E-Paper
Advertisement

అల్లా మీద ఒట్టు..నా కెప్టెన్సీలో పాకిస్తాన్ కు 3 వ‌ర‌ల్డ్ క‌ప్ లు తీసుకొస్తా

అల్లా మీద ఒట్టు..నా కెప్టెన్సీలో పాకిస్తాన్ కు 3 వ‌ర‌ల్డ్ క‌ప్ లు తీసుకొస్తా
Advertisement

Sahibzada Farhan:  ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ (2026 Asian Games tournament) నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్ క్రికెట్ జట్టును ప్రకటించింది PCB. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. ఈ తరుణంలో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) కు కెప్టెన్సీ అప్పగించింది. ఇక సెప్టెంబర్ 19వ తేదీ నుంచి అక్టోబర్ మూడో తేదీ వరకు జపాన్ లోని ఐచి నాగోయాలో టి20 ఫార్మాట్ లో ఏషియన్ గేమ్స్ జరగనున్నాయి. అయితే తనకు కెప్టెన్సీ వచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్ కొత్త కెప్టెన్ సాహిబ్‌జాదా ఫర్హాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కెప్టెన్సీలో పాకిస్తాన్ జట్టుకు రెండు నుంచి మూడు వరల్డ్ కప్ లు తీసుకువస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో సాహిబ్‌జాదా ఫర్హాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

అల్లా మీద ఒట్టు..నా కెప్టెన్సీలో పాకిస్తాన్ కు 3 వ‌ర‌ల్డ్ క‌ప్ లు తీసుకొస్తా

Advertisement

ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ (2026 Asian Games tournament) నేపథ్యంలో తనకు కెప్టెన్సీ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ (Sahibzada Farhan). పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తనును నమ్మి, కెప్టెన్సీ బాధ్యతలను ఇచ్చిందని వెల్లడించారు. ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నమ్మకాన్ని తాను కాపాడుకుంటానని… తన సత్తా చాటుతానని ప్రకటించారు. అందరిలాగా కాకుండా… పాకిస్తాన్ జట్టుకు వరుసగా విజయాలను అందిస్తూ కెప్టెన్ గా శాశ్వతంగా ఉంటానని వెల్లడించారు సాహిబ్‌జాదా ఫర్హాన్. ఆ అల్లా మీద ఒట్టేసి చెబుతున్నా… పాకిస్తాన్ కు మరో ఐదు నుంచి ఆరు సంవత్సరాలలో, కనీసం మూడు వరల్డ్ కప్ ట్రోఫీలను అందిస్తానని శపథం చేశారు.

ఇకపై ఇండియాతో జరిగా ఏ మ్యాచ్ అయినా.. పాకిస్తాన్ గెలిచేలా చర్యలు తీసుకుంటానని వ్యాఖ్యానించారు. ప్రతి మ్యాచ్ లోనూ టీమిండియాను ఓడించి తీరుతానని శపథం చేశారు సాహిబ్‌జాదా ఫర్హాన్ (Sahibzada Farhan). ఇన్ని రోజులు టీమిండియా తమపై గెలిచి.. ఓవరాక్షన్ చేసిందని ఆగ్రహించారు. ఇకపైన పరిస్థితి అలా ఉండబోదని వ్యాఖ్యానించారు. ప్రతి మ్యాచ్ లోను టీమిండియాను ఓడించడం జరుగుతుందన్నారు. త్వరలో జరగబోతున్న ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో మొదట టీమిండి అని ఓడించి తన ప్రతాపం ఏంటో చూపిస్తానని కూడా వ్యాఖ్యానించారు. దీంతో ఫర్హాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే సాహిబ్‌జాదా ఫర్హాన్ చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఏషియన్ గేమ్స్ లో ఇండియాను ఓడించి చూపించాలని చాలెంజ్ విసురుతున్నారు. చేత‌కానీ దద్ద‌మ్మ‌లు ఇలాంటి స్టేట్ మెంట్స్ చేస్తూనే ఉంటార‌ని సెటైర్లు పేల్చారు. ఇండియాలో చేతిలో ఎప్పుడు, ఎక్క‌డ మ్యాచ్ జ‌రిగినా పాక్ ఓడిపోతుందంటున్నారు.

Advertisement

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను  పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

 

 

 

Related News

ఆ రోజున డ్రెస్సింగ్ రూంలో ధోని వెక్కి వెక్కి ఏడ్చాడు..చాహ‌ల్ సంచ‌ల‌నం

బుమ్రా స్ప్రింగ్ చికెన్ లాంటోడు…అత‌నికి ప్రసిద్ కృష్ణ స‌రైన జోడి

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ భారీ కుట్ర‌..4 జ‌ట్లుగా విడిపోయి మ‌రీ

నా చేయే వంక‌ర‌..అది తెలియ‌క‌ త్రో బౌలింగ్ అంటున్నారు, పాక్ బౌల‌ర్ క‌న్నీళ్లు

ఆ డ్రింక్ తాగి ఉమ్మేసిన వైభ‌వ్ సూర్య‌వంశీ..కోహ్లీ ఫ్యాన్స్ సీరియ‌స్‌

PCBకు బాబ‌ర్ ఆజం కండీష‌న్…నేను కూర్చోమంటే కూర్చోవాలి, నిల‌బ‌డాలంటే నిల‌బ‌డాలి

పీక‌ల్లోతు ప్ర‌మాదంలో కావ్య పాప‌…పెద్ద మ‌న‌సు చాటుకున్న‌ న‌ఖ్వీ

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్…డ్రెస్సింగ్ రూంలో ఖురాన్ చ‌దువుతూ !

Big Stories

Advertisement
×