E-Paper
Advertisement

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!
Advertisement

TVVP Promotions: స్వేచ్ఛ బ్యూరో:  తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో ప్రమోషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా మూడేళ్ల నుంచి సివిల్ సర్జన్ స్పెషలిస్టు ప్రమోషన్లు జరగలేదు. గతంలో కోర్టు కేసులు, రీ డిప్లాయిమెంట్ పేరిట డీలే జరిగినా.. ఈ రెండు అంశాలు ఇటీవల క్లియర్ అయిన తర్వాత కూడా ప్రమోషన్లు పెండింగ్ లోనే ఉండటం గమనార్హం. పైగా ఈ ‘ఫ్యానెల్ ఇయర్’ ఈ ఏడాది ఆగస్టు 31తో ముగియనున్నది. నిబంధనల ప్రకారం ఫ్యానల్ ఇయర్ ముగిసేలోపే ప్రమోషన్ల జాబితాను సిద్ధం చేసి, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది.

ప్రమోషన్ వస్తదా? రాదా?

Advertisement

అయితే ఆగస్టు నెల ముగింపునకు చేరువవుతున్నా, విభాగంలో కనీస కదలిక లేకపోవడం గమనార్హం. ఈ నెల పూర్తయితే మరో ఏడాదంతా ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోయే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్యానల్ ఇయర్‌లో క్లోజ్ చేద్దామని స్వయంగా హెల్త్ సెక్రటరీ కూడా డాక్టర్ల సంఘాలకు గతంలో హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. దీనిపై తెలంగాణ వైద్య విధాన పరిషత్ వైద్యుల్లో మళ్లీ గందరగోళం నెలకొన్నది. ఈ ఫ్యానల్ ఇయర్ లోనైనా తమకు ప్రమోషన్ వస్తదా? రాదా? అని చాలా మంది డాక్టర్లు టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు.

మూడేళ్ల నిరీక్షణ..300 మందికి పైగా..

Advertisement

సివిల్ అసిస్టెంట్ సర్జన్లు ,డిప్యూటీ సివిల్ సర్జన్ల కేడర్ నుంచి సివిల్ సర్జన్ స్పెషలిస్టులుగా ప్రమోట్ కావడానికి దాదాపు 300 మందికి పైగా అర్హులైన వైద్యులు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. అర్హతలన్నీ ఉన్నప్పటికీ గత మూడేళ్లుగా ప్రమోషన్లు ఇవ్వకపోవడంతో వీరి కెరీర్ పురోగతి స్తంభించిపోయింది.ఈ ఫ్యానల్ ఇయర్ లోనైనా తమకుప్రమోషన్లు వస్తాయని చాలా మంది డాక్టర్లు ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటికీ ప్రమోషన్ ఫైల్ మూవ్ కాకపోవడంతో ఆయా డాక్టర్లు తీవ్ర అసహనాన్ని వ్యక్త చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా మారుమూల ప్రాంతాల్లో, ఏరియా ,జిల్లా ఆసుపత్రుల్లో అహర్నిశలు సేవలు అందించిన తమకు ఈ విధమైన ఆలస్యం తీవ్ర నిరాశను కలిగిస్తుందని ఓ డాక్టర్ తెలిపారు.

​కమిషనర్ లేకపోవడమే శాపమా?

టీవీవీపీలో అడ్మినిస్ట్రేషన్ ఈ స్థాయిలో అస్తవ్యస్తంగా తయారవ్వడానికి ‘పూర్తి స్థాయి కమిషనర్’ లేకపోవడమే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. ఎప్పటికప్పుడు తాత్కాలిక లేదా ఇన్‌ఛార్జ్ అధికారులతో కాలం వెళ్లదీస్తుండటంతో విధానపరమైన నిర్ణయాలు, సీనియారిటీ జాబితాల రూపకల్పన, డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ సమావేశాల నిర్వహణ మందగించింది.హెడ్ ఆఫీసులో ప్రమోషన్ ఫైళ్లు ముందుకు కదలకపోవడం, జూనియర్-సీనియర్ వివాదాల నెపంతో ప్రక్రియను వాయిదా వేస్తూ రావడం వల్ల సాధారణ వైద్యులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.

