E-Paper
Advertisement

ఒకప్పుడు ఫైర్ ఇంజన్లు కడిగాడు.. నేడు రూ. 2,100 కోట్ల కంపెనీకి అధిపతి.. 27 ఏళ్ల కుర్రాడి గ్రేట్ సక్సెస్!

ఒకప్పుడు ఫైర్ ఇంజన్లు కడిగాడు.. నేడు రూ. 2,100 కోట్ల కంపెనీకి అధిపతి.. 27 ఏళ్ల కుర్రాడి గ్రేట్ సక్సెస్!
Advertisement

Martin Hunt Success Story: 15 ఏళ్ల వయసులోనే అగ్నిమాపక దళంలో వాలంటీర్‌గా చేరిన ఓ యువకుడు.. నేడు రూ. 2,107.65 కోట్ల (225 మిలియన్ డాలర్లు) విలువైన స్టార్టప్ కంపెనీకి సహ వ్యవస్థాపకుడిగా ఎదిగాడు. గోల్డ్‌మన్ శాక్స్‌లో తన అత్యున్నత ఉద్యోగాన్ని వదిలిపెట్టి.. ప్రస్తుతం గొప్ప బిజినెస్ మెన్ గా ఎదిగాడు. తన ‘గ్యారేజ్’ సంస్థతో 27 ఏళ్ల మార్టిన్ హంట్ అద్భుతాలు సృష్టిస్తున్నారు.

రూ. 384 కోట్ల నిధుల సమీకరణ

నవంబర్ 10న ప్రచురితమైన ఫార్చ్యూన్ నివేదిక ప్రకారం.. ‘గ్యారేజ్’ సంస్థ ఇటీవల ఇన్వస్ ఆపర్చునిటీస్ (Invus Opportunities) నేతృత్వంలో జరిగిన సిరీస్-బి రౌండ్‌లో రూ. 384.17 కోట్ల నిధులను సమీకరించింది. ఈ తాజా పెట్టుబడితో కంపెనీ విలువ ఏకంగా రూ. 2,107.65 కోట్లకు చేరుకుంది. ఇప్పటివరకు ఈ సంస్థ సేకరించిన మొత్తం నిధులు రూ. 562.20 కోట్లకు పెరిగాయి.

అగ్నిమాపక కేంద్రం నుంచే వ్యాపార ఆలోచన

Advertisement

మార్టిన్ హంట్ ప్రయాణం.. అమెరికాలోని నార్త్ డెలావేర్‌లోని అగ్నిమాపక విభాగంలో 15 ఏళ్ల వయసులో మొదలైంది. మంటలను ఆర్పడంలో సహాయం చేస్తూనే పాత ఫైర్ ఇంజన్లను విక్రయించే బాధ్యతల్లోనూ మార్టిన్ పాలుపంచుకునేవారు. ఆ సమయంలో ఫోన్ కాల్స్, స్థానిక వేలంపాటల ద్వారా కొనుగోలుదారులను వెతకడం ఎంత కష్టమో స్వయంగా చూశారు. 2023లో గోల్డ్‌మన్ శాక్స్‌లో ప్రైవేట్ ఈక్విటీ విభాగంలో పనిచేస్తున్నప్పుడు పాత పరికరాలను ఎలా అమ్మాలో సలహా అడుగుతూ పాత సహోద్యోగి నుంచి హంట్‌కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే ఆనాటి జ్ఞాపకాలు ఒక్కసారిగా అతడి కళ్లముందర మెదిలాయి.

ఉద్యోగం వదిలి.. ‘గ్యారేజ్’ స్థాపన

ఆ ఒక్క ఫోన్ కాల్ హంట్ ఆలోచనలను మార్చేసింది. ట్విట్టర్ (Twitter) మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అలాజ్ సెంగుల్‌తో కలిసి పాత అత్యవసర వాహనాల కోసం ఒక ఆన్‌లైన్ వేదికను రూపొందించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇద్దరూ తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి.. తమ సేవింగ్స్ డబ్బును పెట్టుబడిగా పెట్టారు. 2024 శీతాకాలంలో ‘గ్యారేజ్’ను ప్రారంభించారు.

