BRS: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడేళ్లు కావస్తోంది. ఎన్నికలకు కేవలం రెండేళ్లు మాత్రమే ఉంది. ఈ క్రమంలో తెలంగాణలో రాజకీయ పార్టీలు యాక్టివ్ అవుతున్నాయి. సోమవారం అమిత్ షా మహా పాదయాత్ర చేస్తుండగా, దానికి ధీటుగా బీఆర్ఎస్ రెడీ అవుతోంది. ఈనెల 11 నుంచి బస్సు యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండేళ్లు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచి యాక్టివ్ అవుతున్నాయి. ఏదో ఒక అంశంపై ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాయి. మహా పాదయాత్ర పేరుతో సోమవారం హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర చేయనున్నారు. తెలంగాణలో బీజేపీ వేస్తున్న అడుగులను నిశితంగా పరిశీలిస్తోంది బీఆర్ఎస్. ఈ క్రమంలో నీటి అంశంపై బస్సు యాత్రకు రెడీ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఎల్‌నినో విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీఆర్ఎస్ రెడీ అయ్యింది. ఈ విషయంలో ఇప్పటికే అధికార ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతోంది. కాకపోతే నీటి అంశాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేశారు. కేటీఆర్ బస్సు యాత్ర విషయాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెల్లడించారు.
నవంబర్ 11 నుంచి 14 మధ్య రెండు రోజులు బస్సు యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ఈ యాత్ర మేడిగడ్డ నుంచి మొదలవుతుంది. గోదావరి పరీవాహక ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టుల మీదుగా సాగుతుంది. ప్రాజెక్టుల పరిస్థితిని పరిశీలించడం, రైతుల ఇబ్బందులను ప్రజలకు వివరించాలని డిసైడ్ అయ్యింది.
ALSO READ: మద్యం మత్తులో తండ్రి ఘాతుకం.. ఐదేళ్ల కొడుకుని చంపి.. హైదరాబాద్ దారుణమైన ఘటన
తెలంగాణ ఉద్యమంలో చారిత్రక ఘట్టం దీక్షా దివస్‌ను పురస్కరించుకుని నవంబర్ 29న బహిరంగ సభ నిర్ణయించినట్టు తెలిపారు. 2009లో కేసీఆర్‌ను అరెస్టు చేసిన అలుగునూరు లేదా నుస్తులాపూర్ ప్రాంతంలో సభకు ప్లాన్ చేస్తున్నారు. సుమారు 50 వేల మంది ప్రజలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది బీఆర్ఎస్. తెలంగాణ వ్యాప్తంగా మరో ఆరునెలల్లో కేటీఆర్ పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో వివిధ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బస్సు యాత్ర మొదలుపెడుతున్నట్లు ఆ పార్టీ నేతలు కొందరు చెబుతున్నారు. ఎటు చూసినా తెలంగాణలో పొలిటికల్ సీజన్ మొదలు అయ్యిందని చెప్పవచ్చు. మరి నేతల మధ్య మాటల తూటాలు ఏ స్థాయిలో పేలుతాయో చూడాలి.