E-Paper
Advertisement

రూ.1,100లోపే అదిరిపోయే స్మార్ట్‌వాచ్ డీల్..వెంటనే కొనేయండి

రూ.1,100లోపే అదిరిపోయే స్మార్ట్‌వాచ్ డీల్..వెంటనే కొనేయండి
Advertisement

BoAt Storm Call 3 Review: ప్రస్తుత డిజిటల్ కాలంలో స్మార్ట్‌వాచ్‌లు కేవలం సమయం చూసే.. యంత్రాలుగా మాత్రమే కాకుండా.. మన ఫిట్‌నెస్, స్టైల్‌ను తెలిపే ముఖ్యమైన గ్యాజెట్‌గా మారిపోయాయి. మరి వేల రూపాయలు ఖర్చు చేసి ప్రీమియం వాచ్‌లు కొనలేకపోయే వారి కోసం ప్రముఖ ఆడియో అండ్ వేరబుల్స్ బ్రాండ్ బోట్ ఎప్పుడూ ముందుంటుంది. ఆ కోవకే చెందిన boAt Storm Call 3 స్మార్ట్‌వాచ్ ఇప్పుడు టెక్ మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి ఇది ఎంతవరకు బెస్ట్ ఆప్షన్ ఓ ఇప్పుడు  చూద్దాం.

boAt Storm Call 3 స్మార్ట్‌వాచ్ ఫీచర్లు:

1.డిజైన్,డిస్‌ప్లే క్వాలిటీ:

ఈ స్మార్ట్‌ వాచ్ ప్రీమియం లుక్‌తో.. స్క్వేర్ డయల్ డిజైన్‌ను కలిగి ఉంది. దీనిలో పెద్దదైన హెచ్‌డీ డిస్‌ప్లేను అందించడం వల్ల ఎండలో కూడా స్క్రీన్‌పై ఉన్న అక్షరాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. స్టైలిష్ స్ట్రాప్స్, లైట్‌వెయిట్ బాడీ కారణంగా చేతికి పెట్టుకున్నప్పుడు ఎలాంటి బరువు అనిపించదు. డైలీ వాడకానికి , వర్కవుట్‌ చేసే సమయంలో ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది.

2. బ్లూటూత్ కాలింగ్ :

Advertisement

ఈ బడ్జెట్‌లో లభించే అతి పెద్ద హైలైట్ ఏంటంటే.. ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉండటం. వాచ్‌లోనే మైక్ , స్పీకర్ బిల్ట్-ఇన్ చేసి ఉండటం వల్ల ఫోన్ తీయకుండానే.. నేరుగా వాచ్‌ నుంచే కాల్స్ మాట్లాడొచ్చు. అంతే కాకుండా ఇందులో లభించే ‘టర్న్-మ్యాప్ నెవిగేషన్’ఫీచర్ సహాయంతో ప్రయాణం చేసేటప్పుడు డైరెక్షన్స్ చూసుకోవడం మరింత ఈజీ అవుతుంది.

3. హెల్త్ ఫిట్‌నెస్ ట్రాకింగ్ :

ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే వారి కోసం ఇందులో రక రకాల హెల్త్ సెన్సార్లు ఉన్నాయి. హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్, స్లీప్ ట్రాకింగ్ వంటి వాటితో పాటు పలు రకాల స్పోర్ట్స్ మోడ్స్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది. మనం రోజువారీ చేసే వాకింగ్, రన్నింగ్ వంటి యాక్టివిటీలను ఇది ఖచ్చితంగా ట్రాక్ చేస్తుంది.

Advertisement

Also Read: భారత్‌లో.. పోవా ఏఐ బడ్స్ ప్రో లాంచ్ డేట్ ఫిక్స్! ఫీచర్స్ మాములుగా లేవుగా..

4. బ్యాటరీ బ్యాకప్, ఇతర ఫీచర్లు:

ఈ స్మార్ట్‌ వాచ్ బ్యాటరీ లైఫ్ చాలా అద్భుతంగా పని చేస్తుంది. సాధారణ వాడకంలో.. ఇది సింగిల్ ఛార్జ్‌తో ఎక్కువ రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. అలాగే.. దీనికి ఐపీ రేటింగ్ ఉండటం వల్ల చెమట పడినా లేదా చిన్నపాటి వర్షంలో తడిచినా.. ఎలాంటి సమస్య ఉండదు. క్విక్ రిప్లైస్, కెమెరా కంట్రోల్, మ్యూజిక్ కంట్రోల్ వంటి మరిన్ని స్మార్ట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

5.ధర :

అన్ని లేటెస్ట్ ఫీచర్లతో వస్తున్న ఈ మోడల్ అసలు ధర తక్కువగా ఉన్నప్పటికీ.. అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లలో సేల్స్ సమయంలో .. ఇది కేవలం రూ.1,099ధరకే అందుబాటులోకి వస్తోంది. ఈ బడ్జెట్‌లో బ్లూటూత్ కాలింగ్ వాచ్ దొరకడం నిజంగా అద్భుతం అనే చెప్పాలి.

రూ. 1,100 లోపు బడ్జెట్‌లో స్టైలిష్ లుక్, బ్లూటూత్ కాలింగ్ , ఫిట్‌నెస్ ఫీచర్లు కోరుకునే వారికి ఈ గార్జెట్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. తక్కువ ఖర్చుతో స్మార్ట్ లైఫ్‌స్టైల్ కోరుకునే వారు ఈ వాచ్‌ను కళ్లు మూసుకుని కొనొచ్చు.

Related News

ఆన్‌లైన్ షాపింగ్‌ చేసే..99 % మందికి తెలియని విషయాలు!

ఇంట్లోనే థియేటర్ కిక్..అదుర్స్ అనిపించే 55-ఇంచుల టీవీలు!

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

Big Stories

Advertisement
×