Jason Gillespie Angry On Pat Cummins: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును సాండ్ పేపర్ బాల్ టాంపరింగ్ (Sandpaper Ball Tampering) వ్యవహారం కుదిపేస్తోంది. ఆస్ట్రేలియా క్రికెటర్లు అందరూ బాల్ టాంపరింగ్ చేస్తారని ఉస్మాన్ ఖవాజా తన ఆత్మ కథలో రాసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సందర్భంగా కేవలం ముగ్గురు మాత్రమే బలయ్యారని.. ఇందులో అసలు సూత్రధారులు తప్పించుకున్నారని బాంబు పేల్చాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో ఉన్న ప్లేయర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.
ఇలాంటి నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ను (Pat Cummins) ఉద్దేశించి మాజీ ఫాస్ట్ బౌలర్ జేసన్ గిలెస్పీ ( Jason Gillespie) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ డబ్బులకు మరిగిన పాట్ కమ్మిన్స్.. ఆస్ట్రేలియా క్రికెట్ ను పట్టించుకోవడంలేదని విమర్శలు చేశాడు. పొద్దున లేస్తే ఐపీఎల్ ధ్యాస తప్ప.. వాడికి క్రికెట్ ఆస్ట్రేలియాకు ఆడాలన్న కసి లేదని విమర్శలు చేశాడు. 2023 వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును వదిలి ఐపీఎల్ పై మాత్రమే ఫోకస్ చేశాడని విమర్శలు చేశాడు. అయినప్పటికీ కూడా వాడినే వైట్ బాల్ కెప్టెన్ గా కొనసాగించడం దుర్మార్గం అంటూ సీరియస్ అయ్యాడు. కావ్య పాప డబ్బులకు కక్కుర్తి పడి, ఆస్ట్రేలియాను నాశనం చేశాడని ఫైర్ అయ్యాడు. దీంతో పాట్ కమ్మిన్స్ పై జేసన్ గిలెస్పీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
2027 వన్డే వరల్డ్ కప్ ముగిసినప్పటి నుంచి వైట్ బాల్ క్రికెట్ కు పాట్ కమిన్స్ దూరంగా ఉండడాన్ని ప్రశ్నిస్తూ జేసన్ గిలెస్పీ ( Jason Gillespie) సీరియస్ అయ్యాడు. 2023 వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియా 35 వన్డే మ్యాచ్ లు ఆడిందని వెల్లడించాడు. అయితే ఇందులో కమిన్స్ కేవలం మూడు మ్యాచ్ లు మాత్రమే ఆడడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించాడు. అయినప్పటికీ 2027 వన్డే వరల్డ్ కప్ లో పాట్ కమ్మిన్స్ నే ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడని.. ఇది దుర్మార్గం అంటూ ఫైర్ అయ్యాడు.
దీనిపైన వెంటనే క్రికెట్ ఆస్ట్రేలియా ఫోకస్ చేసి మరో కెప్టెన్ ను నియామకం చేయాలని డిమాండ్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్ ముగిసిన నుంచి ఇప్పటి వరకు కమిన్స్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదని ఫైర్ అయ్యాడు. కేవలం టెస్టులతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లపైనే పాట్ కమిన్స్ దృష్టి పెడుతున్నాడని ఆగ్రహించాడు. కెప్టెన్ అంటే మూడు ఫార్మాట్లు ఆడి జట్టును ముందుకు నడిపించడమేనని.. ఐపీఎల్ లాంటి టోర్నమెంట్ లో మాత్రమే ఆడడం కాడదంటూ హితువు పలికాడు. ఇప్పటికైనా ఐపిఎల్ ను వదిలేసి ఆస్ట్రేలియా జట్టుపై ఫోకస్ చేయాలని చురకలు అంటించాడు.