BigTV English

GPT-5 Backlash: జిపిటి-5 వద్దు రా బాబు.. చాట్ జిపిటి కొత్త వెర్షన్‌పై యూజర్ల అసంతృప్తి

GPT-5 Backlash: జిపిటి-5 వద్దు రా బాబు.. చాట్ జిపిటి కొత్త వెర్షన్‌పై యూజర్ల అసంతృప్తి

GPT-5 Backlash| ఓపెన్‌AI ఇటీవల GPT-5ని లాంచ్ చేసింది, ఇది GPT సిరీస్ మరియు o-సిరీస్‌లను సంయుక్తంగా ఒకే మోడల్‌ సిరసీగా మార్చింది. వివిధ మోడల్‌లను యూజర్లు ఎంచుకోవాల్సిన అవసరాన్ని తగ్గించి, అన్ని టాస్క్‌లకు ఒకే మోడల్‌ను అందించడమే దీని లక్ష్యం. ఓపెన్ ఏఐ ఈ కొత్త వెర్షన్ లాంచ్ చేయడం గొప్ప మెరుగుదలగా కనిపిస్తుంది.


అయితే, GPT-5తో పాటు ఓపెన్‌AI పాత మోడల్‌లను నిలిపివేస్తోంది. ఇందులో GPT-4o కూడా ఉంది. అయితే GPT-4o నిలిపివేస్తుండడంతో చాలా మంది వినియోగదారులు అసహననాకి గురవుతున్నారు.

యూజర్లు చేస్తున్న ఫిర్యాదులు ఏమిటి?
సోషల్ మీడియాలో చాలా మంది GPT-5, GPT-4o కంటే మంచిది కాదని చెబుతున్నారు. ఇది తక్కువ సామర్థ్యం కలిగి ఉందని, సమాధానాలు బోరింగ్‌గా, చిన్నగా, కస్టమైజ్ లేదా పర్సనలైజ్ లేకుండా ఉన్నాయని అంటున్నారు.


రెడ్డిట్‌లో u/Naddybear అనే యూజర్.. ఓపెన్ సిఈఓ CEO సామ్ ఆల్ట్‌మన్‌తో ఒక ఇంటర్‌వ్యూలో GPT-4o, GPT-5 ఫీచర్ల గురించి వాటిలో సమస్యల గురించి అడిగారు. GPT-4o క్రియేటివ్ టాస్క్‌లు, భావోద్వేగ సమాధానాలు, రోల్‌ప్లేకు గొప్పదని చెప్పారు. GPT-5 కోడింగ్ క్లిష్టమైన రీజనింగ్‌పై దృష్టి సారించిందని, అది అందరికీ ఉపయోగకరంగా ఉండదని అన్నారు. ఆల్ట్‌మన్ మెరుగుదలలు చేస్తామని హామీ ఇచ్చారు.

సామ్ ఆల్ట్‌మన్ సమాధానం
తర్వాత, యూజర్ల ఆందోళనలను ఆల్ట్‌మన్ X (పాత ట్విట్టర్)లో పోస్ట్ చేసి పరిష్కరించారు. ప్లస్ యూజర్లకు GPT-5 రేట్ లిమిట్‌లను రెట్టింపు చేస్తామని చెప్పారు. GPT-4oని ప్లస్ యూజర్లకు కొంతకాలం అందుబాటులో ఉంచుతామని ధృవీకరించారు. ఉపయోగాన్ని పర్యవేక్షించి ఎంతకాలం ఉంచాలో నిర్ణయిస్తామని అన్నారు.

ఆల్ట్‌మన్ GPT-5 సమాధానాలు సరిగా లేకపోవడానికి కారణం వివరించారు. “ఆటోస్విచర్” సిస్టమ్, టాస్క్‌లకు సరైన AI సామర్థ్యాలను ఎంచుకునే వ్యవస్థలో లోపాలు వచ్చాయని చెప్పారు. దీనివల్ల GPT-5 తప్పు సామర్థ్యాలను ఉపయోగించి బలహీనమైన సమాధానాలను ఇస్తోంది. ఓపెన్‌AI ఈ మోడల్-స్విచింగ్ ఫంక్షన్‌ను సరిచేస్తోంది. అలాగే, ఏ మోడల్ ఉపయోగిస్తున్నారో వినియోగదారులకు తెలియజేస్తామని చెప్పారు.

