Worlds Highest Railway Bridge: భారతీయ రైల్వే మరో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనపై వందేభారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు పెట్టింది. ఈ వంతెనపై తొలిసారి వందేభారత్ ట్రయల్ రన్ చేసింది. శ్రీమాతా వైష్ణోదేవి కత్రా స్టేషన్ నుంచి శ్రీనగర్ రైల్వే స్టేషన్ వరకు ఈ రన్ కొనసాగింది.
భారీగా తగ్గనున్న ప్రయాణ సమయం
భారత్ లోని ఇతర ప్రాంతాలకు జమ్మూకాశ్మీర్ కు రైల్వే కనెక్టివిటీని పెంచేందు కేంద్ర ప్రభుత్వం ఉధంపూర్- శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్(USBRL) నిర్మించింది. కాశ్మీర్ నుంచి న్యూఢిల్లీని కలిపే వందే భారత్ రైలును త్వరలో ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ట్రయల్స్ నిర్వహించారు. ఢిల్లీ నుంచి నేరుగా కాశ్మీర్ కు రైల్వే ప్రయాణాన్ని అందించేలా 272 కిలో మీటర్ల మేర ఉధంపుర్- శ్రీనగర్- బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రీసెంట్ గానే ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యింది. ఈ మార్గంలో వందేభారత్ రైలును నడపాలని నిర్ణయించారు. న్యూఢిల్లీ నుంచి బయల్దేరే వందేభారత్ రైలు అంజిఖాడ్ వంతెన, చీనాబ్ వంతెన మీదుగా ఉధంపూర్, జమ్ము, కత్రా మీదుగా వెళ్తాయి. సంగల్దాన్, బనిహాల్ మీదుగా నేరుగా శ్రీనగర్, బారాముల్లాకు చేరుకుంటాయి. ఈ రైల్వే మార్గం వల్ల రోడ్డు ప్రయాణంతో పోల్చితే సుమారు 6 గంటల సమయం ఆదా అవుతుంది. ప్రయాణం కూడా చాలా ఈజీగా మారుతుంది.
Three engineering marvels of Bharat;
🚄 Vande Bharat crossing over Chenab bridge and Anji khad bridge.
📍Jammu & Kashmir pic.twitter.com/tZzvHD3pXq— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 25, 2025
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి
చీనాబ్ నదిపై కేంద్ర ప్రభుత్వం రైల్వే వంతెనను ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. స్టీల్, కాంక్రీట్ తో ఈ బ్రిడ్జిని నిర్మించారు. జమ్మూ డివిజన్ లోని రియాసి సెక్టార్ లో ఉంది. కశ్మీర్ ను భారత్ లోని మిగతా ప్రాంతాలతో కనెక్ట్ చేసేందుకు చేపట్టిన USBRL ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ రైల్వే వంతెనను నిర్మించారు. ఈ వంతెన నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున నిర్మించారు. 1,315 మీటర్ల పొడవు ఉంటుంది. పారిస్ లోని ఈఫిట్ టవర్ తో పోల్చితే ఈ బ్రిడ్జి 30 మీటర్లు ఎక్కువ ఎత్తులో ఉంటుంది.
కాశ్మీర్ లోయకు వందేభారత్ ప్రయాణం
ఇక న్యూఢిల్లీ నుంచి కాశ్మీర్ కు వందేభారత్ రైలు ద్వారా సేవలను అందించనున్నారు. అంతేకాదు, USBRL మార్గంలో నడిచేందుకు వందేభారత్ రైలును ఫైనల్ చేశారు. ఈ మార్గంలో నడిచే రైలుకు మిగతా వందేభారత్ రైళ్లతో పోల్చితే అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది. కాశ్మీర్ లో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉంటాయి. బయట తీవ్రమైన మంచు కురుస్తున్నా చక్కటి విజుబులిటీతో రైలు ప్రయాణిస్తుంది. రైల్లోని ప్రయాణీకులకు చక్కటి వెచ్చదనాన్ని అందిస్తుంది. ఈ రైల్లోని నీరు గడ్డ కట్టకుండా తగిన ఏర్పాట్లు చేశారు.
Decades of wait ends here as epitome of speed & luxury "The Vande Bharat Express" reaches Jammu & Kashmir summer capital Srinagar on its maiden run.
Commercial Operations Hopefully Soon ✌️ #IndianRailways #VandeBharatpic.twitter.com/cT65cQm2JV— Trains of India (@trainwalebhaiya) January 25, 2025
టికెట్ల ధర ఎంతంటే?
ఇక ఢిల్లీ నుంచి కాశ్మీర్ కు వెళ్లే వందేభారత్ రైలుకు సంబంధించి టికెట్ ధర ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఆయా తరగతులను బట్టి రూ. 1,500, రూ. 2,100గా నిర్ణయించినట్లు సమాచారం. ఈ రైలు జమ్మూ, శ్రీమాతా వైష్ణోదేవి కత్రాలో హాల్టింగ్ తీసుకోనున్నట్లు తెలుస్తున్నది.