్ హోవర్డ్ తదితరులు నిర్మించారు. 104 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం 2026లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. 2026 నవంబర్ 11 నుంచి Netflixలో అందుబాటులో ఉంది.

Read Also: లాయర్‌ స్థానంలో నిందితుడిగా నిలబడితే… తన కేసులో తానే నిందితుడు… క్రేజీ కోర్ట్‌రూమ్‌ థ్రిల్లర్‌

Tags

Related News

మూతబడిన వాటర్ పార్క్ లో స్టూడెంట్స్ ట్రిప్… దెయ్యం ఎంట్రీతో దిమాక్ కరాబ్… నవ్విస్తూనే భయపెట్టే హారర్ కామెడీ

జరగబోయే ప్రమాదాలు ముందే కనిపిస్తే… ఓటీటీలో దుమ్మురేపుతున్న సిరీస్… ఈ హారర్ చూస్తే మైండ్ బ్లాక్

విడిపోయిన రాక్‌ బ్యాండ్‌ రీఎంట్రీ… మేఘాలయలో జరిగిన విషాదంతో ఊహించని మలుపు… మ్యూజికల్‌ ఎమోషనల్‌ డ్రామా

ఉంగరం కోసం సౌరాన్‌ వేట… ఎల్వ్స్, ఓర్క్స్‌ మధ్య భీకర పోరు… ‘ది రింగ్స్ ఆఫ్ పవర్’ కొత్త సీజన్ వచ్చేసిందోచ్

రాతియుగంలో మోటు-పత్లూ రోలర్ కోస్టర్ రైడ్… డైనోసార్లు, వింత మనుషులతో అల్టిమేట్ అడ్వెంచర్… 8 భాషల్లో స్ట్రీమింగ్

కోటీశ్వరుడి కొడుకు హత్య… రంగంలోకి దిగే 242 ఐక్యూ ఉన్న లేడీ డిటెక్టివ్‌… క్రిమినల్స్ కు దబిడి దిబిడే

తప్పుల్ని సరిచేసుకోవడానికి ఏడాది వెనక్కి వెళ్లే అద్భుతమైన అవకాశం… కొరియన్‌ టైమ్‌ ట్రావెల్‌ మిస్టరీ థ్రిల్లర్‌ సిరీస్‌

Big Stories

Advertisement
×