Dil Raju: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వి.వెంకట రమణా రెడ్డి ఆయన అసలు పేరు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను ప్రారంభించి ఇప్పుడు స్టార్ నిర్మాతగా మారాడు. దిల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడంతో ఆయనకు దిల్ రాజు అనే పేరు వచ్చింది. ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలందరూ దిల్ రాజు బ్యానర్ లో చేసినవారే. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో గేమ్ ఛేంజర్ రిలీజ్ కు రెడీ అవుతుంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. మొదటి నుంచి కూడా దిల్ రాజు సినిమా పిచ్చోడు అని చెప్పాలి. టాలీవుడ్ కు మంచి మంచి కథలు అందించాలని ఆరాటపడే నిర్మాతల్లో హార్ట్ కింగ్ ఒకరు. కొత్త కథలు, కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో దిల్ రాజు ముందు ఉంటాడు. అలాంటి చిన్న చిన్న కథలను ఎంకరేజ్ చేయడానికి తన బ్యానర్ తో పాటు తన కూతురు హర్షిత రెడ్డిని కూడా నిర్మాణంలోకి దింపాడు.
Ananya Nagalla: తెలుగమ్మాయి మరో మెగా ఛాన్స్ పట్టేసిందిగా..
ఇక ఈ రెండు బ్యానర్స్ మాత్రమే కాకుండా మరో కొత్త బ్యానర్ తో రెడీ అయ్యాడు దిల్ రాజు. చిన్న చిన్న కథలకు, మంచి టాలెంట్ కు ఈ బ్యానర్ వేదికగా ఉండబోతుందని తెలుపుతూ.. ఆ బ్యానర్ కు దిల్ రాజు డ్రీమ్స్ అనే పేరును పెట్టినట్లు మీడియా సమావేశంలో తెలిపాడు. ” నా కెరీర్ మొదట్లో నేను చాలా కష్టాలను అనుభవించాను. ఇండస్ట్రీలోకి రావాలని చాలామంది కలలు కంటారు. కానీ, వారికి సరైన ప్లాట్ ఫార్మ్ దొరకదు.
ఇప్పటినుంచి టాలెంట్ ఉండి, కష్టపడే వారికి మా దిల్ రాజు డ్రీమ్స్.. వారి కలలను నెరవేర్చుకొనేలా చేస్తుంది. దర్శకలు, నిర్మాతలు, హీరో హీరోయిన్లు.. నటీనటులు ఇలా ఎవ్వరైనా సరే.. ఇండస్ట్రీలోకి రావాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు, కంటెంట్ ఉన్న వాళ్లు దిల్ రాజు టీమ్ ను అప్రోచ్ అవ్వొచ్చు. వారు మాతో అప్రోచ్ అయ్యే విధంగా ఓ వెబ్ సైట్‌ను లాంచ్ చేయబోతోన్నాం. ఆ వెబ్ సైట్ ద్వారానే సెలక్షన్ జరుగుతుంది. త్వరలోనే నేను ఇందులో వచ్చిన కథలను వింటాను.
Krish Jagarlamudi: సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ క్రిష్..
ఇప్పటికే ఇద్దరు ఎన్నారైలు రెండు ప్రాజెక్ట్స్ చేస్తామని చెప్పారు. ఇక్కడ ఎలాంటి రికమండేషన్స్ ఉండవు. కథ నచ్చితే తప్ప తీసుకోము. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేయాలనీ ప్లాన్ చేస్తున్నాం. అన్ని మంచి కథలే వస్తాయని ఆశిస్తున్నాం. నా బర్త్ డే కి కానీ, న్యూయర్ కి కానీ కొత్త వైబ్ సైట్ లాంచ్ చేస్తాం” అని చెప్పుకొచ్చాడు. మరి ఈ బ్యానర్ లో వచ్చే మొదటి సినిమా ఎవరిది ఉంటుందో చూడాలి.