Bigg Boss 10:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ సీజన్ 10 ఎట్టకేలకు 8 వారాలు పూర్తి చేసుకుంది. అయితే టాప్ ఫైవ్ లో ఉంటారనుకున్న ఝాన్సీ (Jhansi ) , రోహిత్ నాయుడు (Rohit Naidu) ఎలిమినేషన్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ సాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రోహిత్ నాయుడు విజేతగా నిలుస్తారని అభిమానులు, ఆడియన్స్ కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ ఇలా రోహిత్ అనూహ్యంగా ఎనిమిదవ వారమే ఎలిమినేట్ అవ్వడంతో ఆయనది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే . అంతేకాదు బిగ్ బాస్ పై విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. దీనికి తోడు బిగ్ బాస్ బజ్లో శివాజీ కూడా రోహిత్ కోసమే బిగ్ బాస్ చూసాను అంటూ చేసిన కామెంట్లు కూడా వైరల్ గా మారాయి.
అలా మొత్తానికైతే బిగ్ బాస్ సీజన్ 10లో ఎనిమిదవ వారం డబుల్ ఎలిమినేషన్ కారణంగా ఇద్దరు హౌస్ నుండి వెళ్లిపోయారు. ఇక తొమ్మిదవ వారం మొదలయ్యింది. సోమవారం అనగానే నామినేషన్ ప్రక్రియ గట్టిగా సాగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి గత నామినేషన్లను, ఎలిమినేషన్లను దృష్టిలో పెట్టుకొని కంటెస్టెంట్స్ ఒకరినొకరు నామినేట్ చేసుకోవడం హీటెక్కింది. 57వ రోజుకు సంబంధించి మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేయగా.. అందులో వంశీ.. ముఖేష్ ను నామినేట్ చేశారు. అల్టిమేట్ గోట్ టాస్క్ లో జరిగిన సన్నివేశాలను ప్రస్తావిస్తూ వంశీ ఈ విధంగా స్పందించారు.
వంశీ మాట్లాడుతూ.. ఎవరో ఒక వ్యక్తి ఇలా వచ్చి అలా రాడ్ తీసి ఇలా కొట్టాలి అని చెప్పే అసభ్యకరమైన మాటలు నీ నోట్లో నుంచి వస్తాయని నేను అసలు ఊహించలేదు. ఆ అసహ్యం అనే పదాన్ని నువ్వు ఎలా ఊహించుకుంటావో నాకు తెలియదు. ఝాన్సీ మిమ్మల్ని నమ్మి మీ దగ్గర ఉంటే.. ఇలాంటి వర్డ్స్ మాట్లాడేటప్పుడు ఆ అమ్మాయిని కూడా లేపారు. ఆ అమ్మాయికి అది ఎంతో ఎఫెక్ట్ అయి ఉంటుంది.ఆ అమ్మాయి ఏడవడానికి కారణం కూడా మీరే అంటూ ముఖేష్ ను నామినేట్ చేశారు వంశీ.
ALSO READ:ఫేక్ గురూ అంటూ పూనమ్ కౌర్ మరో షాకింగ్ పోస్ట్!
ఆ తర్వాత వర్షిణిని నామినేట్ చేస్తూ.. నేను ఫస్ట్ వీక్ లో తెలుసుకున్న విషయం .. మీ పర్సనాలిటీకి నచ్చిన వాళ్లను మీరు కనీసం ఒక్కసారి కూడా నామినేట్ చేయలేదు. అంటూ నామినేషన్ హీట్ పుట్టించారు. మధ్యలో ముఖేష్ రావడం, వర్షిని కలగజేసుకోవడం అన్ని వైరల్ గా మారుతున్నాయి. ఇక తర్వాత సుధీర్ వంశీని నామినేట్ చేశాడు. వంశీ కోపాన్ని చూసి నేను చాలా టెన్షన్ అవుతున్నాను అంటూ నామినేట్ చేశాడు. నా స్వభావం ఏంటి.. నా మీదకొస్తే నా కోపం అలాగే ఉంటుంది.. జంతువులన్నీ ఒకేలా ఉండవుగా అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. ఇక ముఖేష్ మాట్లాడుతూ అయితే అనిమల్ ప్లాంట్ కి వెళ్ళు ఇక్కడ ఎందుకు ఉన్నావు అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇక వంశీ రెచ్చిపోతూ చెల్లి చెల్లి అంటూ పిలుస్తూ బయటకు పంపించే స్వభావమైతే నాది కాదు అంటూ ఇన్ డైరెక్టుగా ఝాన్సీ ఎలిమినేషన్ కి ముఖేష్ కారణమంటూ వంశీ చేసిన నామినేషన్ కామెంట్ అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.