E-Paper
Advertisement

జియో బిగ్ ఆఫర్.. కొత్తగా రూ.550, రూ.2000 ప్లాన్లు.. ఫ్రీగా 15 ఓటీటీలు, 1000+ ఛానెళ్లు!

జియో బిగ్ ఆఫర్.. కొత్తగా రూ.550, రూ.2000 ప్లాన్లు.. ఫ్రీగా 15 ఓటీటీలు, 1000+ ఛానెళ్లు!
Advertisement

Jio OTT Pass Plans: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తమ వినియోగదారుల కోసం ‘ఓటీటీ పాస్’ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. ఇప్పటివరకు కేవలం నెలవారీ ప్లాన్ (రూ.200) మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు దానికి కొనసాగింపుగా 3 నెలలు, 1 సంవత్సరం వ్యాలిడిటీతో కొత్త ప్లాన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. లాంగ్ టర్మ్ సబ్‌స్క్రైబర్లను దృష్టిలో ఉంచుకుని రూ. 550, రూ.2000 ప్లాన్లు తీసుకొచ్చినట్లు జియో వర్గాలు వెల్లడించాయి. ఆ ప్లాన్లకు సంబంధించి పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం.

కొత్త రూ. 550 ఓటీటీ పాస్

ఈ ఓటీటీ పాస్ ను 84 రోజుల వ్యాలిడిటీతో జియో కొత్తగా తీసుకొచ్చింది. ఇందులో 90 GB హై-స్పీడ్ డేటాతో పాటు అర్హులైన యూజర్లకు ఆన్‌లిమిటెడ్ 5జీ సదుపాయం కూడా లభించనుంది. 3 నెలలు లేదా 1 సంవత్సరం బేస్ ప్లాన్ ఉన్న యూజర్లకు ఇది అందుబాటులో .
ఉండనుంది.

రూ. 2000 ఓటీటీ పాస్

Advertisement

365 రోజుల వ్యాలిడిటీని ఇచ్చే ఈ ప్లాన్‌లో మొత్తం 365GB హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ 5జీ లభిస్తాయి. ఏడాది బేస్ ప్లాన్ కలిగిన వినియోగదారులకు మాత్రమే ఇది ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది.

రూ. 200 ఓటీటీ పాస్

గతంలోనే తీసుకొచ్చిన ఈ బేసిక్ ఓటీటీ పాస్ 28 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. ఇందులో మొత్తం 30జీబీ హై-స్పీడ్ డేటాతో పాటు ఆన్‌లిమిటెడ్ 5జీ డేటా లభిస్తుంది. వాయిస్ ఓన్లీ ప్యాక్‌లు తప్ప మిగతా ఆక్టివ్ బేస్ ప్లాన్ ఉన్న జియో యూజర్లందరికీ ఈ ప్లాన్ అందుబాటులో ఉండనుంది.

15 ఓటీటీలు, 1000+ ఛానెళ్లు..

Advertisement

పైన పేర్కొన్న ప్రతీ ఓటీటీ పాస్ లో నెలకు రూ.1500 పైగా విలువైన ఎంటర్ టైన్ మెంట్ బెనిఫిట్స్ యూజర్లకు లభించనున్నాయి. యూట్యూబ్ ప్రీమియం వెర్షన్ తో పాటు అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, సోనీ లివ్, జీ5, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ నెక్స్ట్, ఫ్యాన్ కోడ్ తదితర 15 రకాల ఓటీటీలను ఈ ప్లాన్ కింద ఫ్రీగా వీక్షించవచ్చు. అలాగే 1000కి పైగా లైవ్ ఛానెళ్లను ఈ ప్లాన్ లో జియో ఆఫర్ చేస్తోంది. స్టార్ ప్లస్ హెచ్‌డీ, కలర్స్ హెచ్‌డీ, సెట్ హెచ్‌డీ, సన్ టీవీ హెచ్‌డీ, డిస్కవరీ, కార్టూన్ నెట్‌వర్క్ వంటి ప్రధాన లైవ్ టీవీ ఛానెళ్లను ఫోన్ లోనే చూడవచ్చు.

Also Read: విదేశాల్లో ఉద్యోగమని.. బీర్ షాపు ఓనర్‌కు అమ్మేశారు.. బాధితురాలు చెప్పింది వింటే కన్నీళ్లు ఆగవు!

ఇప్పుడే రీఛార్జ్ చేయెుచ్చు!

ఈ కొత్త రూ. 550, రూ. 2000 జియో ఓటీటీ పాస్‌లను ఇవాళ నుంచే రీఛార్జ్ చేసుకోవచ్చు. కావాలంటే ఇప్పుడే ప్లాన్ ను సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం కస్టమర్లు మై జియో యాప్ (MyJio app) లోని రీఛార్జ్ సెక్షన్ కు వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే అధికారిక జియో వెబ్‌సైట్, సమీపంలోని జియో రిటైల్ స్టోర్ల ద్వారా కూడా ఈ సరికొత్త ఓటీటీ పాస్ ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవచ్చు.

Also Read: జియో చౌకైన 5G ప్లాన్.. దీనిని కొట్టేదే లేదు.. ఓటీటీ, కాల్స్, ఏఐ సేవలు అన్నీ ఫ్రీ!

Tags

Related News

రూ.1,100లోపే అదిరిపోయే స్మార్ట్‌వాచ్ డీల్..వెంటనే కొనేయండి

ఇండియాలో.. పోవా ఏఐ బడ్స్ ప్రో లాంచ్ డేట్ ఫిక్స్! ఫీచర్స్ మాములుగా లేవుగా..

మధ్యతరగతి కుటుంబాలకు పర్ఫెక్ట్ టీవీ.. ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు!

జస్ట్ రూ.2,000కే 4G ఫోన్లా? UPI, టైప్-సి ఛార్జింగ్‌తో లభించే టాప్ 5 ఆప్షన్లు ఇవే!

వర్షాకాలంలో ఫ్రిజ్ టెంపరేచర్ ఎంత ఉండాలి ? కరెంట్ ఆదా చేసే టిప్స్!

ఇయర్‌బడ్స్ వాడుతున్నారా? అయితే ఈ 5 సీక్రెట్ ట్రిక్స్ మీకు కచ్చితంగా తెలిసి ఉండాలి!

ఫ్రిడ్జ్ షెల్ఫ్‌లపై ఫాయిల్ పేపర్ వేసి చూడండి.. దుర్వాసన, జిడ్డు మరకల బాధే ఉండదు!

Big Stories

Advertisement
×