E-Paper
Advertisement

డేటా అక్కర్లేని వారికి జియో గుడ్ న్యూస్.. అపరిమిత కాల్స్ కోసం సరికొత్త చౌకైన ప్లాన్లు!

డేటా అక్కర్లేని వారికి జియో గుడ్ న్యూస్.. అపరిమిత కాల్స్ కోసం సరికొత్త చౌకైన ప్లాన్లు!
Advertisement

Jio Voice Only Plans: మొబైల్ డేటాతో పనే లేకుండా కేవలం కాలింగ్ సేవలు మాత్రమే కోరుకునే వినియోగదారుల కోసం ‘రిలయన్స్ జియో’ (Reliance Jio) కొత్త వాయిస్-ఓన్లీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నిబంధనలకు అనుగుణంగా ఎయిర్‌టెల్, వి (Vi) ల బాటలోనే జియో కూడా ఈ ప్లాన్లను పరిచయం చేసింది. 22, 28, 30, 84, 336 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్స్ తీసుకొచ్చింది. వాటి ధరలు, యూజర్లకు కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈ కథనంలో చూద్దాం.

రూ.147 ప్రారంభ ధరతో..

జియో ప్రవేశపెట్టిన ఈ వాయిస్-ఓన్లీ ప్లాన్లు రూ. 147 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ ప్యాక్ ద్వారా వినియోగదారులకు 22 రోజుల వ్యాలిడిటీ లభించనుంది. అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు మొత్తంగా 300 SMSలు రూ.147 ప్లాన్ కింద యూజర్లు పొందొచ్చు.

రూ.177, రూ.196 రీచార్జ్ ప్లాన్లు

Advertisement

రూ.147 ప్లాన్ తో పాటు వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా జియో విభిన్న వ్యాలిడిటీతో మరికొన్ని ప్లాన్లు సైతం తీసుకొచ్చింది. రూ.177 (28 రోజులు), రూ.196 (30 రోజులు) ధరల్లో నెలవారీ ప్లాన్లను లాంచ్ చేసింది. అదే విధంగా క్యాలెండర్ తేదీ ఆధారంగా పనిచేసే రూ.197 మంత్లీ ప్లాన్ ను సైతం జియో తీసుకొచ్చింది. ఉదాహరణకు ఈ ప్లాన్ (రూ.197) ను 5వ తేదీన రీఛార్జ్ చేసుకుంటే తిరిగి మరుసటి నెల 5వ తేదీన రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు లభించనుంది. ఈ ప్లాన్లన్నింటిలోనూ అపరిమిత వాయిస్ కాల్స్ తో పాటు 300 SMSలు లభిస్తాయి. అయితే వీటిలో ఎలాంటి మొబైల్ డేటా సేవలు ఉండవు.

3 నెలల వ్యాలిడిటీతో రూ. 448 ప్లాన్

పదే పదే రీఛార్జ్ చేసుకునే పనిలేకుండా దాదాపు మూడు నెలల పాటు కనెక్షన్ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారి కోసం జియో రూ. 448 ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్, 1,000 SMSలతో పాటు జియో యాప్స్, ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందే ఛాన్స్ లభించనుంది.

Advertisement

Also Read: పాకిస్తాన్ ప‌ర్య‌ట‌న‌కు టీమిండియా రాక‌పోతే, బీసీసీఐ రోడ్డున ప‌డుతుంది

ఏడాది సేవలకు రూ. 1,748 ప్లాన్

సుదీర్ఘ వ్యాలిడిటీ కోరుకునే వారి కోసం రూ. 1,748తో వార్షిక ప్లాన్‌ను జియో పరిచయం చేసింది. ఈ ప్లాన్ ద్వారా 336 రోజుల వ్యాలిడిటీ యూజర్లకు లభించనుంది. ఇందులో అపరిమిత కాలింగ్, 3,600 ఎస్ఎంఎస్ లు, ఫ్రీ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి. మొబైల్ డేటా అవసరం లేకుండా కేవలం కాలింగ్ సేవలు మాత్రమే వినియోగించుకునే వారికి జియో ఈ కొత్త ప్లాన్లు ఎంతో ఊరట కలిగిస్తాయని జియో వర్గాలు పేర్కొంటున్నాయి.

Also Read:

Tags

Related News

పవర్ బ్యాంక్ కొనాలనుకుంటున్నారా?బెస్ట్ గాడ్జెట్ ఇదే

1,099కే నెక్ట్ లెవల్ ఫీచర్లున్నఇయర్ బడ్స్! డోంట్ మిస్

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ డిష్ వాషర్ కావాలా?ఈ మోడల్ మీ కోసమే

ఇంతకాలం ఈ విషయం తెలియక ఎంత ఇబ్బంది పడ్డామో.. ఫోన్ ఛార్జర్‌తోనే ట్రిమ్మర్‌కు ఛార్జింగ్!

రూ.60 వేల శాంసంగ్ టీవీ ఇంత తక్కువకే వస్తే ఎవరు వదులుకుంటారు? దీపావళికి డబుల్ ధమాకా!

బడ్జెట్‌లో బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ ఇదే..ఫీచర్స్ చూస్తే షాక్ అవుతారు!

బెస్ట్ఇయర్ బడ్స్ కోసం చూస్తున్నారా? Oppo Enco X4పై ఓ లుక్కేయండి

Big Stories

Advertisement
×