E-Paper
Advertisement

మెుబైల్ డేటా vs వై-ఫై.. బ్యాటరీ దొంగ దొరికాడు.. ఫ్యూజులు ఎగరడం పక్కా!

మెుబైల్ డేటా vs వై-ఫై.. బ్యాటరీ దొంగ దొరికాడు.. ఫ్యూజులు ఎగరడం పక్కా!
Advertisement

Wi-Fi vs Mobile Data: స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరినీ వేధించే అతిపెద్ద సమస్య ‘బ్యాటరీ డ్రైనింగ్’. అయితే ఛార్జింగ్ త్వరగా అయిపోవడానికి యాప్స్ తో పాటు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఓ కారణమని నిపుణులు అంటున్నారు. మరి వై-ఫై, మెుబైల్ డేటాలో ఏది వాడితే ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది? అన్న సందేహం సహజంగానే ఉత్పన్నమవుతుంది. దీని వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం.

వై-ఫై vs మెుబైల్ డేటా

వై-ఫైతో పోలిస్తే మొబైల్ డేటానే ఫోన్ బ్యాటరీని చాలా వేగంగా ఖాళీ చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఫోన్ లో 4G లేదా 5G నెట్‌వర్క్ వాడుతున్నప్పుడు ఫోన్ బ్యాటరీ శాతాన్ని గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందని పేర్కొంటున్నారు. మరోవైపు వై ఫై ఆన్ చేసినప్పుడు బ్యాటరీ చాలా నిదానంగా తగ్గుతుందని స్పష్టం చేస్తున్నారు.

మొబైల్ డేటా వల్లే ఎందుకు?

Advertisement

మెుబైల్ డేటా వల్ల ఎక్కువ బ్యాటరీ ఖర్చు కావడానికి సిగ్నల్ ప్రధాన కారణమని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇంట్లోని వై-ఫై రూటర్ కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే ఉంటుంది. కాబట్టి ఫోన్ సిగ్నల్‌ను అందుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. కానీ మొబైల్ డేటా విషయానికి వస్తే.. మీ ఫోన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న సెల్ టవర్‌తో కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సిగ్నల్స్ తక్కువగా ఉన్నప్పుడు బలమైన సిగ్నల్స్ కోసం ఫోన్ వెతికే క్రమంలో ఎక్కువగా బ్యాటరీ అయిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు 4G తో పోలిస్తే ప్రస్తుత 5G అధికంగా బ్యాటరీని ఖర్చు చేస్తున్నట్లు వివరిస్తున్నారు.

Also Read: నిప్పులకుంపటిలా ఆకాశం.. ఫ్రాన్స్‌ను చుట్టేసిన ‘ఓమేగా బ్లాక్’.. 40 మంది మృతి

బ్యాటరీ ఆదా చిట్కాలు

Advertisement

కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఫోన్ బ్యాటరీ లైఫ్ ను పెంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఇల్లు లేదా ఆఫీసు లాంటి ప్రదేశాల్లో ఉన్నప్పుడు మొబైల్ డేటాను ఆపేసి వై-ఫై కనెక్షన్‌ను మాత్రమే వాడాలని సూచిస్తున్నారు. అలాగే మీ ఏరియాలో మొబైల్ సిగ్నల్ చాలా వీక్‌గా ఉంటే డేటాను ఆఫ్ చేయడం మంచిదని అంటున్నారు. లేదంటే సిగ్నల్స్ కోసం ఫోన్ డబుల్ పవర్ ను వినియోగిస్తుందని ఫలితంగా ఛార్జింగ్ త్వరగా ఖాళీ అవుతుందని తెలియజేస్తున్నారు. మరోవైపు ఇంటర్నెట్ అవసరం లేనప్పుడు వై-ఫై, మొబైల్ డేటా రెండింటినీ ఆఫ్ చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ పెరుగుతుందని స్పష్టం చేస్తున్నారు.

Also Read: ఇయర్‌‌బడ్స్ vs ఇయర్‌‌ఫోన్స్ vs హెడ్‌ఫోన్స్.. ఈ మూడింట్లో ఏది బెస్ట్?

Related News

బాస్కెట్‌బాల్ లవర్స్‌ కోసం Pixel Watch 5.. కొత్త ఎడిషన్ గ్యాడ్జెట్ లవర్స్‌ను ఆకట్టుకుంటుందా?

పిల్లల ఆన్‌లైన్ క్లాసులకు బెస్ట్..రూ.18 వేలలోపు అదిరిపోయే లెనోవా స్మార్ట్ ట్యాబ్!

రూ.1,100లోపే అదిరిపోయే స్మార్ట్‌వాచ్ డీల్..వెంటనే కొనేయండి

ఇండియాలో.. పోవా ఏఐ బడ్స్ ప్రో లాంచ్ డేట్ ఫిక్స్! ఫీచర్స్ మాములుగా లేవుగా..

మధ్యతరగతి కుటుంబాలకు పర్ఫెక్ట్ టీవీ.. ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు!

జియో బిగ్ ఆఫర్.. కొత్తగా రూ.550, రూ.2000 ప్లాన్లు.. ఫ్రీగా 15 ఓటీటీలు, 1000+ ఛానెళ్లు!

జస్ట్ రూ.2,000కే 4G ఫోన్లా? UPI, టైప్-సి ఛార్జింగ్‌తో లభించే టాప్ 5 ఆప్షన్లు ఇవే!

వర్షాకాలంలో ఫ్రిజ్ టెంపరేచర్ ఎంత ఉండాలి ? కరెంట్ ఆదా చేసే టిప్స్!

Big Stories

Advertisement
×