E-Paper
Advertisement

వాట్సాప్‌లో అదిరిపోయే ప్రైవసీ ఫీచర్.. ఇంతకీ’రెస్ట్రిక్టెడ్ చాట్’ అంటే ఏంటీ?

వాట్సాప్‌లో అదిరిపోయే ప్రైవసీ ఫీచర్.. ఇంతకీ’రెస్ట్రిక్టెడ్ చాట్’ అంటే ఏంటీ?
Advertisement

WhatsApp New Feature: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, ఎప్పటికప్పుడు తన యూజర్ల ప్రైవసీని మరింత పటిష్టం చేయడానికి.. కొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంది. తాజాగా వాట్సాప్ మరో పవర్ ఫుల్ ప్రైవసీ అప్‌‌డేట్‌తో మన ముందుకొచ్చింది. అదే ‘రెస్ట్రిక్టెడ్ చాట్’ ఫీచర్. సాధారణ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌కు మించి, అత్యంత రహస్యంగా ఉండాల్సిన పర్సనల్ చాట్స్‌ను సేఫ్‌‌గా ఉంచడానికి ఇది ఎంతగానో ఉపయోగ పడుతుంది. అసలు ఈ ఫీచర్ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం.

‘రెస్ట్రిక్టెడ్ చాట్’ ప్రత్యేకతలు ఏమిటి?

Advertisement

ప్రైమరీ ఫోన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది: ఈ ఫీచర్ ఆన్ చేసిన చాట్ కేవలం మీ ప్రధాన మొబైల్ ఫోన్‌లో మాత్రమే కనిపిస్తుంది. వాట్సాప్ వెబ్ లేదా ఇతర లింక్ చేసిన డివైజెస్‌లో ఈ చాట్ అస్సలు కనిపించదు.

గ్యాలరీలో ఫొటోలు సేవ్ కావు: ఆ చాట్‌లో అవతలి వ్యక్తి పంపే ఫొటోలు లేదా వీడియోలు మీ ఫోన్ గ్యాలరీలో ఆటోమేటిక్‌గా సేవ్ కాకుండా ఆటో-బ్లాక్ అవుతాయి.

Advertisement

చాట్ : ఆ ప్రత్యేకమైన చాట్ వేరేవారికి పంపడానికి లేదా వేరే ఫార్మాట్‌లోకి మార్చడానికి వీలుపడదు.

మెటా ఏఐ : ఆ నిర్దిష్టమైన రెస్ట్రిక్టెడ్ చాట్‌లో మెటా ఏఐ ఫీచర్లు పూర్తిగా పని చేయవు. దీని వల్ల మీ ప్రైవేట్ డేటా ఏఐ  లేదా ఇతర అవసరాలకు వెళ్లకుండా సేఫ్ గా ఉంటుంది.

ఫ్యూచర్ అప్‌డేట్స్, సేఫ్టీ టిప్స్:

నోటిఫికేషన్ హైడ్: ఈ చాట్ నుంచి మెసేజ్ వస్తే పైన పాప్-అప్ నోటిఫికేషన్‌లో మెసేజ్ టెక్స్ట్ కనిపించకుండా వాట్సాప్ కేవలం “You have a new message” అని మాత్రమే చూపించేలా త్వరలో అప్‌గ్రేడ్ రాబోతోంది.

స్క్రీన్ షాట్ ప్రొటెక్షన్: ఈ రెస్ట్రిక్టెడ్ చాట్ విండోలో అవతలి వాళ్ళు లేదా మీరు స్క్రీన్ షాట్లు తీయడానికి కుదరకుండా ఆటోమేటిక్ బ్లాకింగ్ ఫీచర్ కూడా దీనికి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది.

మొత్తానికి వాట్సాప్ ఇస్తున్న ఈ అల్టిమేట్ ప్రైవసీ తో మన పర్సనల్ డేటాకు తిరుగు ఉండదు.

Also Read: ఆన్ లైన్ షాపింగ్ చేయకపోయినా పార్శిల్ వచ్చిందా? ఇలా చేస్తే..నిలువునా మోసపోతారు!

ఈ ఫీచర్‌ను ఎలా ఎనేబుల్ చేయాలి?

1.ముందుగా మీ వాట్సాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోండి.

2.మీరు ఎవరితోనైతే చాట్‌ను రెస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నారో వారి ప్రొఫైల్ లేదా చాట్ ఇన్ఫో (Chat Info) స్క్రీన్‌లోకి వెళ్లండి.

3.అక్కడ మీకు కనిపించే ‘రెస్ట్రిక్టెడ్ చాట్’ ఆప్షన్‌ను టోగుల్ చేసి ఆన్ చేయండి.

4.ఆ వెంటనే ఆ చాట్‌లో ఇద్దరికీ తెలిసేలా వాట్సాప్ ఒక సిస్టమ్ నోటిఫికేషన్ మెసేజ్‌ను చూపుతుంది.

5.మీ పర్సనల్ విషయాలు ఎవరికీ లీక్ కాకుండా ఉండేందుకు ఈ ఫీచర్ ఒక అద్భుతంగా పనిచేస్తుంది.

Related News

BSNL ధమాకా ఆఫర్.. ఒక్క రీఛార్జ్‌‌తో 380 రోజుల వ్యాలిడిటీ.. ఫ్రీ కాల్స్, రోజూ 2GB డేటా!

ఆన్ లైన్ షాపింగ్ చేయకపోయినా పార్శిల్ వచ్చిందా? ఇలా చేస్తే..నిలువునా మోసపోతారు!

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

Big Stories

Advertisement
×