E-Paper
Advertisement

1,099కే నెక్ట్ లెవల్ ఫీచర్లున్నఇయర్ బడ్స్! డోంట్ మిస్

1,099కే నెక్ట్ లెవల్ ఫీచర్లున్నఇయర్ బడ్స్! డోంట్ మిస్
Advertisement

Noise Buds VS102 Neo review: ప్రస్తుత రోజుల్లో.. ప్రతి ఒక్కరి చేతిలో.. స్మార్ట్‌ ఫోన్ ఎంత ముఖ్యమో, చెవుల్లో వైర్‌ లెస్ ఇయర్ బడ్స్ కూడా అంతే ముఖ్యమైపోయాయి. మ్యూజిక్ వినడానికి, ఆఫీస్ కాల్స్ మాట్లాడడానికి.. ఇవి ఎంతో ఉపయోగ పడుతున్నాయి. అయితే చాలా మంది ఎక్కువ ధర.. పెట్టి ఇయర్ బడ్స్ కొనలేరు. అలాంటి వారి కోసం ప్రముఖ గాడ్జెట్ బ్రాండ్ ‘నాయిస్’ అతి తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో.. ఈ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. కేవలం రూ. 1,099 ధరకే లభిస్తున్న ఈ ఇయర్ బడ్స్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు ఈ బడ్జెట్ ఇయర్ బడ్స్ ఎలా పని చేస్తాయి? ఇందులో ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

ట్రెండీ డిజైన్,కలర్ ఆప్షన్స్:

ఈ డిజైన్ విషయానికి వస్తే.. ఇది చూడటానికి చాలా స్టైలిష్‌గా, మోడ్రన్‌గా ఉంది. ముఖ్యంగా ఇందులో.. లభించే ‘డీప్ వైన్’కలర్ ఆప్షన్ ఈ ఇయర్ బడ్స్‌కు మరింత రిచ్ లుక్‌ని ఇస్తుంది. ఛార్జింగ్ కేస్.. చాలా కాంపాక్ట్‌గా ఉండటంతో.. పాకెట్‌లో లేదా బ్యాగ్‌లో పెట్టుకోవడం చాలా ఈజీ. ఇయర్ బడ్స్ చెవుల్లో.. సరిగ్గా సరి పోయేలా..డిజైన్ చేశారు. దీని వల్ల ఎక్కువ సేపు వాడుకున్నా.. చెవుల్లో.. ఎలాంటి నొప్పి లేదా ఇబ్బంది కలగదు. డైలీ యూజ్ చేసే వారికి ఈ డిజైన్ ఎంతగానో నచ్చుతుంది.

సౌండ్ క్వాలిటీ,కాలింగ్ పర్ఫార్మెన్స్:

Advertisement

రూ. 1,099 ధరలో.. లభించే ఇయర్ బడ్స్ సౌండ్ ఎలా ఉంటుందోనని చాలా మంది సంకోచిస్తారు. కానీ నాయిస్ బడ్స్ ..VS102 నియో ఈ విషయంలో.. అస్సలు నిరాశ పరచదు. ఇందులో ..ఉన్న డ్రైవర్లు పాటల్లోని బేస్ , ట్రెబుల్‌ను చక్కగా బ్యాలెన్స్ చేస్తాయి. మీరు మ్యూజిక్.. వింటున్నప్పుడు.. మంచి క్లారిటీ లభిస్తుంది. అంతే కాకుండా.. ఇందులో క్వాడ్ మైక్ సెటప్, ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీని అందించారు. దీని వల్ల రద్దీగా ఉండే రోడ్లు లేదా బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు.. కూడా అవతలి వారికి మీ గొంతు స్పష్టంగా వినిపిస్తుంది. కాల్ క్వాలిటీ పరంగా ఈ ధరలో.. ఇది బెస్ట్ అని చెప్పొచ్చు.

బ్యాటరీ బ్యాకప్, ఛార్జింగ్:

ఈ ఇయర్ బడ్స్ మెయిన్ హైలైట్ వీటి బ్యాటరీ లైఫ్ అని చెప్పాలి. కేవలం.. వెయ్యి రూపాయల బడ్జెట్‌లో.. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 40 గంటల వరకు నాన్‌ స్టాప్ ప్లేబ్యాక్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. అంటే ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. రోజంతా వాడుకున్నా బ్యాటరీ అయిపోతుందనే.. టెన్షన్ ఉండదు. ఇక ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటంతో, అత్యవసర సమయంలో కొద్ది సేపు ఛార్జ్ చేస్తే గంటల తరబడి మ్యూజిక్ ఎంజాయ్ చేయెచ్చు.

Advertisement

Also Read: నమ్మలేని ఫీచర్లు బడ్జెట్ ధరలోనే..డబ్‌స్టెప్ బజ్ X11 వైర్‌లెస్ హెడ్‌సెట్ పూర్తి రివ్యూ!

గేమింగ్, కనెక్టివిటీ:

ఈ రోజుల్లో యూత్ ఎక్కువగా.. మొబైల్ గేమ్స్ ఆడుతుంటారు. వారిని దృష్టిలో.. ఉంచుకుని ఇందులో.. ప్రత్యేకమైన లో-లేటెన్సీ గేమింగ్ మోడ్ అందించారు. దీని వల్ల గేమ్స్ ఆడేటప్పుడు ఆడియో ,వీడియో మధ్య ఎలాంటి గ్యాప్ లేకుండా సింక్ అవుతుంది. ఇక కనెక్టివిటీ.. కోసం లేటెస్ట్ బ్లూటూత్ టెక్నాలజీని వాడారు. ఇది మీ ఫోన్‌తో క్షణాల్లో కనెక్ట్ అవుతుంది.

ధర:

ఇండియన్ మార్కెట్లో ఈ మోడల్ ధర కేవలం రూ. 1,099 మాత్రమే. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్లు , నాయిస్ అధికారిక సైట్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్ లుక్, 40 గంటల బ్యాటరీ లైఫ్, క్వాడ్ మైక్ ENC, మంచి సౌండ్ కోరుకునే వారికి ఇది సరిగ్గా సరి పోతుంది. మీ బడ్జెట్ పరిమితంగా ఉండి, ఒక మంచి ఆడియో డివైజ్ కొనాలనుకుంటే.. నిస్సందేహంగా ఈ మోడల్ కొనొచ్చు.

Related News

పవర్ బ్యాంక్ కొనాలనుకుంటున్నారా?బెస్ట్ గాడ్జెట్ ఇదే

డేటా అక్కర్లేని వారికి జియో గుడ్ న్యూస్.. అపరిమిత కాల్స్ కోసం సరికొత్త చౌకైన ప్లాన్లు!

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ డిష్ వాషర్ కావాలా?ఈ మోడల్ మీ కోసమే

ఇంతకాలం ఈ విషయం తెలియక ఎంత ఇబ్బంది పడ్డామో.. ఫోన్ ఛార్జర్‌తోనే ట్రిమ్మర్‌కు ఛార్జింగ్!

రూ.60 వేల శాంసంగ్ టీవీ ఇంత తక్కువకే వస్తే ఎవరు వదులుకుంటారు? దీపావళికి డబుల్ ధమాకా!

బడ్జెట్‌లో బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ ఇదే..ఫీచర్స్ చూస్తే షాక్ అవుతారు!

బెస్ట్ఇయర్ బడ్స్ కోసం చూస్తున్నారా? Oppo Enco X4పై ఓ లుక్కేయండి

Big Stories

Advertisement
×