ఆర్థిక ఒత్తిడిలో ఓపెన్‌AI
CNBC ఇంటర్వ్యూలో.. ఆల్ట్‌మన్ మాట్లాడుతూ.. ఓపెన్‌AI బిలియన్ల డాలర్ల నష్టాల్లో నడుస్తోందని చెప్పారు, అయినప్పటికీ బిలియన్ల రెవెన్యూ వస్తున్నా. 2024లో రెవెన్యూ $3.7 బిలియన్, కానీ నష్టాలు $5 బిలియన్. ప్రధాన ఖర్చు సర్వర్ల నిర్వహణ. ఈ సొంతంగా కలిగినవి, అద్దెకు తీసుకున్నవి. ఈ కారణంగా పాత మోడల్‌లను నిలిపివేస్తున్నారు.

పాత మోడల్‌లలో ప్రత్యేక ఫీచర్‌లు ఉన్నాయి, కానీ GPT-5 ఇంకా పూర్తి స్థాయిలో సేవలు వేగంగా అందించడంలేదు. బహుళ మోడల్‌లను అందించడం ఖరీదైనది, కానీ పాతవాటిని తొలగించడం వినియోగదారులను అసంతృప్తికి గురిచేస్తుంది. ఓపెన్‌AIకి ఇప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది.

GPT-5 లాంచ్ ఓపెన్‌AIకి మిశ్రమ స్పందనలను తెచ్చిపెట్టింది. వినియోగదారులు GPT-4o తిరిగి తీసుకురావాలని కోరుతున్నారు, ఎందుకంటే GPT-5 ఇంకా అంచనాలను అందుకోలేదు. సామ్ ఆల్ట్‌మన్ మెరుగుదలలు చేస్తామని హామీ ఇచ్చారు, కానీ ఆర్థిక ఒత్తిడి కారణంగా పాత మోడల్‌లను ఎంతకాలం ఉంచుతారో చెప్పలేని పరిస్థితి. ఈ మార్పులు AI టూల్స్ వినియోగాన్ని ప్రభావితం చేయవచ్చు, కానీ ఓపెన్‌AI ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాలని వినియోగదారులు ఆశిస్తున్నారు.

Also Read: ఐఫోన్ 17 ప్రోలో చాట్ జిపిటి-5.. ఆపిల్ సంచలన ప్రకటన

Related News

Tesla Model Z: ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం.. టెస్లా మోడల్ జెడ్ పూర్తి వివరాలు..

Amazon vs Flipkart Laptops: అమెజాన్ vs ఫ్లిప్‌కార్ట్.. ల్యాప్‌టాప్స్‌పై డిస్కౌంట్లలో ఏది బెటర్?

Aprilia Tuono 457: గుండె ధైర్యం ఉన్నవాళ్లకే ఈ బైక్!.. అబ్బాయిలు రెడీనా?

iPhone 17 Connectivity issues: ఐఫోన్ 17, ఆపిల్ వాచ్‌లో వైఫై, బ్లూటూత్ సమస్యలు.. అసలు కారణం ఇదే..

Best Waterproof Phones: అమెజాన్ ఫెస్టివల్ సేల్ 2025.. వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు

Wi-Fi at Night: రాత్రిపూట వైఫై ఆన్ చేసి ఉంచితే ఇంత డేంజరా? ఊహిస్తేనే భయంగా ఉంది!

Amazon OnePlus: అమెజాన్ హాట్ డీల్.. 7100mAh బ్యాటరీ, 50MP కెమెరా గల వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ తగ్గింపు..

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Big Stories

×