Peshawar Zalmi Were Involved in Ball-Tampering: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Pakistan Super League 2026 Tournament) నేపథ్యంలో పెషావర్ జల్మీ (Peshawar Zalmi ) జట్టు బాల్ టాంపరింగ్ కు (Ball-Tampering) పాల్పడినట్టు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ డైరెక్టర్ నదీమ్ ఖాన్ (Nadeem Khan ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అందుకే పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో బాబర్ ఆజం కెప్టెన్ గా వ్యవహరించిన పెషావర్ జల్మీ ఛాంపియన్ గా నిలిచిందని ఆరోపించాడు. తాజాగా గ్రాస్ రూట్స్ క్రికెట్ పాడ్ కాస్ట్ లో నదీమ్ ఖాన్ (Nadeem Khan) పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ వ్యవస్థపై నదీమ్ ఖాన్ (Nadeem Khan ) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇందులో భాగంగానే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో బాల్ టాంపరింగ్ సర్వ సాధారణంగా మారిపోయిందని.. ప్రతి మ్యాచ్ లో టాంపరింగ్ చేస్తున్నట్టు బాంబు పేల్చాడు. బాల్ టాంపరింగ్ చేయడంలో పెషావర్ జల్మీ జట్టు ముందు వరుసలో ఉంటుందని పేర్కొన్నాడు. డెత్ ఓవర్లలో తరచు బాల్ టాంపరింగ్ చేసి మ్యాచ్ గెలిచారని ఆరోపించాడు. బంతి ఆకారాన్ని మార్చేందుకు వాళ్ళు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారని.. ఇదంతా బాబర్ ఆజం కనుసన్నలోనే జరుగుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పెషావర్ జల్మీలో అందరూ దొంగలేనని…బాల్ టాంపరింగ్ చేసి PSL 2026 టైటిల్ గెలిచారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో బాల్ టాంపరింగ్ పై నదీమ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
బాల్ టాంపరింగ్ జరుగుతోందని పీసీబీ మాజీ డైరెక్టర్ నదీమ్ ఖాన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో రక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో కీలక పదవి అనుభవించిన వ్యక్తి స్వయంగా పెషావర్ జల్మీ బాల్ టెంపరింగ్ చేసిందని ఆరోపణలు చేయడంపైన కచ్చితంగా విచారణ జరగాల్సిందేనని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కేవలం పెషవర్ జల్మీ జట్టు మాత్రమే చేసిందా? లేక మిగతా జట్లు కూడా ఈ దుర్మార్గానికి తెర లేపాయా ? అనేదానిపై కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విచారణ చేయాలని డిమాండ్లు చేస్తున్నారు. 2026 పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటు సందర్భంగా బాల్ టాంపరింగ్ చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని కూడా కోరుతున్నారు. ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్ గా ఉన్న పెషావర్ జల్మీ… హైదరాబాద్ కింగ్స్ మెన్ పై విక్టరీ కొట్టి టైటిల్ విజేతగా నిలిచింది. 2020 టోర్నమెంట్ సందర్భంగా కూడా ఛాంపియన్ గా నిలిచింది.