E-Paper
Advertisement

గంభీర్ ను చాపెల్ లాంటి దుర్మార్గుడితో పోల్చొద్దు.. అత‌డు టీమిండియా ద‌క్కిన వ‌రం!

గంభీర్ ను చాపెల్ లాంటి దుర్మార్గుడితో పోల్చొద్దు.. అత‌డు టీమిండియా ద‌క్కిన వ‌రం!
Advertisement

Ambati Rayudu On Gambhir:  టీమిండియా హెడ్ కోర్స్ గౌతమ్ గంభీర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అతడు తీసుకున్న ప్రతి నిర్ణయంపై వివాదం రాజుకుంటూనే ఉంది. కేకేఆర్, గుజరాత్ టైటాన్స్ జట్టుకు సంబంధించిన ఆటగాళ్లను మాత్రమే టీమిండియాలోకి తీసుకువస్తున్నాడని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇక న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ సందర్భంగా మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజాలను పక్కకు పెట్టడంపై కూడా గౌత‌మ్ గంభీర్ ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు. గ్రెగ్ చాపెల్ త‌ర‌హాలోనే టీమిండియాను నాశ‌నం చేస్తున్నాడ‌ని పోస్టులు పెడుతున్నాడు.

గంభీర్ ను చాపెల్ లాంటి దుర్మార్గుడితో పోల్చొద్దు -అంబటి రాయుడు 

ఇలాంటి క్రమంలో గౌతమ్ గంభీర్ గొప్ప కోచ్ అంటూ టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. గ్రెగ్ చాపెల్ తో గంభీర్ ను అస్స‌లు పోల్చ‌వ‌ద్ద‌ని, అది చాలా త‌ప్ప‌న్నాడు. గంభీర్ ను ఒకవైపు ట్రోలింగ్ చేస్తుంటే.. మరోవైపు అంబటి రాయుడు మెచ్చుకుంటూ కామెంట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఓ తెలుగు మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్ ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా అతడిపై అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత టీమ్ ఇండియా స్వరూపమే మారిందని వెల్లడించాడు.

Advertisement

Kamran akmal On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: ఒరేయ్ వెధ‌వ‌ల్లారా…ఒక్క మ్యాచ్ కే సంబ‌రప‌డిపోకండి, ఫైన‌ల్ లో టీమిండియా ప్ర‌తాపం చూపిస్తుంది

టాలెంట్ ఉన్న వాళ్లను జట్టులోకి తీసుకువచ్చి టీమిండియాను మంచి స్థాయికి తీసుకు వెళ్తున్నాడని ప్రశంసించాడు అంబ‌టి రాయుడు. ఒకప్పుడు ఉన్న సెలెక్టరు, కోచ్ లు దద్దమ్మ లాగా వ్యవహరించారని.. ఒక ప్లేయర్ ఒక్క ఫార్మాట్ మాత్రమే ఆడేలా సర్కిల్ గీశారని ఫైర్ అయ్యాడు. కానీ గౌతమ్ గంభీర్ అలా కాకుండా టాలెంట్ ఉంటే మూడు ఫార్మాట్లలో యువ క్రికెటర్లకు అవకాశం ఇస్తున్నాడని ప్రశంసల వర్షం కురిపించాడు. విదేశీ టూర్లకు కూడా కుర్రాళ్ల‌ను తీసుకువెళ్లి జట్టును డెవలప్ చేస్తున్నాడని వివరించాడు.

Advertisement

ఒక మంచి పని జరుగుతుంటే విమర్శలు రావడం చాలా కామన్ అని.. ఇప్పుడు గౌతమ్ గంభీర్ కు కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడ‌ని వెల్ల‌డించాడు. మన ఇండియాలో మంచి చేస్తే విమర్శించే వాళ్ళు తప్ప మెచ్చుకునేవాళ్ళు ఎవరు ఉండరని కౌంటర్ ఇచ్చాడు. అటు మొదట్లో బీసీసీఐ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జై షాను చాలా మంది ట్రోలింగ్ చేశారని.. కానీ అతడే ఇప్పుడు ఐసీసీ బాస్ గా ఎదిగాడని మెచ్చుకున్నాడు. జై షా వచ్చిన తర్వాత టీమిండియా ఐసీసీ ట్రోఫీలు ఎన్నో గెలిచిందని గుర్తు చేశాడు. క్రికెట్ ఆడరాని వాడికి అధ్యక్ష పదవి ఇస్తారని అతని కూడా ట్రోలింగ్ చేశారని.. కానీ వాటిని పట్టించుకోకుండా జై షా అద్భుతంగా ముందుకు దూసుకు వెళ్తున్నాడని వెల్లడించాడు.

Basit Ali Reaction On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: అంపైర్లు, బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు చేసినా పాకిస్తానే గెలిచింది.. త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

 

 

Related News

బాబ‌ర్ చిల్ల‌ర‌గాడు.. స్లోగా బ్యాటింగ్ చేస్తున్నావ‌ని అన్నందుకు వారం రోజులు మాట్లాడ‌లేదు

బ‌ల‌మైన టీమిండియానే ఓడించాం, ఫైన‌ల్ లో శ్రీలంక‌ను న‌లిపేస్తాం.. హ‌స‌న్ న‌వాజ్ వార్నింగ్

మిస్ట‌ర్ కూల్ కాదు.. న‌ర‌రూప రాక్ష‌సుడు, ధోనిపై కేదార్ జాద‌వ్ సంచ‌ల‌నం!

నాలుగో పెళ్లికి షోయ‌బ్ మాలిక్ ఏర్పాట్లు.. తాట తీస్తాన‌ని మూడో భార్య‌ వార్నింగ్?

ఆకాశ్ దీప్‌కు గాయం, మ‌ధ్య‌లోనే ప్రసిద్ ఎంట్రీ.. కంకషన్ సబ్‌స్టిట్యూట్ అంటే ఏంటి?

భారత దేశం చాలా గొప్పది.. పాక్ ప్లేయర్లకు అక్కడ ఫ్యాన్స్ ఉన్నారు

గంభీర్‌ను కన్నెత్తి చూడకుండా వెళ్లిపోయిన మహ్మద్ సిరాజ్.. వాడు ఈకతో సమానమంటూ!

Big Stories

Advertisement
×