Visio World 43 inch QLED TV: ప్రస్తుత కాలంలో స్మార్ట్ టీవీల మార్కెట్ చాలా వేగంగా మారుతోంది. కస్టమర్లు తక్కువ ధరలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, ముఖ్యంగా క్యూఎల్ఈడీ డిస్‌ప్లేను కోరుకుంటున్నారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో.. ఉంచుకుని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన విజియో వరల్డ్ సరి కొత్త ట్రెండ్‌కు తెరలేపింది. అదే ‘Visio World VW 109 cm TV’. కేవలం రూ.14,999 ధరకే అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ టీవీ టెక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.తక్కువ ధరలొ బెస్ట్ టీవీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంతకీ ఈ టీవీ ధర, ఫీచర్లకు సంబంధించిన వివరాలేంటో తెలుసుకుందామా..
ఈ టీవీ మెయిన్ హైలైట్ దీని డిస్‌ప్లే అనే చెప్పాలి. రూ.15 వేలలోపు బడ్జెట్‌లో క్యూఎల్ఈడీ స్క్రీన్ పొందడం నిజంగా గొప్ప విషయం. ఇందులో.. 109 సెం.మీ (43 ఇంచుల) సైజు కలిగిన ఫుల్ హెచ్‌డీ (Full HD – 1920 x 1080 పిక్సెల్స్) క్యూఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.ఈ టెక్నాలజీ కారణంగా కలర్స్ చాలా రిచ్‌గా, బ్రైట్‌గా , స్పష్టంగా కనిపిస్తాయి. హెచ్‌డీఆర్ 10సపోర్ట్ ఉండటం వల్ల సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసేటప్పుడు విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. 60Hz రిఫ్రెష్ రేట్ తో ఎలాంటి లాగ్స్ లేకుండా విజువల్స్ బాగుంటాయి.
కేవలం వీడియో క్వాలిటీ మాత్రమే కాకుండా.. సౌండ్ విషయంలో కూడా ఈ టీవీ అదరగొట్టింది. ఇందులో పవర్ ఫుల్ 24W స్పీకర్లను వాడారు. డాల్బీ లేదా సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో కూడిన ఈ స్పీకర్లు చిన్న లేదా మిడిల్ సైజ్ రూమ్స్ కు సరిపడా మంచి లౌడ్ , క్లియర్ ఆడియోను అందిస్తాయి. ప్రత్యేకంగా హోమ్ థియేటర్ స్పీకర్లు అవసరం లేకుండానే ఇంట్లోనే మ్యూజిక్ , సినిమా ఫీల్ పొందొచ్చు.
ఇది కేవలం సాధారణ టీవీ కాదు, ఒక పక్కా ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ. దీనిలో గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ ఉండటం వల్ల మీకు నచ్చిన యాప్స్ , గేమ్‌లను నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు అన్నీ ఇందులో ఇన్‌బిల్ట్‌గా వస్తాయి. అలాగే క్రోమ్‌కాస్ట్, స్క్రీన్ మిర్రరింగ్ ఫీచర్లు ఉండటం వల్ల మీ మొబైల్ లేదా ట్యాబ్ స్క్రీన్‌ను ఈజీగా టీవీకి కనెక్ట్ చేసి పెద్ద స్క్రీన్‌పై ఎంజాయ్ చేయెచ్చు.
ఈ టీవీలో కనెక్టివిటీ కోసం తగినన్ని పోర్ట్స్ ఇచ్చారు. బాక్సెస్,ల్యాప్‌టాప్‌లు లేదా గేమింగ్ కన్సోల్స్ కనెక్ట్ చేయడానికి 3 హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, పెన్‌డ్రైవ్‌ల కోసం 1 యూఎస్‌బీ పోర్ట్ అందుబాటులో ఉన్నాయి. వైఫై , బ్లూటూత్ ,ఈథర్‌నెట్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఉంది.
Also Read: వాట్సాప్‌లో అదిరిపోయే ప్రైవసీ ఫీచర్.. ఇంతకీ’రెస్ట్రిక్టెడ్ చాట్’ అంటే ఏంటీ?
ట్రెండ్‌కు తగ్గట్టుగా మారుతున్న హాల్స్ , బెడ్‌రూమ్‌లకు ఈ మోడల్ టీవీ చక్కగా సరి పోతుంది. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం క్యూఎల్ఈడీ ఫీచర్లు కావాలనుకునే సామాన్య,మిడిల్ క్లాస్ వారికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు.