E-Paper
Advertisement

నాది ఐరన్ లెగ్ కాదు.. ట్రోల్స్ కు శృతిహాసన్ స్ట్రాంగ్ కౌంటర్..

నాది ఐరన్ లెగ్ కాదు.. ట్రోల్స్ కు శృతిహాసన్ స్ట్రాంగ్ కౌంటర్..
Advertisement

Sruthi Hassan -JNR Season 2: జగపతిబాబు వ్యాఖ్యతగా నిర్వహిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. తాజాగా ఈ కార్యక్రమం సీజన్ 2 ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో వీడియో విడుదల చేశారు. ఇందులో భాగంగా ఆకాశంలో ఒక తార సినిమా ప్రమోషన్లలో భాగంగా నటుడు దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) అలాగే నటి శృతిహాసన్(Sruthi Hassan) హాజరై సందడి చేశారు. తాజాగా ఈ ప్రోమో వీడియోలో భాగంగా జగపతిబాబు(Jagapathi) శృతిహాసన్ మధ్య సరదా సన్నివేశాలు సాగాయి.

ఐరన్ లెగ్ అంటూ ట్రోల్స్..

ఈ సినిమాకు సంబంధించి ఎన్నో ప్రశ్నలు ఎదురవడంతో దుల్కర్ సల్మాన్ అన్ని తప్పుగా చెప్పారు. దీంతో శృతిహాసన్ ఎందుకు అలా అని తప్పు చెబుతున్నారు అంటూ మాట్లాడటంతో వామ్మో ఈ పిల్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ జగపతిబాబు మాట్లాడటం అందరిని ఆకట్టుకుంది. ఇక శృతిహాసన్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా గురించి కూడా ప్రస్తావనకు వచ్చినట్టు ప్రోమో ద్వారా తెలియజేశారు. అయితే శృతిహాసన్ గబ్బర్ సింగ్ సినిమా కంటే ముందుగా పలు సినిమాలలో నటించినప్పటికీ వరుసగా డిజాస్టర్లు రావడంతో ఈమెను ఐరన్ లెగ్(Iron Leg) అంటూ ట్రోల్ చేశారు.

బోన్స్ మజిల్సే కదా ఉన్నాయి..

Advertisement

ఇలా డిజాస్టర్, ఫ్లాప్ హీరోయిన్ గా ముద్ర వేసుకున్న శృతిహాసన్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ (Gabber Singh)సినిమాలో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. అయితే తన గురించి వచ్చిన ఐరన్ విమర్శల పట్ల పలు సందర్భాలలో స్పందించిన శృతిహాసన్ తాజాగా ఇదే అంశం గురించి మాట్లాడుతూ.. అందరూ నన్ను ఐరన్ లెగ్ అంటూ విమర్శించారు కానీ నా లెగ్స్ లో కూడా బోన్స్, మజిల్స్ మాత్రమే ఉన్నాయి అంటూ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వీరి మధ్య ఎలాంటి సరదా సంభాషణలు జరిగాయి అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. శృతిహాసన్ హీరోయిన్ పాత్రల కంటే కూడా కథ ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే ఆకాశంలో ఒక తార అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా నవంబర్ 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇదివరకు విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ తో పాటు మరొక హీరోయిన్ సాత్విక వీరవల్లి కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆకాశంలో ఒక తార ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది.

Also Read: విజయ్ దేవరకొండను రెండో పెళ్లి చేసుకుంటా.. బాంబ్ పేల్చిన నటి?

Related News

‘బిగ్ బాస్’ హౌస్‌లో శివ్, ప్రియాంక ఎంగేజ్మెంట్ డ్రామా, ఇంకా ఎన్నిసార్లు బ్రో?

ఏడిపించేసావ్ బిగ్ బాస్.. ఫ్యామిలీ వీక్ లో అసలైన ఎమోషన్!

జబర్దస్త్ నుండి బలవంతంగా పంపించేశారు: ధనరాజ్!

ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆ ఇద్దరేనా?

బుల్లితెర జంట ఇంట్లో అగ్నిప్రమాదం.. ఏం జరిగిందంటే?

సీరియల్స్ కు తేజు గుడ్ బై.. ఆ ఒక్కటే కారణమా..?

Gundeninda GudiGantalu Today episode: బాలు మాటతో మీనా షాక్.. ప్రభాకు నిజం తెలుస్తుందా..? పాపం మనోజ్..

Big Stories

Advertisement
×