E-Paper
Advertisement

జస్ట్ రూ.2,000కే 4G ఫోన్లా? UPI, టైప్-సి ఛార్జింగ్‌తో లభించే టాప్ 5 ఆప్షన్లు ఇవే!

జస్ట్ రూ.2,000కే 4G ఫోన్లా? UPI, టైప్-సి ఛార్జింగ్‌తో లభించే టాప్ 5 ఆప్షన్లు ఇవే!
Advertisement

Best 4G Feature Phones: ఈ ఆధునిక యుగంలో స్మార్ట్‌ఫోన్లు ఎంత వేగంగా విస్తరిస్తున్నా.. కీప్యాడ్ ఫోన్ల క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. వాడటానికి చాలా సులభంగా ఉండటం, బ్యాటరీ రోజులు తరబడి రావడం వల్ల చాలామంది వీటిని ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్లకు ఇవ్వడానికి లేదా ప్రైమరీ ఫోన్ల రద్దీ నుంచి కాస్త విరామం తీసుకుని ‘డిజిటల్ డిటాక్స్’ అవ్వాలనుకునే వారికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ప్రసుతం రూ.2,000 బడ్జెట్లో మంచి ఫీచర్లు, UPI సపోర్ట్, 4G VoLTE క్లారిటీతో లభిస్తున్న కొన్ని బెస్ట్ ఆప్షన్లను ఇప్పుడు చూద్దాం.

Karbonn K1 4G

తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి ఇది సరైన ఛాయిస్. ఈ మొబైల్ 4G VoLTE కాలింగ్‌తో పాటు స్మార్ట్ యాప్ సపోర్ట్‌ను కూడా అందిస్తుంది. దీనిలో జియో సినిమా, జియోసావన్ వంటివి ముందుగానే వస్తాయి. డిజిటల్ చెల్లింపుల కోసం జియోసౌండ్ పే కూడా ఉంది. దీంతో పాటు ఎఫ్‌ఎమ్ రేడియో, బ్లూటూత్, మెమరీ కార్డ్ సపోర్ట్ ఉన్నాయి. జియోకి చెందిన రూ.123 ప్లాన్‌కు ఇది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది.

HMD 101 4G

Advertisement

సరళంగా, గట్టిగా ఉండే ఫోన్ కావాలనుకుంటే.. HMD 101 4G మంచి ఎంపిక. దీని ప్లాస్టిక్ బాడీ చాలా మన్నికగా ఉంటుంది. 2 అంగుళాల డిస్‌ప్లే, పెద్ద కీప్యాడ్ వల్ల టైపింగ్ చాలా సులభం. దీనిలోని వైర్‌లెస్ ఎఫ్‌ఎమ్, టార్చ్ లైట్, మంచి బ్యాటరీ బ్యాకప్ రోజువారీ వాడకానికి ఎంతగానో ఉపయోగపడతాయి. క్లియర్ వాయిస్ కాల్స్ కోసం ఇది 4G VoLTEని సపోర్ట్ చేస్తుంది.

Also Read: హైయర్ 5-స్టార్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ సగం ధరకేనా? Amazon Saleలో మతిపోయే ఆఫర్!

Lava Action 4G

Advertisement

ఈ ఫోన్ సైజ్ కాస్త చిన్నగా ఉన్నప్పటికీ.. ఫీచర్ల విషయంలో దేనికీ తగ్గదు. ఇందులో ఫొటోలు తీయడానికి డిజిటల్ కెమెరా ఇచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ బడ్జెట్లో టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం అతిపెద్ద ప్లస్ పాయింట్. దీంతో వేరే ఛార్జర్లు వెతుక్కోవాల్సిన పని ఉండదు. బ్లూటూత్, ఎఫ్‌ఎమ్, మంచి బ్యాటరీ లైఫ్ వంటి అవసరమైన అన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

itel Super Guru 4G MAX

పెద్ద స్క్రీన్ ఇష్టపడే వారికి ఇది బాగా నచ్చుతుంది. దీనిలో 3 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో పాటు 2,000mAh భారీ బ్యాటరీని ఇచ్చారు. AI వాయిస్ అసిస్టెంట్, బ్లూటూత్ కాలింగ్, కెమెరా, స్మార్ట్ యాప్ సపోర్ట్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. సాధారణ ఛార్జర్ కాకుండా దీనికి ప్రత్యేకంగా ఒక ఛార్జింగ్ డాక్ రావడం మరో విశేషం.

Nokia 106 4G

విశ్వసనీయతకు మారుపేరైన నోకియా నుంచి వచ్చిన ఈ ఫోన్ చాలా బలమైనది. ఇందులో యూపీఐ (UPI) సపోర్ట్ ఉండటం వల్ల చాలా సులభంగా డబ్బులు పంపవచ్చు. అలాగే ఈ ఫోన్‌లో ఉన్న 1,450mAh బ్యాటరీ సాధారణ వాడకానికి దాదాపు వారం రోజుల పాటు వస్తుంది. నాణ్యమైన కాలింగ్ ఎక్స్‌పీరియన్స్, ఎఫ్‌ఎమ్ రేడియో, బ్లూటూత్ కావాలనుకునే వారికి ఇదొక సేఫ్ ఆప్షన్ అవుతుంది.

Also Read: ల్యాప్‌టాప్‌ను మించిన ఫీచర్లు.. బడ్జెట్ ధరలోనే, Amazon Saleలో దుమ్మురేపుతున్న ట్యాబ్లెట్లు ఇవే!

Tags

Related News

రూ.1,100లోపే అదిరిపోయే స్మార్ట్‌వాచ్ డీల్..వెంటనే కొనేయండి

ఇండియాలో.. పోవా ఏఐ బడ్స్ ప్రో లాంచ్ డేట్ ఫిక్స్! ఫీచర్స్ మాములుగా లేవుగా..

మధ్యతరగతి కుటుంబాలకు పర్ఫెక్ట్ టీవీ.. ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు!

జియో బిగ్ ఆఫర్.. కొత్తగా రూ.550, రూ.2000 ప్లాన్లు.. ఫ్రీగా 15 ఓటీటీలు, 1000+ ఛానెళ్లు!

వర్షాకాలంలో ఫ్రిజ్ టెంపరేచర్ ఎంత ఉండాలి ? కరెంట్ ఆదా చేసే టిప్స్!

ఇయర్‌బడ్స్ వాడుతున్నారా? అయితే ఈ 5 సీక్రెట్ ట్రిక్స్ మీకు కచ్చితంగా తెలిసి ఉండాలి!

ఫ్రిడ్జ్ షెల్ఫ్‌లపై ఫాయిల్ పేపర్ వేసి చూడండి.. దుర్వాసన, జిడ్డు మరకల బాధే ఉండదు!

Big Stories

Advertisement
×