Also Read: రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

సాంకేతిక సమస్యలు..

ఇక వైద్యులకు రావాల్సిన అర్హత కలిగిన పదోన్నతులు నిలిచిపోవడం వల్ల ఆసుపత్రుల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్ తీవ్రంగా దెబ్బతింటోంది. స్పెషలిస్ట్ హోదా దక్కకపోవడంతో సంబంధిత విభాగాల నిర్వహణ, క్లినికల్ నిర్ణయాలు, ఆసుపత్రుల పర్యవేక్షణలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రమోషన్లు వస్తే సర్వీస్ తో పాటు ఆర్ధికంగానూ బెన్ ఫిట్ లభిస్తుందని డాక్టర్లు ఆశతో ఉన్నారు. ఇక ఈ ఆగస్టు ఆఖరు నాటికి పెండింగ్‌లో ఉన్న సీనియారిటీ జాబితాను ఖరారు చేసి, అర్హులైన సివిల్ సర్జన్ స్పెషలిస్టులకు తక్షణమే ప్రమోషన్లు కల్పించాలని వైద్య సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే టీవీవీపీకి పూర్తి స్థాయి కమిషనర్‌ను నియమించి పాలనా వ్యవహారాలను పట్టాలెక్కించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.

డెరెక్టరేట్ గా మారినా నో యూజ్..

నాలుగు నెలల క్రితమే తెలంగాణ వైద్య విధాన పరిషత్ డైరెక్టరేట్ గా మారింది. కానీ ఎలాంటి ఉపయోగం లేదని డాక్టర్ల నుంచి విమర్​శలు వస్తున్నాయి. హెచ్ వోడీ కార్యాలయంలో ఇప్పటికీ హెచ్ వోడీ లేదు. పది ప్రోగ్రామ్ ఆఫీసర్ పోస్టులు సైతం ఖాళీగానే ఉన్నాయి. ఇక జిల్లాల్లోనూ డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్​ హెల్త్ సర్వీసెస్ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. దీంతో అసలు వీవీపీ వర్క్ చేస్తుందా? లేదా? అనే అనుమానాలు ఉన్నాయి. ఇక ప్రాథమిక వైద్యం తర్వాత సెకండరీ హెల్త్ కేర్ కు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రులన్నీ సెకండరీ హెల్త్ కేర్ సర్వీసులందిస్తాయి.

సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ ప్రమోషన్లు..

తెలంగాణ వ్యాప్తంగా 184 ఆసుపత్రులు ఉండగా, వీటిలో 13 జిల్లా ఆసుపత్రులు, 64 వంద పడకల ఆసుపత్రులు, 30,50 పడకలు కలిగిన సామాజిక ఆరోగ్యకేంద్రాలు మరో 107 ఉన్నాయి. ఆసుపత్రులను నిత్యం మానిటరింగ్ చేసేందుకు డీసీహెచ్ లు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఉండాలి. కానీ 33 జిల్లాల్లో రెగ్యులర్ డీసీహెచ్‌లు లేరు. సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ ప్రమోషన్లు జరిగితే డీసీహెచ్లు నియామకాలకు లైన్ క్లియర్ అవుతుంది. ఇక పూర్తి స్థాయి కమిషనర్ లేకపోవడంతో ఇటీవల రిక్రూట్ అయిన సుమారు 600 మంది స్పెషలిస్టు వైద్యులకు ఇప్పటి వరకు పోస్టింగ్స్ ఇవ్వలేదు. మరో 2700 ఖాళీలు ఉన్నాయి. వీటి భర్తీకి ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. ఒక వైపు సీజనల్ వ్యాధుల సీజన్ మొదలైంది. కానీ ఇప్పటి వరకు టీవీపీసీలో కనీసం ఒక్క రివ్యూ కూడా జరగకపోవడం గమనార్హం.

Also Read: అమెరికా చదువులపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన సీజేపీ ఫౌండర్!

Tags

Related News

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

చిట్టీల పేరిట భారీ మోసం.. అమీన్‌పూర్‌లో రూ.2 కోట్లతో రాత్రికి రాత్రే దంపతులు పరార్!

గ్యాస్ పేలి తండ్రితో పాటు ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు.. కాపాడిన 108 సిబ్బంది!

Big Stories

Advertisement
×