Mahabubnagar news: తెలంగాణలో దారుణ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మహిళల పట్ల కిరాతకులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వాయి వరుసలు లేకుండా.. అరాచాలకు పాల్పడుతున్నారు. ఎక్కడో ఓ చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకీ ఘోరాలు, అరాచాకాలకు హద్దు లేకుండా పోతుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా. మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారు. రెండు రోజుల క్రితం సీఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్‌లో ఘటన మరువకముందే ఇవాళ మరో దారుణ ఘటన జరిగింది.
మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కాలేజీ గర్ల్స్ హాస్టల్‌లో వీడియో రికార్డుల కలకలం రేపుతోంది. గర్ల్స్ హాస్టల్ బాత్‌రూం వద్ద ఓ యువకుడు వీడియో రికార్డ్ చేసినట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిగే చర్యలు తీసుకోవాలని హాస్టల్ ముందు స్టూడెంట్స్ ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే నవీన్ అనే యువకుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. కాలేజీలో చదువుతున్న విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా జరగడం రెండోసారి, ఇంతకుముందు కూడా ఒకసారి ఇలా జరిగిందని చెబుతున్నారు. మొదటిసారి ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఇప్పుడైనా చర్యలు తీసుకోవాలని ఫైరవుతున్నారు. ఈ ఘటనపై తమకు న్యాయం జరగాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు.
అయితే.. విద్యార్థులు భారీగా తరలిరావడంతో.. మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కాలేజ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాలేజ్ గర్ల్స్ హాస్టల్ లో వీడియోలు ఎలా తీస్తారని.. నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరగుతున్నాయని.. వెంటనే ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ధర్నా చేశారు. స్టూడెంట్స్ అందరూ వెళ్లి కాలేజ్ ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇప్పటికే ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విద్యార్థినులు కాలేజ్ ముందు ఆందోళనకు దిగగా.. పోలీసులు వారిని శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్ కోరుతున్నారు. ఇలాంటి నీచపు పనులు చేసే కిరాతకులకు కఠిన శిక్ష వేయాలని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి మరోసారి ఇలాంటి అరాచాకాలు జరగకుండా విద్యార్థినిలకు భరోసా కల్పించాలని కోరుతున్నారు.