Digital Arrest: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసం కేసులో కీలక నిందితుడి పోలీసులు అరెస్ట్ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో నిందితుడు సంబిత్ కుమార్ నాయక్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితుడు ఒడిశాకు చెందిన 24 ఏళ్ల ఫ్రీలాన్స్ మోడల్‌గా పోలీసులు గుర్తించారు. టెలిగ్రామ్ ద్వారా చైనా సైబర్ నేరగాళ్లతో పరిచయం పెంచుకున్నట్టు పోలీసులు తెలిపారు.
సైబర్ ముఠాలకు మ్యూల్ బ్యాంక్ ఖాతాలు, రిజిస్టర్డ్ సిమ్ కార్డులు సరఫరా చేస్తున్నాడని, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన OTPలను నేరగాళ్లకు చేరవేస్తూ సైబర్ మోసాలకు సహకారం అందిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కంబోడియాలో కార్యకలాపాలు సాగిస్తున్న చైనా నేరగాళ్లతో సంబంధాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడించారు. బెంగళూరు పోలీసులమంటూ వాట్సాప్‌లో బెదిరించి డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.6,60,543 కాజేసిన సైబర్ ముఠా.. మోసానికి గురైన బాధితురాలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై గుండె సంబంధిత సమస్యతో సెప్టెంబర్ 8న మృతి చెందారు.
బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ మోసంలో ఉపయోగించిన ICICI బ్యాంకు ఖాతాకు సంబంధించి దేశవ్యాప్తంగా మరో మూడు సైబర్ క్రైమ్ కేసులు నమోదైనట్ పోలీసలు గుర్తించారు. గతంలోనూ పింప్రి చించ్వాడ్, కాలేపడల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సైబర్ మోసం కేసుల్లో నిందితుడు అరెస్ట్ అయ్యాడు సుమారు ఆరు నెలల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉండి విడుదలైన తర్వాత మళ్లీ సైబర్ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు ఆరోపణలు చేస్తున్నారు. నిందితుడి నుంచి ఒక మొబైల్ ఫోన్ తీసుకుని, ఏసీపీ ఆర్.జి. శివ మారుతి పర్యవేక్షణలో నిందితుడిని పట్టుకున్నారు.
Also read: అందాల డోస్ పెంచేసిన రియా.. పింక్ డ్రెస్‌లో పిచ్చెక్కించేసిందిగా!