BigTV English

Microsoft AI Tool : నోట్ ప్యాడ్‌లో కొత్త AI ఆప్షన్.. ఎలాంటి టెక్ట్స్ ఇచ్చినా రీరైట్ చేసేస్తాదట, ఎలా పనిచేస్తుందంటే?

Microsoft AI Tool : నోట్ ప్యాడ్‌లో కొత్త AI ఆప్షన్.. ఎలాంటి టెక్ట్స్ ఇచ్చినా రీరైట్ చేసేస్తాదట, ఎలా పనిచేస్తుందంటే?

Microsoft AI Tool : ప్రపంచ టెక్ రంగం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) వెనుక పరుగులు తీస్తోంది. అన్ని విభాగాల్లో ఏఐ సాంకేతికతను అందుబాటులోకి తీసుకువస్తూ.. యూజర్లకు మెరుగైన సర్వీసులు అందించేందుకు టెక్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే.. మైక్రోసాఫ్ట్ నోట్ ప్యాడ్.. సరికొత్త ఏఐ ఫీచర్ ను సంతరించుకోనుంది. టెక్స్ట్ ఎడిటింగ్ లో ఏళ్లుగా సేవలందిస్తున్న ఈ నోట్ ప్యాడ్.. సరికొత్త సౌకర్యాన్ని యూజర్లకు అందించనుంది. అదేమిటంటే.?


ఇప్పటి వరకు యూజర్లు తమకు నచ్చిన విషయాన్ని నోట్ ప్యాడ్ లో రాసుకోవచ్చు. దానిలో మార్పు చేర్పులు కావాలంటే.. స్వతహాగా చేసుకోవచ్చు. కానీ.. ఇప్పటి నుంచి మీరు రాసిన టెక్స్ట్ ను జెనిరేటివ్ ఏఐ ని వినియోగించి.. మీరు నచ్చిన రీతిలో తిరిగి మార్చుకోవచ్చు. అయితే.. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ను విండోస్ 11 ఇన్‌సైడర్ బిల్డ్‌లకు పరిమితం చేశారు.

ఈ విషయాన్ని ఓ బ్లాగ్ లో పోస్ట్ చేసిన మైక్రోసాఫ్ట్… Windows నోట్‌ప్యాడ్‌లోని కొత్త రీరైట్ ఫీచర్ ని GPT గా పిలవనున్నట్లు తెలిపింది. దీని ద్వారా.. యూజర్ అందించిన టెక్స్ట్‌ను.. ఇష్టానుసారం మార్చుకోవచ్చని వెల్లడించింది. యూజర్ ఇష్టాలను బట్టి.. టెక్ట్స్ టోన్ ను మార్చుకోవచ్చని, కావాలనుకుంటే.. కంటెంట్ లోని పదాల సంఖ్యను తగ్గించుకోవడం, పెంచుకోవడం కూడా ఏఐ ద్వారా సులువుగా చేసుకోవచ్చని తెలిపింది.


నోట్‌ప్యాడ్‌లో రీరైట్ ఆప్షన్ ని ఎలా ఉపయోగించాలి.?
మీరు సరికొత్త Windows 11 Canary లేదా Dev బిల్డ్‌లని వినియోగిస్తుంటే.. కొత్తగా జోడించిన ఫీచర్‌ను ప్రయత్నించాలనుకుంటే ఇలా చేయండి. మీ సిస్టమ్ లోని నోట్‌ప్యాడ్‌ను ఓపెన్ చేసి.. మీరు మార్చాలనుకుంటున్న టెక్ట్స్ ను హైలైట్ చేసి.. రైట్ క్లిక్ చేయాలి. అక్కడ ‘రీరైట్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ.. మీకు కావాల్సిన ఆప్షన్లను ఇస్తే.. అందుకు తగ్గట్టుగా టెక్ట్స్ మారిపోతుంది. లేదంటే.. కీబోర్డులో Ctrl+I షార్ట్ కట్ ద్వారా ఈ ఫీచర్ ని పొందొచ్చు. తర్వాత.. రీప్లేస్ ఆప్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అక్కడ.. లాంగర్, టోన్, ఫార్మాట్ అనే కొన్ని పారామీటర్లు కనిపిస్తాయి. వాటిని మీకు తగిన విధంగా మార్పు, చేర్పులు చేసుకుంటే.. ఎంచుకున్న టెక్స్ట్ కు సంబంధించిన ఏఐ (AI) రీరైట్ టెక్ట్స్.. కొత్త డైలాగ్ వోక్స్ లో ఓపెన్ అవుతుంది. అయితే.. కొత్త ఫీచర్‌ను యాక్సెస్ చేసేందుకు యూజర్లు తప్పనిసరిగా తమ ఖాతా నుంచి సైన్ఇన్ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది.

Also Read : క్లిక్ కొట్టు.. ఫేక్ ఫోటో పట్టు.. అలరించబోతున్న వాట్సాప్ కొత్త ఫీచర్

GPTతో కంటెంట్‌ను పొందాలనుకునే వినియోగదారులకు AI క్రెడిట్‌లు అవసరమని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తెలిపింది. యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఇటలీ, జర్మనీలోని యూజర్లకు మైక్రోసాఫ్ట్ ఏఐ నోట్ ప్యాట్ ప్రారంభించేందుకు 50 ఏఐ (AI) క్రెడిట్‌లను అందిస్తోంది. ఇది మైక్రోసాఫ్ట్ 365 పర్సనల్, ఫ్యామిలీతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా, సింగపూర్, తైవాన్, థాయిలాండ్‌లోని కో పైలట్ ప్రో సబ్‌స్క్రైబర్‌లకు కూడా అందుబాటులో ఉందని సంస్థ వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ 365 వ్యక్తిగత ఖాతా, కుటుంబ సభ్యులు నెలకు 60 AI క్రెడిట్లు లభించనున్నాయి. కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో 41 ఏళ్ల ప్లాన్ టెక్స్ట్ ఎడిటర్‌కు స్పెల్ చెక్, ఆటోకరెక్ట్‌ ఆఫ్షన్లను మైక్రోసాఫ్ట్ జోడించింది.

Related News

iPhone history: ప్రపంచాన్ని మార్చిన ఐపోన్ ఎవరు కనిపెట్టారు? ఎప్పుడు మొదలైంది?

Macbook Air ipad Air : ఆపిల్ సూపర్ డీల్స్.. తగ్గిన ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్ ధరలు

Vivo new phones 2025: ఈ నెలలో వివో లాంచ్ చేసిన 4 కొత్త ఫోన్లు.. ధరలు తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు

OnePlus Nord CE5: వన్‌ప్లస్ నార్డ్ సిఈ5.. ఈ ఫోన్‌కి పోటీదారులే లేరు!

Samsung Galaxy: స్మార్ట్‌ఫోన్ పై మైండ్‌బ్లోయింగ్ ఆఫర్! 22 వేల ఫోన్ ఇప్పుడు 13 వేలకే దొరుకుతుంది!

Amazon Festival Laptops: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లైవ్.. ప్రైమ్ మెంబర్స్‌కు ల్యాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్

Xiaomi Rival iPhone 17: ఐఫోన్ 17కు సవాల్.. రాబోతోంది షావోమీ సూపర్ ఫోన్

Budget iPhone: దసరా పండగ ఆఫర్‌లో టాప్ 5 బడ్జెట్ ఫోన్లు.. రూ.10 వేల లోపే!

Big Stories

×