Dubstep Buzz X11: టెక్నాలజీ మారుతున్న కొద్దీ ..ఆడియో గాడ్జెట్ల రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. కేవలం పాటలు వినడమే కాకుండా.. క్లియర్ కాల్స్ మాట్లాడేందుకు వీలుగా.. ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్‌తో కూడిన ఇయర్‌బడ్స్‌కు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. ప్రస్తుతం యూత్ ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ, హై-పెర్ఫార్మెన్స్ వైర్‌లెస్ హెడ్‌సెట్ల గురించే ఎక్కువగా వెతుకుతున్నారు. ఈ కోవకే చెందిన ‘డబ్‌స్టెప్ బజ్ X11’ ఇయర్ బడ్స్ అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్‌ను షాక్ ఇస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఇయర్‌బడ్స్ మెయిన్ హైలైట్ వీటి బ్యాటరీ బ్యాకప్ అని చెప్పొచ్చు. సాధారణంగా.. బడ్జెట్ ఇయర్ బడ్స్ త్వరగా చార్జింగ్ అయిపోతుంటాయి. కానీ ఈ గాడ్జెట్ ఛార్జింగ్ కేస్‌తో.. కలిపి మొత్తంగా 60 గంటల వరకు ప్లేటైమ్‌ను అందిస్తుంది. అంటే ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. రోజూ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా వారం రోజుల పాటు హ్యాపీగా వాడొచ్చు. అలాగే.. టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల క్షణాల్లో ఛార్జ్ ఎక్కుతుంది.
పాటలు వినేటప్పుడు మంచి బేస్, క్రిస్టల్ క్లియర్ వాయిస్ కోరుకునేవారికి .. ఇందులో ఉన్న టెక్నాలజీ సరిగ్గా సరి పోతుంది. పెద్ద సైజు డ్రైవర్లు దీనిలో ఉండటం వల్ల మ్యూజిక్ చాలా రిచ్‌గా, డీప్‌గా వినిపిస్తుంది. ఇందులోని ప్రత్యేకమైన బేస్ టెక్నాలజీ కారణంగా బీట్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. రాప్, హిప్‌హాప్ లేదా హై-బీట్ సాంగ్స్ ఇష్ట పడే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
ENC టెక్నాలజీతో క్లియర్ కాల్స్:
మనం రద్దీగా ఉండే రోడ్లపై.. లేదా బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడితే.. అవతలి వారికి మన గొంతు సరిగ్గా వినిపించదు. కానీ ఈ హెడ్‌సెట్‌లో ఉన్న ENCమైక్ సిస్టమ్ చుట్టూ ఉండే.. అనవసరమైన సౌండ్స్ అణచివేసి, మీ వాయిస్‌ని అవతలి వారికి స్పష్టంగా చేరవేస్తుంది. ఆటోమేటిక్ బ్లూటూత్ కనెక్టివిటీ దీని సొంతం.
అందమైన బ్లూ కలర్‌తో పాటు ఇతర ఆకర్షణీయమైన రంగుల్లో.. లభించే ఈ ఇయర్ బడ్స్ చెవుల్లో పెట్టుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటాయి. ఎక్కువ సేపు పెట్టుకున్నా చెవులకు ఎలాంటి నొప్పికూడా రాదు.తక్కువ బరువుతో పాకెట్‌లో ఇవి ఈజీగా ఇమిడిపోతాయి.
Also Read: మీ వంటను ఈజీ చేసే..బెస్ట్ 5 స్మార్ట్ ఎయిర్ ఫ్రైయర్‌లు!
ఈ మోడల్ ప్రస్తుత మార్కెట్ ట్రెండ్స్, వివిధ ఆన్‌లైన్ క్విక్ కామర్స్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లలో.. ఇవి భారీ డిస్కౌంట్లతో కేవలం రూ.499 ధరల మధ్య అత్యంత తక్కువ ధరకే లభిస్తున్నాయి.ఈ ప్రైస్ రేంజ్‌లో ఇన్ని ఫీచర్లు రావడం నిజంగా టెర్రిఫిక్ ఆఫర్ అని చెప్పొచ్చు.
తక్కువ బడ్జెట్‌లో లాంగ్ బ్యాటరీ లైఫ్,పవర్‌ఫుల్ బేస్,స్టైలిష్ లుక్ కోరుకునే ప్రతి ఒక్కరికీ ‘డబ్‌స్టెప్ బజ్ X11’ ఒక అద్భుతమైన ఆప్షన్. ఈ ట్రెండింగ్ గాడ్జెట్‌తో మీ మ్యూజిక్ ప్రపంచాన్ని మరింత ఉత్సాహంగా మార్చుకోండి.