ఏఐతో వినూత్న సేవలు

Advertisement

సాధారణ డీలర్‌షిప్‌ల మాదిరిగా వాహనాలను ముందే కొనుగోలు చేసి.. గోదాముల్లో నిల్వ ఉంచే విధానానికి ‘గ్యారేజ్’ సంస్థ ద్వారా మార్టిన్ స్వస్తి పలికారు. కొనుగోలుదారులు, అమ్మకందారులను నేరుగా కలిపే వేదికగా దీన్ని మార్చారు. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఫైనాన్సింగ్, డెలివరీ అంచనాలు, వారంటీ వంటి సదుపాయాలను ‘గ్యారెజ్’ సంస్థ కల్పిస్తోంది.

అద్బుతమైన ఫలితాలు..

గ్యారేజ్ సంస్థ ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నట్లు మార్టిన్ తెలిపారు. 2025లో తమ ఊరి అగ్నిమాపక విభాగం ఒక పాత ఫైర్ ఇంజన్‌కు కేవలం రూ. 28.11 లక్షలు వస్తుందని అంచనా వేయగా.. ‘గ్యారేజ్’ ద్వారా కేవలం కొద్ది రోజుల్లోనే ఏకంగా రూ. 1.17 కోట్లకు అమ్ముడుపోయిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ సంస్థ అమెరికా, కెనడా వ్యాప్తంగా 1,000కి పైగా కమ్యూనిటీలకు సేవలు అందిస్తూ.. పరికరాల విక్రయాలలో రూ. 937 కోట్ల మార్కును దాటినట్లు తెలియజేశారు.

Also Read: 65 ఏళ్ల వయసులో రూ. 20 భోజనంతో ప్రారంభం.. నేడు రూ. 2.5 కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

వ్యాపార విస్తరణపై ఫోకస్..

మరోవైపు వెస్ట్ వర్జీనియాలోని సౌత్ చార్లెస్టన్ నగరం తమ వద్ద ఉన్న అడిషనల్ పరికరాలను గ్యారేజ్ ద్వారా విక్రయించి రూ. 11.24 కోట్లకు పైగా ఆదాయాన్ని పొందడం విశేషం. ఆ నిధులతో కొత్త పరికరాలను కొనుగోలు చేయడమే కాకుండా.. అగ్నిమాపక సిబ్బందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు సైతం నిర్వహించారని మార్టిన్ తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా సమీకరించిన నిధులను కొత్త నియామకాలతో పాటు పబ్లిక్ వర్క్స్, పారిశుద్ధ్య పరికరాల విభాగాలకు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ఉపయోగిస్తామని మార్టిన్ చెప్పుకొచ్చారు.

Also Read: సీఎం భారీ బహిరంగ సభకు ముందే కవిత టూర్‌! పార్టీ నిర్మాణానికి శంఖుస్థాపన..! సర్వ మత ప్రార్థనలు.. ప్రెస్‌మీట్‌!

Tags

Related News

65 ఏళ్ల వయసులో రూ. 20 భోజనంతో ప్రారంభం.. నేడు రూ. 2.5 కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

గృహిణులకు గోల్డెన్ ఛాన్స్.. రూ.1 లక్ష పెట్టుబడితో.. ఇంటి నుంచే చేయగల 4 సూపర్ బిజినెస్‌లు!

తక్కువ జీతంతో సొంతూరిలో ఉండాలా? లేక ఎక్కువ జీతం కోసం హైదరాబాద్, బెంగుళూరుకు వెళ్లాలా?

ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 13న బ్యాంకులకు సెలవు.. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్రాంచ్‌లు క్లోజ్!

బంగారం ధర పతనం.. కొనుగోలుదారుల్లో ఒకటే ఆనందం, కొన్నాళ్ల వరకు పతనం?

2 బీహెచ్‌కే ఫ్లాట్‌ని కేవలం రూ. 155.. ఇంతకీ ఎక్కడో తెలుసా? ఆనందంలో కొనుగోలుదారుడు

వాహనదారులకు కడుపు మంట.. చమురు కంపెనీల లాభాల పంట

Big Stories

Advertisement
×