E-Paper
Advertisement

ఇండియాలో.. పోవా ఏఐ బడ్స్ ప్రో లాంచ్ డేట్ ఫిక్స్! ఫీచర్స్ మాములుగా లేవుగా..

ఇండియాలో.. పోవా ఏఐ బడ్స్ ప్రో లాంచ్ డేట్ ఫిక్స్! ఫీచర్స్ మాములుగా లేవుగా..
Advertisement

Pova AI Buds Pro Launch: స్మార్ట్ గ్యాజెట్ల మార్కెట్లో వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌కు డిమాండ్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. యూజర్ల అవసరాలకు తగ్గట్టుగా కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో కూడిన ప్రోడక్ట్స్ మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. అయితే.. తాజాగా ప్రముఖ బ్రాండ్ నుంచి వస్తున్న Pova AI Buds Pro ఇయర్ బడ్స్ టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా భారత్‌లో వీటి లాంచ్ డేట్ అధికారికంగా అనౌన్స్ కావడంతో గ్యాజెట్ లవర్స్ లో అంచనాలు తారా స్థాయికి చేరాయి. మరి ఈ కొత్త బడ్స్ ఏయే అద్భుతమైన ఫీచర్లతో రాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం.

Pova AI Buds Pro ఇయర్ బడ్స్ ఫీచర్లు:

1.లాంచ్ డేట్ :

పోవా సంస్థ అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ మోడల్ త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజమైన అమెజాన్ వేదికగా ఈ ఇయర్ బడ్స్ ఎక్స్‌క్లూజివ్‌గా సేల్‌కు అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. లాంచ్ అయిన వెంటనే.. అమెజాన్‌లో స్పెషల్ డిస్కౌంట్లు లేదా కూపన్ ఆఫర్లు ఉండే అవకాశం ఉంది.

2. డిజైన్ ,లుక్ :

Advertisement

ఈ ఇయర్ బడ్స్ డిజైన్ విషయానికి వస్తే.. ఇది పూర్తిగా ప్రీమియం ,ఫ్యూచరిస్టిక్ లుక్‌తో వస్తోంది. చెవిలో సౌకర్యవంతంగా ఇమిడిపోయేలా ఎర్గోనామిక్ డిజైన్‌ను అందించారు. అంతే కాకుండా దీని స్టైలిష్ కేస్, లైట్‌వెయిట్ బిల్డ్ క్వాలిటీ కారణంగా ప్రయాణాల్లో వీటిని ఉపయోగించడం చాలా ఈజీ. మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకునేలా దీని కలర్ ఆప్షన్లు కూడా ట్రెండీగా డిజైన్ చేశారు.

3. ఏఐ ఫీచర్లు & సౌండ్ క్వాలిటీ:

ఈ బడ్స్ యొక్క ప్రధాన ఆకర్షణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్. కాల్స్ మాట్లాడుతున్నప్పుడు చుట్టు పక్కల ఉండే అనవసరమైన శబ్దాలను ఏఐ టెక్నాలజీ ద్వారా.. పూర్తిగా కట్ చేసి, క్రిస్టల్ క్లియర్ వాయిస్‌ని అందిస్తుంది. అలాగే డీప్ బేస్ , పవర్‌ఫుల్ డ్రైవర్ల కారణంగా పాటలు వినేటప్పుడు థియేటర్ లాంటి ఆడియో ఫీల్ ఇస్తుంది. గేమింగ్ ఆడేవారి కోసం ప్రత్యేకంగా లో-లేటెన్సీ మోడ్ కూడా ఇందులో ఉండనుంది.

Advertisement

Also Read: మధ్యతరగతి కుటుంబాలకు పర్ఫెక్ట్ టీవీ.. ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు!

4. బ్యాటరీ బ్యాకప్, ఛార్జింగ్:

ప్రస్తుత జనరేషన్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని పవర్‌ ఫుల్ బ్యాటరీ లైఫ్‌ను అందించారు. సింగిల్ చార్జ్‌తో.. ఇవి ఎక్కువ కాలం పాటు నాన్‌ స్టాప్ మ్యూజిక్‌ను అందిస్తాయి. అంతేకాకుండా.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల కేవలం కొన్ని నిమిషాలు ఛార్జ్ చేస్తే గంటల తరబడి వాడొచ్చు.

5. ధర :

ఫీచర్ల పరంగా ప్రీమియంగా ఉన్నప్పటికీ.. సాధారణ మిడిల్ క్లాస్ ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా వీటి ధరను నిర్ణయించినట్లు తెలుస్తోంది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఈ ఇయర్ బడ్స్ ధర సుమారు రూ. 2,499 నుంచి రూ. 3,499 మధ్య ఉండే అవకాశం ఉంది. లాంచ్ రోజున అమెజాన్‌లో ప్రత్యేక ఆఫర్లతో మరింత తక్కువ ధరకు కూడా కొనే అవకాశం ఉంటుంది.

తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే.. ఏఐ ఫీచర్లు , ప్రీమియం సౌండ్ కోరుకునే.. వారికి ఈ కొత్త బడ్స్ మంచి ఆప్షన్ కానుంది. అమెజాన్‌లో త్వరలోనే లాంచ్ కానున్న ఈ గ్యాజెట్‌ కోసం టెక్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ గార్జెట్  కొనాలనుకునే వారు లాంచ్ ఈవెంట్ , ఆఫర్ల కోసం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే!

Related News

రూ.1,100లోపే అదిరిపోయే స్మార్ట్‌వాచ్ డీల్..వెంటనే కొనేయండి

మధ్యతరగతి కుటుంబాలకు పర్ఫెక్ట్ టీవీ.. ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు!

జియో బిగ్ ఆఫర్.. కొత్తగా రూ.550, రూ.2000 ప్లాన్లు.. ఫ్రీగా 15 ఓటీటీలు, 1000+ ఛానెళ్లు!

జస్ట్ రూ.2,000కే 4G ఫోన్లా? UPI, టైప్-సి ఛార్జింగ్‌తో లభించే టాప్ 5 ఆప్షన్లు ఇవే!

వర్షాకాలంలో ఫ్రిజ్ టెంపరేచర్ ఎంత ఉండాలి ? కరెంట్ ఆదా చేసే టిప్స్!

ఇయర్‌బడ్స్ వాడుతున్నారా? అయితే ఈ 5 సీక్రెట్ ట్రిక్స్ మీకు కచ్చితంగా తెలిసి ఉండాలి!

ఫ్రిడ్జ్ షెల్ఫ్‌లపై ఫాయిల్ పేపర్ వేసి చూడండి.. దుర్వాసన, జిడ్డు మరకల బాధే ఉండదు!

Big Stories

Advertisement
×