Harish Shankar: షాక్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు హరీష్ శంకర్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దర్శకుడు హరీష్ కు, హీరో రవితేజకు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత మళ్లీ రవితేజ అవకాశం ఇవ్వడంతో మిరపకాయ్ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.
వాస్తవానికి మిరపకాయ్ సినిమాను పవన్ కళ్యాణ్ హీరోగా చేయాలని ఫిక్స్ అయ్యాడు హరీష్ శంకర్. కానీ కొన్ని కారణాల వలన అది జరగలేదు. మిరపకాయ్ సినిమా హిట్ అయిన తర్వాత గబ్బర్ సింగ్ సినిమాతో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు హరీష్ శంకర్. ఇప్పటికీ హరీష్ శంకర్ పేరు చెప్పగానే వినిపించే పేరు గబ్బర్ సింగ్.
త్రివిక్రమ్ కాంపౌండ్ లో హరీష్
గబ్బర్ సింగ్ సినిమా అయిపోయిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ సినిమా చూసి హరీష్ చాలా బాగా రాశాడు, బాగా తీశాడు కూడా అంటూ పొగిడారు. త్రివిక్రం పైన హరీష్ కు మంచి అభిమానం ఉంది. అయితే ఒక స్టేజ్ లో హరీష్ శంకర్ సినిమా పక్కనపెట్టి మిగతా సినిమాలకు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వడానికి కారణం త్రివిక్రమ్ అంటూ కొన్ని వార్తలు కూడా వచ్చాయి. దాని గురించి గతంలో హరీష్ కూడా క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి త్రివిక్రమ్ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో హరీష్ శంకర్ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా హరీష్ శంకర్ సినిమా చేయనున్నట్లు విశ్వసినీయ వర్గాల సమాచారం. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది.
టైం ఎలా చేంజ్ అయిందో.?
అర్జున్ రెడ్డి సినిమా విడుదల అయిన తర్వాత విజయ్ దేవరకొండ కి హరీష్ శంకర్ ఫోన్ చేశాడు. ఒకసారి కలుద్దాం అని చెప్పినప్పుడు. సినిమా గురించి కాకపోతే కలుద్దాం అన్నా అని విజయ్ దేవరకొండ నాతో అన్నాడు. సినిమా గురించి అయితే ఒక రెండు సంవత్సరాల వరకు బిజీ అని చెప్పాడట. నీకు నాకు మధ్య సినిమా కాకుండా ఇంకేముంటుంది, రెండు సంవత్సరాల తర్వాతే కలుద్దాం అని అప్పట్లో చెప్పాడట. ఈ విషయాన్ని గద్దల కొండ గణేష్ సినిమా ప్రమోషన్స్ లో హరీష్ శంకర్ తెలియజేశాడు. మొత్తానికి వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ హీరోగా గౌతమ్ సినిమా చేసే ప్రయత్నాలు అప్పట్లో చేశాడు, అప్పటికి పెళ్లిచూపులు సినిమా హిట్ అవడంతో సరిగ్గా గౌతం చెప్పిన కథను వినలేదు విజయ్. వీళ్ళిద్దరూ కలిసి కింగ్డమ్ చేశారు. మొత్తానికి అప్పుడు విజయ్ పట్టించుకోని దర్శకులుతో ఇప్పుడు సినిమాలు చేస్తున్నాడు.
Also Read: Mahesh Babu: తమిళ్ సూపర్ స్టార్ తో పని అయిపోయింది, ఇప్పుడు తెలుగు సూపర్ స్టార్