Voltas Beko 20L microwave: ప్రస్తుత కాలంలో వంటగదిలో పనిని ఈజీ చేసుకోవడానికి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల పాత్ర చాలా కీలకంగా మారింది. ముఖ్యంగా బిజీ లైఫ్‌స్టైల్ ఉన్నవారికి, బ్యాచిలర్స్‌కు మైక్రోవేవ్ ఓవెన్ అనేది నిత్య జీవితంలో అవసరం అయిపోయింది. తక్కువ సమయంలో వంటలను వేడి చేసుకోవడానికి, వంటకాలు తయారు చేసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగ పడుతుంది. మార్కెట్లో.. ఎన్నో బ్రాండ్లు అందుబాటులో ఉన్నప్పటికీ, నమ్మకమైన క్వాలిటీ , సరసమైన ధరలో లభించే ప్రొడక్ట్స్ వైపే మహిళలు మొగ్గు చూపుతున్నారు. అలాంటి వారి కోసమే ప్రముఖ బ్రాండ్ వోల్టాస్ బేకో మార్కెట్లోకి అద్భుతమైన ప్రొడక్ట్‌ను తీసుకువచ్చింది. అదే ‘వోల్టాస్ బేకో 20 లీటర్ల 700 వాట్ల స్మార్ట్ సోలో మైక్రోవేవ్ ఓవెన్’. దీని ఫీచర్లు, ధరకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
డిజైన్,ధర వివరాలు:
ఈ మైక్రోవేవ్ ఓవెన్ అసలు ధర మార్కెట్లో కేవలం రూ.5290 మాత్రమే ఉండటం విశేషం. ఈ బడ్జెట్‌లో నమ్మకమైన బ్రాండ్ నుంచి 20 లీటర్ల కెపాసిటీ ఉన్న ఓవెన్ లభించడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. చూడడానికి అత్యంత స్టైలిష్‌గా, మోడరన్ లుక్‌లో ఇది వస్తుంది. చిన్న, మధ్యతరహా కుటుంబాలకు, అలాగే ఆఫీస్ లేదా రూముల్లో ఉండే వారికి ఈ కెపాసిటీ సరిగ్గా సరి పోతుంది. మీ కిచెన్ కౌంటర్ టాప్‌పై తక్కువ స్థలాన్ని ఆక్రమించేలా దీన్ని కాంపాక్ట్ సైజ్‌లో డిజైన్ చేశారు. దీని ప్రీమియం లుక్ మీ వంటగది అందాన్ని మరింత పెంచుతుంది.
ఈ మైక్రోవేవ్ ఓవెన్ మెయిన్ హైలైట్ దీని పనితీరు. ఇందులో 700 వాట్ల పవర్ అవుట్‌పుట్ లభిస్తుంది. దీని వల్ల ఆహారం సమానంగా.. వేగంగా వేడెక్కుతుంది. సోలో మైక్రోవేవ్ ఓవెన్ కాబట్టి ఇది ముఖ్యంగా రీహీటింగ్ , డీఫ్రాస్టింగ్ , సాధారణ వంటలకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. పాలు వేడి చేసుకోవాలన్నా.. చల్లారిన ఆహారాన్ని వేడి చేయాలన్నా, లేదా చిరుతిళ్లు తయారు చేసుకోవాలన్నా.. ఇది క్షణాల్లో పని పూర్తి చేస్తుంది.
Also Read: రూ.1000లోపు బ్లూటూత్ సౌండ్‌బార్..మ్యూజిక్ వింటే స్టెప్పులేయాల్సిందే!
టెక్నాలజీ పరంగా చూస్తే, ఇది కస్టమర్లు ఎంతో ఈజీగా ఆపరేట్ చేసేలా రూపుదిద్దుకుంది. ఇందులో వివిధ రకాల ఆటో కుకింగ్ మోడ్స్ , టైమర్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు వండాలనుకునే వంటకానికి తగినట్లుగా పవర్ లెవెల్స్, టైమ్‌ను సెట్ చేసుకోవచ్చు. డిజిటల్ డిస్‌ప్లే , యూజర్ ఫ్రెండ్లీ నాబ్స్ కారణంగా దీన్ని ఆపరేట్ చేయడంకొత్తగా వంట నేర్చుకునే వారికైనా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే.. క్లీనింగ్ చేయడం కూడా ఈజీ కాబట్టి మైక్రోవేవ్ లోపల శుభ్రంగా ఉంచుకోవడం పెద్ద కష్టమేం కాదు.
అతి తక్కువ బడ్జెట్‌లో.. నమ్మకమైన బ్రాండ్ నుంచి మంచి కెపాసిటీ, స్మార్ట్ ఫీచర్లు కోరుకునే వారికి ‘వోల్టాస్ బేకో 20 లీటర్ల సోలో మైక్రోవేవ్ ఓవెన్’ ఒక పర్ఫెక్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్. మీరు కూడా మీ కిచెన్ కోసం కొత్త ఓవెన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే.. దీనిని వెంటనే ఆర్డర్ చేయండి!