BigTV English

Drinks For Stamina And Energy: చిన్న పని చేసినా అలసటగా అనిపిస్తుందా? అయితే ఆ పానీయాలు తీసుకోండి

Drinks For Stamina And Energy: చిన్న పని చేసినా అలసటగా అనిపిస్తుందా? అయితే ఆ పానీయాలు తీసుకోండి

 Best Energy Drinks To Increase Stamina: చాలా మంది బాగా పని చేయకపోయిన అలసటగా ఫీలవుతూ ఉంటారు. చిన్న చిన్న పనులకే అలసిపోతుంటారు. శారీరకంగా శ్రమ ఎక్కువైతేనే కాదు.. మానసికంగా శ్రమ ఎక్కువైన కూడా బాగా అలసటగా అనిపిస్తుంటుంది. ఏ పని చేసిన అలసిపోయి ఓపిక లేనట్లుగా ఉంటారు. ఇక అటువంటి వారు కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. అలసట, బలహీనతకు తగ్గింటుకోవాలంటే ప్రొటీన్లు కలిగిన ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల ఇలాంటి సమస్యల నుండి బయటపడవచ్చు. అయితే కొన్ని పానీయాలు సేకరించడం ద్వారా మీరు రోజంతా యాక్టివ్‌గా, ఆరోగ్యంగా ఉంటారు. ఆ పానీయాలేంటో తెలుసుకుందాం పదండి.


ప్రొటీన్ షేక్

ప్రతి ఒక్కరికి శరీరంలో ప్రొటీన్ అనేది చాలా అవసరం. మరీ ముఖ్యంగా వ్యాయామం చేసేవారికి, బరువు తగ్గాలనుకునేవారికి ప్రొటీన్ షేక్ తీసుకుంటే చాలా మంచిది. ఇది కండరాలు బలంగా ఉండేలా చేస్తాయి. శరీరంలోని అలసటను తగ్గిస్తాయి. ప్రతిరోజు ఉదయం ప్రొటీన్ షేక్ తీసుకోవడం వల్ల మీలోని కొత్త బలాన్ని ఇస్తుంది. ఆరోగ్యోంగా ఉంటారు.


కొబ్బరి నీళ్లు

కొబ్బరి నీళ్లలో సహజ శీతలీకరణ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని అలసటను తగ్గిస్తాయి. కొబ్బరి నీళ్ళల్లో కాల్షియం, ఐరన్, విటమిన్ సి వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. కొబ్బరి నీళ్లు త్రాగడం వల్ల శరీరంలోని అలసటను తగ్గిస్తాయి. కాబట్టి వీటిని తాగడం వల్ల తక్షణమే మీకు ఎనర్జీ వస్తుంది.

Also Read: జ్వరం వస్తే బరువు తగ్గుతారా ? నిపుణులు ఏం చెబుతున్నారు?

బీట్ రూట్ జ్యూస్.

ప్రతిరోజు బీట్ రూట్ జ్యూస్ తాగాడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. రక్తపోటు అదుపులో ఉంచుతుంది. ఎనర్జీ డ్రింక్‌లతో ఆరోగ్యాన్ని పాడుచేసుకునే బదులు బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా, ఎనర్జీగా, ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రతిరోజు బీట్ రూట్ జ్యూస్ తాగండి.

స్మూతీలు

ప్రతిరోజు ఉదయం అల్పాహారంలో స్మూతీలు తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. వీటివల్ల శరీరంలో హైడ్రేటెడ్ గా ఉంచడంతో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తాయి. ఆకుకూరలు, అవకాడో వంటి పండ్లతో స్మూతీలు తీసుకుంటే చాలా మంచిది. వీటిలో అనేక ప్రొటీన్లు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు.

చెర్రీ జ్యూస్

చెర్రీలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు, ఆంథోసైనిన్స్ వంటి గుణాలు అధికంగా ఉంటాయి. వీటిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇవి శరీరానికి శక్తిని అందించడంలో సహాపడతాయి. కండరాలను బలంగా ఉంచడంలో తోడ్పడుతాయి.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×