E-Paper
Advertisement

చనిపోయిన చోట కూడా చౌకబారు రాజకీయాలా..? హరీష్ రావుపై అద్దంకి ఆగ్రహం

చనిపోయిన చోట కూడా చౌకబారు రాజకీయాలా..? హరీష్ రావుపై అద్దంకి ఆగ్రహం
Advertisement

Addanki Dayakar: బీజేపీ నాయకులు భారత్ సమ్మిట్ వేదికగా చేస్తున్న వ్యాఖ్యలు వారి ద్వంద్వ నీతికి అద్దం పడుతున్నాయని తెలంగాణ ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. సీఎల్పీ మీడియా హాల్‌ వేదికగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్ సమ్మిట్‌కు హాజరవుతున్న ప్రతినిధులను యాంటీ నేషనల్స్ అని పిలవడం బీజేపీ నేతల అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. అసలు భారత ప్రభుత్వమే అనుమతి ఇచ్చినప్పుడు, అందులో భాగస్వాములైన వారిని దేశద్రోహులంటే ఆ ముద్ర మోడీ ప్రభుత్వానికే పడుతుందని స్పష్టం చేశారు.

డివైడర్ జనతా పార్టీగా మారిన బీజేపీ

Advertisement

దేశంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలు సమాజాన్ని రక్షించేలా లేవని, కేవలం మతం, కులం పేరుతో ప్రజలను విడగొట్టేలా ఉన్నాయని అద్దంకి విమర్శించారు. అందుకే బీజేపీని భారతీయ జనతా పార్టీ అని కాకుండా ‘డివైడర్ జనతా పార్టీ (DJP)’ అని పిలవడం సరైందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ప్రతిష్టను చూసి తట్టుకోలేకే బీజేపీ నేతలు ఆయనపై బురద జల్లుతున్నారన్నారు. దేశంలో నిజమైన పాలనా వైఫల్యాలు చూస్తుంటే ఎవరు పప్పు అనే విషయాన్ని ప్రజలే గమనిస్తున్నారని ఘాటుగా స్పందించారు.

ఉద్యమకారుల బలిదానాలపై బీఆర్‌ఎస్ రాజకీయం

Advertisement

తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి కేసీఆర్ కుటుంబం మాత్రమే ఆర్థికంగా, రాజకీయంగా బాగుపడిందన్నారు. అసలైన ఉద్యమకారులు తీవ్రంగా నష్టపోయారని అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మణ్ గౌడ్ రాసిన లేఖనే ఇందుకు సజీవ సాక్ష్యమని తెలిపారు. ఉద్యమంలో హరీష్ రావు ఉసిగొల్పడం వల్లే 12 మంది బలికావాల్సి వచ్చిందని, ఇప్పుడు కూడా శవాల దగ్గర చవకబారు రాజకీయం చేయడం బీఆర్‌ఎస్‌కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.

ఉద్యమకారులకు రేవంత్ ప్రభుత్వం అభయం

ఉద్యమకారులను అన్ని విధాలా ఆదుకోవడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు కమిటీని ఏర్పాటు చేశారని విప్ దయాకర్ గుర్తుచేశారు. తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి, దేశ భవిష్యత్తు కోసం రాహుల్ గాంధీ నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ ఎంత అల్లకల్లోలం సృష్టించాలని చూసినా, ఉద్యమకారులకు ప్రభుత్వం తోడుగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యాన్నిచ్చారు.

Also Read: అమెరికా టారిఫ్ షాక్.. కొత్త దారుల్లో భారత గార్మెంట్ కంపెనీలు!

Tags

Related News

ఆ 558 మంది భవిష్యత్తు ఏమిటి? డీఎంఈ నిర్ణయంతో రోడ్డున పడ్డ వైద్య సిబ్బంది!

అమెరికాలో తెలంగాణ విద్యార్థిని అదృశ్యం.. బాధిత కుటుంబానికి అండగా బిగ్ టీవీ చైర్మన్!

రాహుల్‌ను పీఎం మెటీరియల్ చేసేందుకే ఇదంతా.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ రామచందర్ రావు!

తెలంగాణ గల్లీ కారు.. ఢిల్లీకి చేరగానే కమలం రూపురేఖలు-సీఎం రేవంత్‌రెడ్డి

లక్డికాపూల్ వన్ వే ట్రాఫిక్ ప్లాన్! రిటైర్ బ్యాంక్ ఉద్యోగి పక్కా స్కెచ్, పరిశీలన చేస్తున్న అధికారులు

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతాల్లో సినిమా ప్రమోషన్లకు బ్రేక్! అసలేం జరిగింది?

బక్కచిక్కిన తమ్మిడికుంట చెరువుకు పూర్వ వైభవం.. రూ.20 కోట్లతో సుందరీకరణ!

Big Stories

Advertisement
×