BigTV English

Whatsapp : వాట్సాప్ షాకింగ్ డెషిషన్.. లక్షల్లో అకౌంట్స్ బ్యాన్

Whatsapp : వాట్సాప్ షాకింగ్ డెషిషన్.. లక్షల్లో అకౌంట్స్ బ్యాన్

whatsapp  : యూజర్ల అవసరానికి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లతో ముందుకు వస్తుంటుంది మెటాకు చెందిన మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్. సరికొత్త ఫీచర్లను వారికి పరిచయం చేస్తుంటుంది. వ్యక్తిగత మెసేజ్​లతో పాటు గ్రూప్ చాటింగ్, కాలింగ్, వీడియో కాలింగ్, స్టేటస్, కమ్యూనిటీస్ ఇలా అనేక రకాల ఫీచర్లు ఇందులో ఉంటాయి అందుకే ప్రపంచవ్యాప్తంగా, అలాగే మన దేశంలో కూడా కోట్లాది మంది ఈ వాట్సాప్​ యాప్​ను​ వినియోగిస్తుంటారు.


అలానే వాట్సాప్​ యూజర్ల వ్యక్తిగత భద్రతకు కూడా అధిక ప్రాధాన్యాన్ని ఇస్తుంది. ఎండ్ – టు – ఎండ్ ఎన్‌ క్రిప్షన్, స్కామ్ నివారణతో పాటు వీడియో కాల్‌ల కోసం బ్యాక్‌ గ్రౌండ్ ఫిల్టర్‌లు, స్టేటస్ లైక్‌లు వంటి ఫీచర్ల తో పాటు సురక్షితమైన, సులభమైన మెసేజింగ్ అనుభవాన్ని అందిస్తుంటుంది.

ALSO READ : అతి తక్కువ ధరకే జియో భారత్ మొబైల్స్.. ఫీచర్స్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!


వారికి బిగ్ షాక్ – అయితే తాజాగా భారత యూజర్లకు వాట్సాప్​ బిగ్ షాక్​ ఇచ్చింది. ఎందుకంటే ఈ వాట్సాప్​ యాప్​ను అడ్డాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు మోసాలకు తెగ పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సైబర్ మోసాలు బాగా పెరిగిపోయాయి. అందుకే వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే భారీ సంఖ్యలో ఖాతాలపై వాట్సప్‌ నిషేధం విధించింది వాట్సాప్​. ఒక్క ఆగస్టులోనే దాదాపు 80 లక్షల అకౌంట్​లను బ్యాన్‌ చేసింది వాట్సాప్​. తమ ప్రైవసీ పాలసీని ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వాట్సప్‌ ప్రకటించింది.

84.58 లక్షల అకౌంట్​లపై బ్యాన్​ – ఐటీ యాక్ట్‌, 2021 నిబంధనల ఆధారంగా ఆగస్ట్​ నెలలో ఖాతాలపై నిషేధం విధించింది వాట్సాప్​. ఆ నెలలో భారీ సంఖ్యలో దాదాపుగా మొత్తం 84.58 లక్షల అకౌంట్​లపై నిషేధం విధించినట్లు వాట్సప్‌ తెలిపింది. ఈ ఖాతాలన్నింటీపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.

వాటిని ముందుగానే గుర్తించి – ఈ బ్యాన్ చేసిన అకౌంట్లలో దాదాపు 16.61 లక్షల ఖాతాలను ముందు జాగ్రత్త చర్యగా నిషేధం విధించామని తెలిపింది వాట్సాప్​. సైబర్​ నేరాలు, మోసాలకు పాల్పడే ఆస్కారం ఉండే బల్క్‌ సందేశాలు లేదా అసాధారణ మెసేజ్‌లను తన ఆటోమేటెడ్‌ సిస్టమ్‌ ద్వారా ముందుగానే గుర్తించి వాట్సాప్​ ఈ చర్యలు తీసుకుంది. అలాగే, ఆగస్ట్ నెలలో గ్రీవెన్స్‌ మెకానిజం ద్వారా యూజర్ల నుంచి 10,707 కంప్లైంట్​లు వచ్చినట్లు వాట్సప్‌ పేర్కొంది.

అలాంటి సందర్భాల్లో నిషేధం – వాట్సప్‌ నిబంధనలు అంటే టర్మ్స్‌ అండ్‌ కండీషన్లను ఉల్లంఘించినందుకు వాట్సప్‌ ఈ చర్యలను ఎప్పుడూ తీసుకుంటుంది. మోసం లేదా తప్పుడు సమాచారం చేరవేసే బల్క్‌, స్పామ్‌ మెసేజ్​లను పంపిచడం వాట్సాప్ నిబంధనలకు విరుద్ధం.

స్థానిక చట్టాలకు వ్యతిరేకంగా అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన కూడా వాట్సప్‌ బ్యాన్ చర్యలు కచ్చితంగా తీసుకుంటుంది.
అనుచిత ప్రవర్తన, వేధింపులు వంటి కంప్లైంట్లు కూడా యూజర్ల నుంచి వచ్చినప్పుడు, అలా చేసిన ఖాతాలను వాట్సప్‌ నిషేధం విధిస్తుంది.

ఇక వాట్సాప్ లో ఎవరైనా ఇబ్బంది పెడుతూ మెసేజ్లు చేసినప్పుడు ఆ ఎకౌంటుపై మెటాకు కంప్లైంట్ చేయాలంటే రిపోర్టు ఆప్షన్ ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ ఆప్షన్ ని క్లిక్ చేస్తే మెటా తగిన చర్యలు తీసుకుంటుంది. ఇలా వచ్చిన కంప్లైంట్స్ లో సైతం కొన్ని అకౌంట్స్ను నిషేధించినట్టు తెలుస్తోంది.

Related News

Chat GPT: సజేషన్ కోసం చాట్ జీపీటీని అడిగాడు.. చివరకు సీన్ కట్ చేస్తే..?

2025 Best Budget Phones: iQOO Z10x, Poco M7, Moto G85.. 2025లో ₹15,000 లోపు బెస్ట్ 5G ఫోన్స్ ఇవే..

GPT-5 Backlash: జిపిటి-5 వద్దు రా బాబు.. చాట్ జిపిటి కొత్త వెర్షన్‌పై యూజర్ల అసంతృప్తి

Vivo Y400 vs iQOO Z10R vs OnePlus Nord CE 5: రూ.25,000 లోపు బడ్జెట్ లో ఏది బెస్ట్?

iPhone 17 Pro GPT-5: ఐఫోన్ 17 ప్రోలో చాట్ జిపిటి-5.. ఆపిల్ సంచలన ప్రకటన

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Big Stories

×