E-Paper
Advertisement

Galaxies : ఒకేసారి 25 వేల గ్యాలక్సీలు క్యాప్చర్.. వెబ్ టెలిస్కోప్ రికార్డ్..

Galaxies : ఒకేసారి 25 వేల గ్యాలక్సీలు క్యాప్చర్.. వెబ్ టెలిస్కోప్ రికార్డ్..
Advertisement
Galaxies

Galaxies : పెరుగుతున్న టెక్నాలజీ సాయంతో అంతరిక్షంపై పరీక్షలు చేయడం చాలావరకు సులభంగా మారింది. అంతే కాకుండా భూమిపైన కూర్చొనే అంతరిక్షంలో జరుగుతున్న మార్పుల గురించి సింపుల్‌గా స్టడీ చేసే అవకాశం దొరుకుతోంది. తాజాగా 20 ఏళ్లలో సాధించలేని రికార్డ్‌ను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సాధించి చూపించింది. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టించిన ఈ వెబ్ టెలిస్కోప్ తాజాగా మరో అద్భుతాన్ని చేయగలిగింది.

ఇప్పటికే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది ఇతర టెలిస్కోప్‌లు కనుక్కోలేని ఎన్నో విషయాలను అంతరిక్షంలో కనుక్కుంది. కెనడా, యూరోప్, అమెరికా కలిసి తయారు చేసిన ఈ వెబ్ టెలిస్కోప్ ఇప్పటికే ఎన్నో ఇతర గ్యాలక్సీలను కనుక్కోవడానికి సహాయపడింది. తాజాగా వాటన్నింటికి మించి మరో కొత్త ఘనత సాధించింది ఈ టెలిస్కోప్. తాజాగా ఒక్క స్నాప్‌షాప్‌తో ఒకేసారి 25 వేల గ్యాలక్సీలను ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ రికార్డ్ చేయగలిగింది. 20 ఏళ్ల క్రితం ఒక ఫీల్డ్ సర్వేలో కూడా ఒకేసారి ఎక్కువ గ్యాలక్సీలను స్నాప్‌సాట్ తీయడానికి ప్రయత్నించారు. కానీ ఇప్పుడు షాట్ తీసిన గ్యాలక్సీల సంఖ్య వాటికంటే ఎక్కువని తెలుస్తోంది.

Advertisement

20 ఏళ్ల క్రితం హబుల్ స్పేస్ టెలిస్కోప్ చేసిన అల్ట్రా డీప్ ఫీల్డ్ సర్వేలో 10 వేల గ్యాలక్సీలను ఒకేసారి క్యాప్చర్ చేయగలిగారు. ఇప్పుడు ఏకంగా 25 వేల గ్యాలక్సీలను ఒకే ఇమేజ్‌లో క్యాప్చర్ చేయగలిగినందుకు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కొత్త రికార్డునే సృష్టించింది. ఇది అంతరిక్షంలోని కేవలం 4 శాతం డేటాతో సమానమని, వచ్చే ఏడాదిలోపు మరింత సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నిస్తామని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒకేసారి ఇన్ని గ్యాలక్సీలను ఒకే ఇమేజ్‌లో చూడడానికి చాలా అందంగా ఉందని వారు తెలిపారు.

2022 జులైలో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది లాంచ్ అయ్యింది. అయితే ఈ లాంచ్ గురించి సన్నాహాలు జరుగుతున్నప్పుడే నాసా శాస్త్రవేత్తలతో పాటు యూరోప్ స్పేస్ ఏజెన్సీ, కెనడా స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు.. మనుషులు ఇప్పటివరకు వెళ్లలేని అంతరిక్ష ప్రాంతాలకు కూడా ఈ టెలిస్కోప్ వెళుతుందని మాటిచ్చారు. ఇప్పుడు వారు అనుకున్నది సాధించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన గ్యాలక్సీల ఇమేజ్‌ను విడుదల చేశారు. అంతే కాకుండా మరిన్ని అద్భుతాలు ఈ టెలిస్కోప్ వల్ల జరగనున్నాయని శాస్త్రవేత్తలు హామీ ఇస్తున్నారు.

Tags

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×