E-Paper
Advertisement

బాల్యంలో లైంగిక దాడి.. 20 ఏళ్ల వయసులో తాతపై యువతి ప్రతీకారం.. క్రికెట్ బ్యాట్‌తో కొట్టి హత్య!

బాల్యంలో లైంగిక దాడి.. 20 ఏళ్ల వయసులో తాతపై యువతి ప్రతీకారం.. క్రికెట్ బ్యాట్‌తో కొట్టి హత్య!
Advertisement

Indore Shocker: మధ్యప్రదేశ్ ఇండోర్ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బాల్యంలో ఉండగా తాత తనపై లైంగిక దాడి చేశాడని ఇన్నాళ్ల తర్వాత గుర్తొచ్చి.. 20 ఏళ్ల యువతి ఆక్రోశంతో రగిలిపోయింది. తాత ఇంటికి వెళ్లి క్రికెట్ బ్యాటుతో కొట్టి దారుణంగా హత్య చేసింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అసలేం జరిగిందంటే?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలేజీలో చదువుకుంటున్న సదరు యువతి శనివారం రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను తీవ్రంగా మందలించారు. రాత్రి వేళల్లో బయట తిరగడం సురక్షితం కాదని, ఆమె భద్రత గురించే తాము ఆందోళన చెందుతున్నామని చెప్పారు. అయితే ఈ మాటలతో యువతికి కోపం రావడంతో పాటు చిన్ననాటి చేదు జ్ఞాపకానికి ఒక్కసారిగా గుర్తొచ్చాయి. ‘నా చిన్నతనంలో సొంత తాతే నన్ను లైంగికంగా వేధించినప్పుడు మీరు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు నా భద్రత గురించి మాట్లాడకండి’ అంటూ తల్లిదండ్రులపై కేకలు వేసింది.

బైక్ మీద వెళ్లి తాతపై దాడి

Advertisement

తల్లిదండ్రులతో గొడవ తర్వాత తీవ్రమైన ఆవేదనకు గురైన యువతి.. ఒక్కసారిగా తాతపై పగతో రగిలిపోయింది. తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇంట్లోని క్రికెట్ బ్యాట్ తీసుకుని బైక్‌పై తాత ఇంటికి బయలుదేరింది. ఆ సమయంలో తలుపు తీసిన నానమ్మను పక్కకు నెట్టేసి నేరుగా తాత పడుకున్న గదిలోకి వెళ్లింది. ఏమాత్రం ఆలోచించకుండా తన వద్ద ఉన్న క్రికెట్ బ్యాట్‌తో తాత తల, ముఖంపై వరుసగా 7-8 సార్లు బలంగా కొట్టింది.

చికిత్స పొందుతూ మృతి

మనవరాలి దాడితో నానమ్మ ఒక్కసారిగా షాక్ కు గురైంది. వెంటనే గట్టిగా కేకలు వేయడంతో పొరుగువారు ఇంట్లోకి పరిగెత్తుకు వచ్చారు. తీవ్ర రక్తస్రావంతో పడిఉన్న బాధితుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని అరబిందో ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. మృతుడు మధ్యప్రదేశ్ స్పెషల్ ఆర్మ్‌డ్ ఫోర్స్ (SAF) లో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగిగా పోలీసులు గుర్తించారు.

విచారణలో దిగ్భ్రాంతికర నిజాలు

Advertisement

దాడి అనంతరం పోలీసులు సదరు యువతిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇండోర్ అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ సింగ్ జాదోన్ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నతనంలో తాను తల్లిదండ్రులతో కలిసి తాత ఇంట్లోనే ఉండేదానినని యువతి చెప్పింది. ఆ సమయంలో తాత తనను అసభ్యకరంగా తాకుతూ లైంగికంగా వేధించేవాడని ఆరోపించింది. అప్పట్లోనే ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా, వారు తాతతో గొడవపడి వేరుగా కాపురం పెట్టారే తప్ప మరేం చేయలేకపోయారని తెలిపింది.

Also Read: BSNL ధమాకా ఆఫర్.. ఒక్క రీఛార్జ్‌‌తో 380 రోజుల వ్యాలిడిటీ.. ఫ్రీ కాల్స్, రోజూ 2GB డేటా!

‘గొడవ వల్లే గుర్తుకు వచ్చింది’

అయితే వయసు పెరిగిన కొద్ది బాల్యంలో జరిగిన దిగ్భ్రాంతికర ఘటనను తాను మర్చిపోయినట్లు సదరు యువతి విచారణలో తెలిపింది. అయితే శనివారం రాత్రి తల్లిదండ్రులతో జరిగిన వాగ్వాదం సందర్భంగా ఒక్కసారిగా ఆ చిన్ననాటి ‘ట్రామా’ (మానసిక గాయం) మళ్లీ గుర్తుకు వచ్చిందని ఆమె పేర్కొంది. తనకు జరిగిన అన్యాయం గుర్తొచ్చి.. ఆక్రోశంతోనే ఈ హత్యకు ఒడిగట్టినట్లు నిందితురాలు విచారణలో ఒప్పుకుందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read: Airtel ధమాకా ప్లాన్.. రూ.279‌కే నెట్ ఫ్లిక్స్ సహా 18 పైగా ఓటీటీలు.. ఇక ప్రతిరోజూ పక్కా ఎంటర్‌టైన్‌మెంట్!

Tags

Related News

‘రే*ప్ చేస్తే చస్తామనే భయం పుట్టించాలి’.. మహిళల భద్రతపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

ఓట్ల చోరీ.. జేబీ చోరీ.. కేంద్రంపై CPI నారాయణ సంచలన వ్యాఖ్యలు!

ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జి పైనుంచి దూసుకెళ్లిన కారు, విద్యుత్ తీగల మధ్యలో

లోపల ప్రియురాలు.. కారు బానెట్‌పై ఇల్లాలు, యూపీలో విచిత్ర ఘటన

ఇండియన్ ఆర్మీలో జాబ్స్.. బిఈ, బిటెక్ ఫ్రెషర్స్‌కు అద్భుత అవకాశం

SIR వివాదం, CEC జ్ఞానేశ్వర్ రాజీనామా డిమాండ్.. మోడీ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

ప్లాన్ ప్రకారమే పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!

Big Stories

Advertisement
×