BigTV English

Vd12: అంత సిద్ధమైంది కానీ మొత్తం అనిరుధ్ చేతిలో ఉంది

Vd12: అంత సిద్ధమైంది కానీ మొత్తం అనిరుధ్ చేతిలో ఉంది

Vd12: ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన కెరీర్ లో 12వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి జెర్సీ సినిమా డైరెక్టర్ గౌతమ్  దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా ఈ సినిమా నుంచి విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. లేకపోతే విజయ్ (Vijay devarakonda) ని చాలామంది దర్శకులు చాలా రకాలుగా చూపించారు కానీ ఇప్పుడు గౌతమ్ చూపించిన విధానానికి మాత్రం అందరూ స్టన్ అయిపోయారు అని చెప్పొచ్చు. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఈ సినిమా ఫస్ట్ లుక్ పైన రియాక్ట్ అయ్యాడు. విజయ్  ను ఇలా చూడటం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.


Also Read: Virinchi Varma: నాని చెప్పడం వలన రాజమౌళితో యాక్టింగ్ చేయించాను.

 


ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజయ్ రెండు పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఒకటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలోనూ, రెండు ఖైదీ పాత్రలో కూడా కనిపించనున్నాడు. ఇక  రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే, ఖైదీ డ్రెస్ లోను మనం విజయ్ ను గమనించవచ్చు. ఇకపోతే ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడు ఫస్ట్ పోలీస్ గెటప్ లో విజయ్ ను చూపించారు. ఏదేమైనా టు గెటప్స్ లో విజయ్ ని చూపించడం అంటే మామూలు విషయం కాదు. దీనిని బట్టి ఖచ్చితంగా  గౌతమ్ ఒక బ్లాక్ బస్టర్ రెడీ చేయబోతున్నాడని అర్థమవుతుంది.

Also Read: Happy Birthday Trivikram Srinivas : ఆకెళ్ళ నాగ శ్రీనివాస్ శర్మ త్రివిక్రమ్ ఎలా అయ్యారంటే.?

రీసెంట్ టైమ్స్ లో విజయ్ హిట్ సినిమా చూసి చాలా రోజులైంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన లైగర్ (Liger) సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో చేసిన ఖుషి (Kushi) , పరశురాం దర్శకత్వంలో చేసిన ఫ్యామిలీ స్టార్ (family star) ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గానే మిగిలిపోయాయి. వరుస డిజాస్టర్లు చూస్తున్న విజయ్ పర్ఫెక్ట్ గా తన కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. వరుసుగా యంగ్ డైరెక్టర్స్ తో చేతులు కలుపుతూ అద్భుతమైన ప్రోజెక్ట్స్ ను తన లైనప్ లో పెట్టాడు. తర్వాత రాబోయే సినిమాలన్నిటి పైన కూడా మంచి అంచనాలు మొదలయ్యాయి. ఇక VD12 సంబంధించి షూటింగ్ కూడా ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఈ సినిమాకి సంబంధించి అనిరుద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బట్టి సినిమా విడుదల డిపెండ్ అయి ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు కానీ ఆ డేట్ కి సినిమా వస్తుందా లేదా అనేది ఇంకా గ్యారెంటీ లేదు. ఎందుకంటే అదే రోజున పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా కూడా రిలీజ్ కి సిద్ధం అవుతుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×