TRIGGR 10000 mAh power bank: ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ మన జీవితంలో.. ఒక భాగమైపోయింది.ఆఫీస్ పని నుంచి సోషల్ మీడియా..వాడకం వరకు ప్రతి దానికీ ఫోనే ఆధారం. అయితే.. రోజంతా ఫోన్ వాడటం.. వల్ల సగం రోజూ.. గడవక ముందే బ్యాటరీ అయిపోవడం సర్వసాధారణం అయిపోయింది. బయట ఉన్నప్పుడు ఫోన్ ఛార్జ్ పెట్టుకోవడానికి.. ఛార్జర్ దొరకనప్పుడు పవర్ బ్యాంక్ ఎంతగానో సహాయ పడుతుంది. మార్కెట్లో.. చాలా పవర్ బ్యాంకులు ఉన్నప్పటికీ, తక్కువ ధరలో ..మంచి ఫీచర్లు ఇచ్చేవి వెతకడం కష్టం. ఈ సమస్యకు చక్కటి పరిష్కారంగా ట్రిగ్గర్ సంస్థ ఈ పవర్ బ్యాంక్‌ను కేవలం రూ. 699 ధరకే మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ చిన్న పవర్ బ్యాంక్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈ పవర్ బ్యాంక్ మెయిన్ హైలైట్ ప్లస్ పాయింట్ దీని సైజ్. ఇది పేరుకు.. తగ్గట్టుగానే చాలా కాంపాక్ట్‌గా , పాకెట్ సైజ్‌లో వస్తుంది. మీరు దీన్ని మీ పాకెట్‌లో …లేదా చిన్న హ్యాండ్ బ్యాగ్‌లో ఎంతో ఈజీగా సర్దుకోవచ్చు. మెరైనర్.. బ్లాక్ కలర్ ఆప్షన్‌లో.. లభించే ఈ పవర్ బ్యాంక్ లుక్ చాలా ప్రీమియంగా, ట్రెండీగా ఉంటుంది. అలాగే.. దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కాబట్టి రోజూ ప్రయాణాలు చేసే వారికి ఇది చాలా కాలం పాడవకుండా ఉంటుంది.
బడ్జెట్ ధరలో వచ్చినప్పటికీ..పెర్ఫార్మెన్స్ విషయంలో.. ఈ పవర్ బ్యాంక్ అస్సలు రాజీ పడలేదు. ఇందులో పర్ ఫుల్ 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇది క్విక్ ఛార్జ్ 3.0, పవర్ డెలివరీ 3.0 టెక్నాలజీలతో పని చేస్తుంది. దీనివల్ల మీ స్మార్ట్‌ఫోన్ కేవలం తక్కువ సమయంలోనే.. వేగంగా ఛార్జ్ అవుతుంది. మొబైల్స్ మాత్రమే.. కాకుండా టాబ్లెట్లు, ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ , స్మార్ట్ వాచ్‌లను కూడా దీని ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు.
Also Read: నమ్మలేని ఫీచర్లు బడ్జెట్ ధరలోనే..డబ్‌స్టెప్ బజ్ X11 వైర్‌లెస్ హెడ్‌సెట్ పూర్తి రివ్యూ!
ఇందులో 10000 mAh సామర్థ్యం గల లిథియం-పాలిమర్ బ్యాటరీని అమర్చారు. సాధారణ స్మార్ట్ ఫోన్‌ను ఇది ఈజీగా రెండుసార్లు పూర్తిగా ఛార్జ్ చేయగలదు. అంటే.. ఒక రోజు బయటికి వెళ్లేవారికి.. ఈ బ్యాటరీ బ్యాకప్ సరిగ్గా సరిపోతుంది. ఇక సేఫ్టీ విషయానికి వస్తే..ఇందులో మల్టిపుల్ సేఫ్టీ ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంది. ఇది మీ డివైజెస్‌కు ఓవర్-చార్జింగ్, ఓవర్-హీటింగ్, షార్ట్ సర్క్యూట్ కాకుండా రక్షణ కల్పిస్తుంది.
ఇండియన్ మార్కెట్లో ఈ మోడల్ ధర కేవలం రూ.699 మాత్రమే.ఆన్ లైన్ స్టోర్లలో ఇది కొనడానికి అందుబాటులో ఉంది.కేవలం వెయ్యి రూపాయల కంటే.. తక్కువ బడ్జెట్‌లో, పాకెట్ సైజ్ డిజైన్, 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభించడం నిజంగా.. చాలా గొప్ప విషయం.మీరు తరచూ ప్రయాణాలు చేస్తూ..తక్కువ బడ్జెట్‌లో.. పవర్ బ్యాంక్ కొనాలనుకుంటే.. ఈ మోడల్ పవర్ బ్యాంక్ మీకు సరైన ఆప్షన్ అవుతుంది.