E-Paper
Advertisement

మహిళ నోట్లో గుడ్డలు కుక్కి.. ఐరన్ బాక్స్‌తో కొట్టి ఆ తర్వాత, హైదరాబాద్ సిటీలో దారుణహత్య

మహిళ నోట్లో గుడ్డలు కుక్కి.. ఐరన్ బాక్స్‌తో కొట్టి ఆ తర్వాత, హైదరాబాద్ సిటీలో దారుణహత్య
Advertisement

Hyderabad City: హైదరాబాద్‌ సిటీలో దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు.. ఓ మహిళను అత్యంత దారుణంగా హత మార్చారు. నోట్లో గుడ్డలు కుక్కి కాళ్లు కట్టేసి ఆ తర్వాత ప్రాణాలు తీశారు. రక్తపు మడుగులో తల్లిని చూసిన పిల్లలు, తండ్రికి సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన బయటపడింది. నగరంలోకి ఎక్కడ? ఏ ప్రాంతంలో జరిగింది? బాధితులు ఎక్కడివారు? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

హైదరాబాద్ సిటీలోని మీర్‌పేట్‌లో దారుణం

హైదరాబాద్ సిటీలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. జిల్లెల గూడ ధాతునగర్‌లోని శ్రీ లక్ష్మీ రెసిడెన్సీలో వెలుగు చూసింది. అపార్ట్‌మెంట్‌లో మూడో అంతస్తులో నివాసం ఉంటున్న అనిత-అనిల్ కుమార్ దంపతులు. వీరి సొంతూరు తమిళనాడు లోని కాంచీపురం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్నారు అరుణ్ కుమార్.  ఘటన సమయంలో పిల్లలు పాఠశాలకు వెళ్లారు.

Advertisement

మరి ఏం జరిగిందో తెలీదుగానీ మహిళను అత్యంత దారుణంగా హత్య చేసి చంపేశారు. నోటికి గుడ్డ చుట్టి, చేతులు-కాళ్లు కట్టేశారు. ఆ తర్వాత ఇంట్లోని ఐరన్ బాక్స్‌తో తలపై బలంగా కొట్టి హత్య చేశారు. అనిత ఒంటిపై ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లారు దుండగులు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలకు రక్తపు మడుగులో తల్లిని చూశారు. వెంటనే తండ్రి అరుణ్ కుమార్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

మహిళ నోట్లో గుడ్డలు కుక్కి, ఐరన్ బాక్స్‌తో కొట్టి

ఇంట్లో గొడవ శబ్దాలు విన్న స్థానికులు, తలుపులు కొట్టినా స్పందన లేదని అంటున్నారు. హత్య వెనుక కారణాలపై మీర్‌పేట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనిత హత్య వెనుక బయట వ్యక్తుల ప్రమేయం ఉందా? తెలిసిన వారే హత్య చేశారా? హత్యలో ఎంతమంది పాల్గొన్నారు? ఎవరి ప్రమేయమైనా ఉందా? నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. తెలిసిన వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానం మొదలైంది.

Advertisement

ALSO READ: శేఖర్ మాస్టర్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది?

అనిత తలను ఐరన్ బాక్స్‌తో కొట్టడంతో రక్తస్రావంతో ఇంట్లోనే చనిపోయింది. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు, చేతి గాజులు కనిపించడం లేదు. దొంగతనానికి వచ్చి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. క్లూస్ టీమ్‌ని రప్పించి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. ఇంట్లోని సీసీీటీవీ ఆ ప్రాంతంలో పుటేజ్‌ని క్షుణ్నంగా చెక్ చేస్తున్నాయి దర్యాప్తు బృందాలు.

Related News

శేఖర్ మాస్టర్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది?

కొత్త చట్టానికి తెలంగాణ సర్కారు పదును.. పేరెంట్స్‌ని చూడకపోతే జీతంలో కోత

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు బిగ్ షాక్.. వచ్చే మంగళవారం కోర్టులో హాజరుకావాల్సిందే!

నాగార్జునతో కలిసి తమ్మిడికుంట చెరువును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రత్యేకతలు ఇవే!

ప్రపంచానికి దిశానిర్దేశం చేయనున్న హైదరాబాద్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

‘కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బుద్ధి చెప్పండి’.. గ్రాడ్యుయేట్లకు కవిత పిలుపు!

మేడ్చల్ కలెక్టర్ మనూ చౌదరిపై హైకోర్టు ఆగ్రహం.. సీపీకి కీలక ఆదేశాలు

Big Stories

Advertisement
×