iPhone 18 Leaks: యాపిల్ కొత్త ఐఫోన్లను తీసుకొస్తుందంటే టెక్ ప్రియుల్లో ఉండే ఆసక్లి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫోన్ ఎలా ఉండబోతోంది? కెమెరాల్లో ఎలాంటి మార్పులు ఉంటాయి? అనే చర్చ ముందే మొదలవుతుంది. ఇప్పుడు iPhone Air 2, iPhone 18 విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ రెండు ఫోన్లకు సంబంధించిన డమ్మీ యూనిట్లు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడంతో వాటి డిజైన్ బయటపడింది. ముఖ్యంగా ఐఫోన్ ఎయిర్ 2లో రెండు కెమెరాలు కనిపించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరి కొత్త ఐఫోన్లలో కంపెనీ ఎలాంటి మార్పులు చేయబోతోంది? లీకైన వివరాల్లో ఏముందో ఇప్పుడు చూద్దాం.
యాపిల్ తమ ఐఫోన్ విడుదల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. 2026 సెప్టెంబర్‌లో iPhone 18 Pro సిరీస్‌తో పాటు కంపెనీ తొలి బుక్ తరహా ఫోల్డబుల్ ఫోన్ iPhone Duoను పరిచయం చేసింది. సాధారణ iPhone 18, Air 2 మాత్రం ఆ సమయంలో రాలేదు. తాజా లీకుల ప్రకారం ఈ రెండు మోడళ్లు 2027 మొదటి ఆరు నెలల్లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే యాపిల్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా లేదు.
ఎక్స్‌లో లూసీ రాయ్ అనే యూజర్ షేర్ చేసిన డమ్మీ యూనిట్ల వీడియో, ఫొటోల్లో iPhone Air 2 వెనుక భాగంలో రెండు కెమెరాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఐఫోన్ ఎయిర్‌లో ఒకే వెనుక కెమెరా ఉండగా, కొత్త మోడల్‌లో 48MP మెయిన్ కెమెరాతో పాటు 48MP అల్ట్రావైడ్ కెమెరా ఉండొచ్చని లీకులు చెబుతున్నాయి. ఫోన్ పలుచని డిజైన్‌ను అలాగే కొనసాగించే సూచనలు ఉన్నాయి. ముందు భాగంలో ఫేస్ ఐడీ కోసం కటౌట్ కూడా కనిపిస్తోంది.
Also Read: లాంచ్ అయిన కొన్ని రోజులకే Pixel 10aపై భారీ తగ్గింపు.. రూ.40 వేలకే లభ్యం, కానీ ఒక ట్విస్ట్!
డమ్మీ యూనిట్‌ను బట్టి సాధారణ iPhone 18 డిజైన్, iPhone 17ను పోలి ఉంది. వెనుక రెండు కెమెరాల అమరిక కూడా పాత మోడల్ తరహాలోనే కనిపిస్తోంది. Pro మోడళ్లలో ఉండే ప్రత్యేక కెమెరా మాడ్యూల్ ఇందులో కనిపించడం లేదు. అంటే బయట రూపంలో పెద్ద మార్పులు లేకుండా యాపిల్ కొత్త ఫోన్‌ను తీసుకురావచ్చని అంచనా.
iPhone Air 2లో 6.55 అంగుళాల ప్రోమోషన్ డిస్‌ప్లే, ఏ20 ప్రో చిప్, సీ2 మోడెమ్ ఉండొచ్చని సమాచారం. దీని ప్రారంభ ధర రూ.1.03 లక్షల ఉండవచ్చని ఓ టిప్‌స్టర్ అంచనా. iPhone 18లో 6.3 అంగుళాల ప్రోమోషన్ స్క్రీన్, ఏ20 ప్రో చిప్, సీ2 మోడెమ్ ఉండొచ్చని చెబుతున్నారు. 4,430mah బ్యాటరీ, వెనుక రెండు 48MP కెమెరాలు, ముందు 48MP కెమెరా కూడా ఉండొచ్చట. ఇవన్నీ ప్రస్తుతానికి లీకులే. ధర, ఫీచర్లు, విడుదల తేదీని కంపెనీ ప్రకటించే వరకు వేచి చూడాలి. అందుకే ఈ ఫోన్లను కొనాలని ప్లాన్ చేస్తున్నవారు అధికారిక ప్రకటన వచ్చే వరకు కొంత సమయం వేచి ఉండటం మంచిది.
Also Read: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఒక్క సెట్టింగ్ తెలిస్తే.. మీ అకౌంట్‌ను సేఫ్‌గా ఉంచుకోవచ్చు!